డెంగీతో బాలిక మృతి
వి.కోట: మండల కేంద్రమైన వి.కోటలో వారం రోజులు కూడా గడవక ముందే డెంగీతో మరో బాలిక మృతిచెందింది. పట్టణంలోని బాపూజీ వీధికి చెందిన సిద్దిక్ కుమార్తె ఫాతిమా (3) జ్వరంతో బాధపడుతుండడంతో ఈ నెల 18న వి.కోట పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అనంతరం పలమనేరులో ఉన్న చిన్నపిల్లల డాక్టర్ వద్దకు వెళ్లారు. జ్వరం తగ్గకపోవడంతో కుప్పం పీఈఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి తిరుపతి రుయాకు వెళ్లారు. అక్కడ కూడా జ్వరం అదుపులోకి రాకపోవడంతో వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం బాలిక మృతి చెందింది. మంగళవారం పట్టణంలోనే మేఘన అనే బాలిక డెంగీతో మృతిచెందింది. వారం తిరగకుండానే మరో బాలిక మృత్యువాత పడడం మండల వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. డెంగీపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతోనే రెండు ప్రాణాలు బలయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా వైద్యాధికారి వెంకట్రావ్, జిల్లా, మండల వైద్యబృదం ఫాతిమా ఇంటి పరిసరాలను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment