కూటమిలో కుంపటి
– మరోసారి బయటపడ్డ వర్గపోరు
శ్రీరంగరాజపురం : గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కూటమి పార్టీలో మరొసారి వర్గపోరు బట్టబయలు అయింది. ఎమ్మెల్యే డాక్టర్ థామస్‌కు ప్రభుత్వ విప్ పదవి కేటాయించడంతో మండలంలోని పుల్లూరు గ్రామంలో జనసేన తరపున సన్మాన సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్ రాజేంద్ర, టీడీపీ మండల అధ్యక్షుడు, నాయకులు ఆహ్వానం లేకపోవడంతో పాల్గొనలేదు. ఎటుచూసిన జనసేన జెండాలు దర్శనమిచ్చాయి, టీడీపీ, బీజేపీ జెండాలు కనిపించకపోవడంతో అక్కడికి వచ్చిన కార్యకర్తలు అసహనంతో వెనుతిరిగారు. స్థానిక ఎమ్మెల్యేకు సమస్యలకు తెలియజేయాలన్నా వాట్సాప్‌లోనే తెలియజేయాలని ఎమ్మెల్యే అనడంతో అక్కడికి వచ్చిన ప్రజలు ఖంగుతున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ అన్నారు. అనంతరం జనసేన ఇన్‌చార్జ్ డాక్టర్ యుగంధర్‌పొన్న ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ భవ్య, మండల జనసేన అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు గుండయ్య, పవన్, మురళీమోహన్, కుప్పయ్య, సుమన్, చంద్రమౌళి, రాఘవ పాల్గొన్నారు.
కూటమిలో కుంపటి
Comments
Please login to add a commentAdd a comment