రైల్వే క్రాసింగ్ వద్ద ఇరుక్కున్న లారీ
పుత్తూరు : స్థానిక మరాఠిగేట్ రైల్వే క్రాసింగ్ వద్ద ఆదివారం ఓ భారీ వాహనం ఇరుక్కుపోయింది. గూడ్స్ క్యారియర్ లారీ పుత్తూరు నుంచి నగరి వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకొంది. రైల్వే క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన తొలి ఎత్తు నియంత్రణ తండ వాలాన్ని దాటుకున్న లారీ రెండవ తండవాలం వద్ద ఇరుక్కుపోయింది. దీంతో అరగంట పాటు రాకపోకలు స్తంభించాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తమై లారీ టైర్లలోని గాలిని తగ్గించడం ద్వారా లారీ ఎత్తు తగ్గి వాహనం ముందుకు సాగింది. దీంతో రాకపోకలు సాగాయి. లారీ డ్రైవర్‌ను స్థానిక రైల్వే పోలీసులు విచారిస్తున్నారు.
ఏడు పశువులు చోరీ
తవణంపల్లె: మండలంలోని నాలుగు గ్రామాల్లో శనివారం రాత్రి ఏడు పశువులు చోరీకి గురైనట్లు తవణంపల్లె పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితుల కథనం.. మండలంలోని తడకర, మిట్టపల్లె, ఎగువ తవణంపల్లె, తవణంపల్లెలో ఇంటి దగ్గర కట్టేసి ఉన్న ఏడు పశువులను దొంగలు చాకచక్యంగా అపహరించారు. దీనిపై బాధితులు తవణంపల్లె పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment