కట్టుదిట్టంగా సీఎం భద్రతా ఏర్పాట్లు
గంగాధర నెల్లూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మార్చినెల 1న చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు మండలంలో పింఛన్ల పంపిణీ నేపథ్యంలో మంగళవారం జీడి నెల్లూరు హరిజన వాడ, సభావేదిక, హెలిప్యాడ్ ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సుమిత్ కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పి.వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే థామస్‌తో కలసి పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ నిర్వహణ, ప్రజా వేదిక, పింఛన్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక సంబంధిత అంశాలపై సమన్వయకర్తతో కలెక్టర్, ఎస్పీ చర్చించారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, ట్రాన్స్‌కో ఈఈ నాగరాజు , డీఈ సురేష్, ఎంపీడీఓ హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
పలమనేరులో ఐహెచ్‌పీ ల్యాబ్
● ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇక్కడే ఏర్పాటు
పలమనేరు : పలమనేరు ఏరియా ఆస్ప త్రిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆధునీకరించింది. ఇప్పుడున్న సౌకర్యాలు, సువిశాలమైన ఆస్పత్రి ప్రాంగణాన్ని ప రిశీలించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మంజూరైన అయిదు ఐహెచ్‌ఎఫ్ ల్యాబ్ లో ఒక ల్యాబ్‌ను పలమనేరుకు కేటాయించారు. ఇంటర్నల్ హెమరాజిక్ ఫ్యాసిమెనిన్ జియోసిస్ అని పిలవబడే ఈ ల్యాబ్‌ను రూ.40 లక్షల నాబార్డు నిధులతో ఇక్కడి ఆస్పత్రిలోని నాలుగు గదుల్లో పనులు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పనుల పురోగతిని స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బుధవారం ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్, వైద్యులు, ఆస్పత్రి సలహా మండలి సభ్యులతో కలసి చర్చించారు. అన్ని రకాల వైరల్ టెస్టులతో పాటు బయాప్సీ పరీక్షలు కూడా ఈ ల్యాబ్‌లో చేయనున్నారు. బయాప్సీ టెస్ట్‌ల కోసం ఇప్పటి దాకా ముంబై, చైన్నె, పూణె లాంటి ల్యాబ్‌లకు పంపేవారు. ఈ నివేదికలు నెలల తర్వాతగాని అందేవి కాదు. గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో నాలుగు ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేసింది. ఇందులో పలమనేరు ఒకటి. ల్యాబ్ ఏర్పాటైతే ఇందులో వైరాలజిస్ట్‌లు, ఫాథాలజిస్ట్‌లు, అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.
కట్టుదిట్టంగా సీఎం భద్రతా ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment