జీడీ నెల్లూరులో డీపీఆర్సీ శిక్షణ భవనం
● రూ.2 కోట్ల నిధులు విడుదల
● 8 వేల అడుగులలో నిర్మాణం
చిత్తూరు కార్పొరేషన్ : జీడీ నెల్లూరులో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం (డీపీఆర్సీ) శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి శాఖాపరంగా అనుమతులు వచ్చాయి. స్థలం ఎంపిక, నిధులు విడుదల పూర్తయింది. డీపీఆర్సీ కార్యాలయం ప్రస్తుతం జెడ్పీలో ఉంది. జిల్లాలోని పలు పథకాలు, అంశాల మీద సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మండలాలు లేదా జెడ్పీ కార్యాలయం, లేదా అద్దె భవనాలు తీసుకొని శిక్షణ తరగుతులు నిర్వహిస్తున్నారు. ఇది వ్యయంగా మారడంతో కొత్త భవనం కోసం నివేదిక పెట్టారు. గతంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలకు ఎక్కువగా శ్రీకాళహస్తిలోని ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ)లో నిర్వహించేవారు. జిల్లాల విభజన తర్వాత చిత్తూరులో పెట్టాలని ప్రతిపాదన పెట్టారు. తర్వాత చిత్తూరు, జీడీ నెల్లూరు ప్రాంతాలను మొదట ఎంపిక చేసి స్థలాన్వేషణ చేశారు. చివరిగా జీడీ నెల్లూరులో ఏర్పాటుకు స్థలం దొరికింది. 8 వేల చదరపు అడుగులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం రూ.2 కోట్లు నిధులు విడుదల అయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్నట్లు పీఆర్ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో సమావేశ మందిరం, డీపీఆర్సీ కార్యాలయం, హాలు, డైనింగ్‌హాలు, కిచెన్, స్టోర్ రూమ్, సీ్త్ర, పురుషుల విశ్రాంతి గది, టాయిలెట్స్‌ను నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment