ఉత్తీర్ణత సర్టిఫికెట్లు తీసుకెళ్లండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులు ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ పరీక్ష ఉత్తీర్ణత చెందిన సర్టిఫికెట్‌లను తీసుకోవాలని డీఈఓ వరలక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. 03–03–2024 లో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత చెందిన టీచర్లు డీఈఓ కార్యాలయంలో సర్టిఫికెట్‌లు తీసుకోవాలన్నారు. ఉత్తీర్ణత చెందిన టీచర్లు తప్పనిసరిగా హాల్ టికెట్ జిరాక్సులను తీసుకురావాలని డీఈఓ కోరారు.
రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఈ మేరకు గురువారం ఆ సంఘం నాయకులు డీఈఓ వరలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్ల సర్వీస్ రెగ్యులరైజేషన్ జాబితా 2010 డీఎస్సీ వరకు మాత్రమే నిర్వహించారన్నారు. మిగిలిన డీఎస్సీల రేషనలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో జాబితాలు అప్‌లోడ్ చేయాలని కోరారు. గతంలో విడుదల చేసిన సీనియారిటీ జాబితాను పునఃసమీక్షించాలన్నారు. మెరిట్ కమ్ రోస్టర్‌లో సీనియారిటీ జాబితా సిద్ధం చేసి వెంటనే విడుదల చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే ఆమోదించాలన్నారు. అనంతరం ఆపస్ డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీఆర్‌ఎస్‌ఎం ఇంటర్మీడియట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌చంద్ర, ఆపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజునాథగుప్తా, విజయ్, గౌరవాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మీడియా కన్వీనర్ రాధాకృష్ణ, గౌరవ సలహాదారు ఉమాపతి పాల్గొన్నారు.
ఎస్వీయూ దూరవిద్యకు అనుమతులు
తిరుపతి సిటీ: ఎస్వీయూ దూరవిద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే కోర్సులకు 2024 – 25 సంవత్సరానికి యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనుమతులు మంజూరు చేసింది. జనవరిలో యూజీసీ నిపుణుల బృందం వర్సిటీలో మూడు రోజులు పర్యటించింది. అనుమతుల మంజూరుకు సంబంధించిన అర్హతలపై యూజీసీకి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో యూజీసీ గురువారం ఎస్వీయూ దూరవిద్య కోర్సులకు 2024–25 విద్యా సంవత్సరం నుంచి అనుమతులు మంజూరు చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీంతో వర్సిటీ డీడీఈ విభాగంలో 17 కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా డీడీఈ కోర్సుల పునరుద్ధరణకు, అనుమతులు రావడానికి కృషి చేసిన వర్సిటీ బోధన, బోధనేతర సిబ్బందికి వీసీ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నారు.
ఉత్తీర్ణత సర్టిఫికెట్లు తీసుకెళ్లండి
Comments
Please login to add a commentAdd a comment