చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ముసుగు ధరించిన నలుగురు దొంగలు దుర్గానగర్ కాలనీలో హల్‌చల్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత దుర్గానగర్ ప్రాంతంలో నలుగురు వ్యక్తులు ముఖాలకు మంకీ క్యాప్, ముసుగులు ధరించి కాలనీలో సంచరించారు. ఓ ఇంటికి తాళం వేసి ఉండగా అక్కడ చోరీ చేయడానికి ప్రయత్నించారు. స్థానికులు కేకలు వేయడంతో దొంగల వద్ద ఉన్న క్యాటర్‌బాల్ (పిచ్చుకల్ని కొట్టే ఉండేలు)తో రాళ్లు పెట్టుకుని స్థానికులపై విసిరారు.ఈ నిందితులంతా హిందీలో మాట్లాడినట్లు, ఆయుధాలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పటికే పోలీసు వాహనం గస్తీలో ఉండటంతో దొంగలు పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఈ దృశ్యాలన్నీ ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయి.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడైనా దొంగల సంచారం తెలిస్తే, పోలీసుల సాయం తీసుకోవాలని.. వెంటనే డయల్ 100, 112 నంబర్లతో పాటు వన్‌టౌన్ 9440796705, 9440796707, టూటౌన్ 9440796706, 9491074517 నంబర్లకు సమాచారం ఇవ్వాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment