టీడీపీ ఎంపీటీసీ రాజీనామా
పలమనేరు: పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి–2 ఎంపీటీసీ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఆ మేరకు స్థానిక ఎంపీడీఓ ఖాదర్‌బాషాకు తన రాజీనామా లేఖను శనివారం అందజేశారు. కూటమి రాజకీయాలు నచ్చక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తాను పదవికి రాజీ నామా చేసినట్లు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ పంచాయతీలో జరుగుతున్న కొన్ని సంఘటనలే రాజీనామాకు కారణమని తెలుస్తోంది.
నేటి సమాజానికి భారతీయ జ్ఞాన పరంపర అందాలి
తిరుపతి సిటీ : నేటి ఆధునిక సమాజానికి భారతీయ జ్ఞాన పరంపర అందించాలని, ఇందులో అధ్యాపకుల పాత్ర కీలకమని మహిళా వర్సిటీ వీసీ ఆచార్య ఉమ, జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఎస్వీయూ మాలవ్య మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (ఎంఎంటీటీసీ)లో యూజీసీ సహకారంతో భారతీయ జ్ఞాన పరంపర – సమాజ పురోగతి అనే అంశంపై వారం రోజులుగా చేపట్టిన శిక్షణ శనివారం ముగిసింది. వారు మాట్లాడుతూ మన ప్రాచీన సంప్రదాయాలైన ఆయుర్వేదం, నీటి సంరక్షణ, పంటల సాగు, గురుకుల విద్య, సాంకేతిక స్థితి, ప్రాచీన విజ్ఞానం వంటివి ఆధునిక సమాజానికి అనుసంధానించాలన్నారు. అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు అధ్యాపకులకు ఈ శిక్షణ కార్యక్రమం ప్రధానమైందన్నారు. యూజీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అనోల్ ఆండ్రే మాట్లాడుతూ ప్రాచీన భారత జ్ఞాన పరంపర పరిరక్షణ ఆధునిక సమాజంలో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా శిక్షణ చేపట్టిందన్నారు. ఈ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా లక్ష మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో 100 మంది అధ్యాపకులు శిక్షణ తీసుకున్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 52,731 మంది స్వామిని దర్శించుకున్నారు. 17,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కాను కల రూపంలో హుండీలో రూ.3.24 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని వారికి 8 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
టీడీపీ ఎంపీటీసీ రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment