మహిళా వర్సిటీ విద్యార్థినులకు అభినందన
తిరుపతి సిటీ : తమిళనాడు కన్యాకుమారి వివేకానంద కాలేజ్ వేదికగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఎన్‌ఎస్‌ఎస్ చైన్నె ప్రాంతీయ డైరెక్టరేట్ సంయుక్తంగా గత నెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ సమైక్యతా శిబిరం శుక్రవారం ముగిసింది. పలు రాష్ట్రాల ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం, విభిన్న సంస్కృతులపై అవగాహన పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా శిబిరం నిర్వహించారు. ఇందులో మహిళా వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్ లీడర్‌గా డాక్టర్ యువశ్రీ, వలంటీర్స్ రేణుశ్రీ, పావని, లిఖిత, కామాక్షి, వాణి, శైలజ పాల్గొన్నారు. ఈ శిబిరంలో పలు సేవా దృక్పథంతో కూడిన నైపుణ్యాలను ప్రదర్శించి అధికారుల మన్ననలు పొందారు. వారిని ఆదివారం పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య రజని, కోఆర్డినేటర్ ఆచార్య విద్యావతి, అధ్యాపకులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment