నా బిడ్డను బతికించండి
● చేతికందివచ్చిన కొడుకు ఆసుపత్రి పాలు ● మెదడు వ్యాధితో నెలన్నరగా పోరాడుతున్న యువకుడు ● ఆదుకోవాలని ఓ తల్లి వేడుకోలు
పుత్తూరు : చేతికందివచ్చిన బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా అగాథంలో కూరుకుపోయింది. బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ తల్లి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. వివరాలు ఇలా.. పుత్తూరు మండలం కేఎం అగ్రహారం గ్రామానికి చెందిన వేలాయుదం ఆచారీ, అంబిక దంపతుల కుమారుడు చిరంజీవి (27), పావని(29) ఇద్దరు సంతానం. పావనికి వివాహం చేసి పంపించారు. వేలాయుదం తిరుమలలో అవుట్ సోర్సింగ్ వడ్రంగి ఉద్యోగిగా పనిచేస్తుండగా, అంబిక అగ్రహారంలోని అంగన్‌వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కగానొక్క కుమారుడు చిరంజీవి(27) జనవరి 17వ తేదీన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కంగారు పడిన తల్లి కుమారుడిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా వారు ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పడంతో స్విమ్స్‌లో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మెదడులో రక్తం గడ్డ కట్టిందని, చైన్నెలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దీంతో చైన్నెలోని విజయా ఆసుపత్రిలో చేర్పించా రు. అక్కడ చిరంజీవికి ఆపరేషన్‌కు సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేశా రు. మరో ఆపరేష న్ చేయాలని అందుకు మరో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని ఆదివారం డాక్టర్లు చెప్పడంతో అంబిక దంపతులు నిర్ఘాంత పోయారు. ఉన్న ఇల్లును అమ్మి ఆపరేషన్‌కు నగదు సర్దుబాటు చేశామని, ఇప్పుడు మళ్లీ లక్షలు అవసరం కావడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లింది. తమ పరిస్థితిని మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నగరి ఎమ్మెల్యే తన బిడ్డను కాపా డాలని వేలాయుద ఆచారీ, అంబిక దంపతులు వేడుకుంటున్నారు. తన కుమారుడు ఇలా ఒక్కసారిగా కు ప్పకూలడానికి మూడు రోజుల ముందే భర్త వేలాయుద ఆచారీకి గుండె నొప్పి రావడంతో తిరుపతిలో స్టంట్ వేయించుకొచ్చామని, వెంటనే తన బిడ్డను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని అంబిక విలపి స్తూ తెలిపారు. చిరంజీవి ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఇలా జరిగిందని, తన బిడ్డను కాపాడాలని బాధిత దంపతులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment