గ్రంథం..అంధకారం
జిల్లా కేంద్ర
గ్రంథాలయం
కూటమి పాలనలో గ్రంథాలయాలు అలంకారప్రాయంగా మారాయి. ఈ విజ్ఞాన భాండాగారాలకు సెస్ పరంగా దక్కాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. రూపాయిలో ఎనిమిది పైసలు గ్రంథాలయాలకు సెస్ రూపంలో చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా గ్రంథాలయాల ఉనికి ప్రమాదంలో పడింది. జిల్లాలో దాదాపు రూ. 37 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో గ్రంథాలయాల సేవలు మొక్కుబడిగా మారాయి.
పేద విద్యార్థులకు శాపం
జిల్లాలో 71 గ్రంథాలయాలు ఉండగా నిత్యం 80 వేల మంది పాఠకులు సేవలు పొందుతున్నారు. స్థానిక సంస్థల నుంచి సెస్ సకాలంలో వసూలు కాకపోవడంతో గ్రంథాలయాల్లో అరకొరగా వసతులు ఉన్నాయి. ముఖ్యంగా పుస్తకాలు సైతం తగిన స్థాయిలో లేవని పాఠకులు అంటున్నారు. త్వరలో డీఎస్సీ పరీక్షలు ఉన్న కారణంగా జిల్లాలో వేల మంది యువత వీటికి సన్నద్ధం అవుతున్నారు. వాటితో పాటు వివిధ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధం అవుతున్నారు. వీరిలో అత్యధిక మంది సామాన్య, పేద అభ్యర్థులే ఉంటారు. వీరంతా పోటీ పరీక్షల పుస్తకాలు, పేపర్లు కొనే ఆర్థిక స్థోమత లేక సమీపంలోని గ్రంథాలయాలకు వెళ్లి చదువుకుంటారు. కానీ అక్కడ అరకొరగా పుస్తకాలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు కార్పొరేషన్ : విజ్ఞాన భాండాగారాలుగా పేరుపొందిన గ్రంథాలయాలు ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ పూర్తి స్థాయిలో వసూలు కాకపోవడంతో సమస్యలు వేధిస్తున్నాయి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏటా ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయి. ఆ పన్నుల్లో నుంచి లైబ్రరీలకు చెల్లించాల్సిన సెస్ వాటాను మాత్రం సక్రమంగా జమ చేయడంలేదు. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో నుంచి 8 శాతం గ్రంథాలయాలకు సెస్‌గా చెల్లించాలి. ఈ నిబంధన అమలుకు నోచుకోకపోవడంతో గ్రంథాలయాలు ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. సెస్ బకాయి ఏటా పెరుగుతూ దాదాపు రూ.37 కోట్ల వరకు చేరాయి. ఈ బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినా ఫలితం కనిపించడం లేదు.
రూపాయికి 8 పైసలు సెస్
ఉమ్మడి జిల్లాలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, పంచాయతీల పరంగా గ్రంథాలయ సంస్థకు సెస్ చెల్లింపులు జరగడంలేదు. ఈ బకాయిలు రూ.37 కోట్లకు చేరాయి. 2015–16 నుంచి బకాయిలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలు వసూలు చేసిన పన్నుల్లో రూపాయికి ఎనిమిది పైసల చొప్పున గ్రంథాలయ సంస్థకు సెస్ చెల్లించాలి. కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు కూడా ఇదే నిబంధనను అనుసరించాలి.
సెస్ ద్వారా వచ్చిన సొమ్ముతో గ్రంథాలయాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు పుస్తకాలు, మ్యాగజైన్లు, దిన, వార, మాస పత్రికలను పాఠకులకు అందుబాటులో ఉంచే వీలు ఉంటుంది. సెస్‌లో కొంత మొత్తమే జమ చేయడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో బకాయిలు ఇలా..
తిరుపతి నగరపాలక సంస్థ రూ.26.63 కోట్లు, చిత్తూరు నగరపాలక రూ.5.90 కోట్లు, శ్రీకాళహస్తి రూ.1.29 కోట్లు, నగరి మున్సిపాలిటీ రూ.42 లక్షలు, కుప్పం మున్సిపాలిటీ రూ.13 లక్షలు, పుంగనూరు మున్సిపాలిటీ రూ.11.05 లక్షలు, పంచాయతీల పరంగా రూ.2.50 కోట్లు కలిపి మొత్తం రూ.37 కోట్లు వరకు రావాల్సి ఉంది. వీటి వసూళ్లకు చర్యలు చేపడుతున్నట్లు గ్రంథాలయ అధికారులు చొరవ తీసుకుంటున్నా ఫలితం దక్కడం లేదు.
విజ్ఞాన భాండాగారాలపై బకాయిల భారం
వసూలైన పన్నుల్లో 8 శాతం గ్రంథాలయాలకు చెల్లించాలనే నిబంధన
పట్టించుకోని పంచాయతీ, పురపాలికలు
సమస్యల వలయంలో విజ్ఞాన కేంద్రాలు
ఇప్పటికే రూ.37 కోట్లకు పైగా బకాయి
పూర్తి స్థాయి మెటీరియల్ లేదు
స్థానిక సంస్థలు సెస్ సకాలంలో పూర్తిగా చెల్లించాలి. అప్పుడే గ్రంథాలయాలకు అన్ని సౌకర్యాలు సమకూరుతాయి. పాఠకులతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు లైబ్రరీలను ఆశ్రయిస్తుంటారు. కానీ నేడు లైబ్రరీల్లో అరకొరగా వసతులు ఉంటున్నాయి. పూర్తి స్థాయి మెటీరియల్ ఉండడం లేదు.
– భరత్ , విద్యార్థి
అసంతృప్తిగా ఉంది
డిగ్రీలు, టీటీసీ, బీఈడీల అనంతరం చాలా మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు. పేద విద్యార్థులు పుస్తకాలు అన్నీ కొనుగోలు చేయలేరు. వారు సమీపంలోని లైబ్రరీల్లో అన్ని వసతులు ఉంటాయని వెళ్తుంటారు. కావాల్సిన పేపర్లు, పుస్తకాలు లేకపోతే అసంతృప్తిగా ఉంటుంది. ఉన్నతాధికారులు, నేతలు గ్రంథాలయాలను బలోపేతం చేయాలి.
– నాని, విద్యార్థి
గ్రంథం..అంధకారం
గ్రంథం..అంధకారం
గ్రంథం..అంధకారం
గ్రంథం..అంధకారం
Comments
Please login to add a commentAdd a comment