● మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం ● నోట
ముఖ్యంగా గుర్తించు కోవాల్సినవి..
● 6వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే ఓసీ, బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2013 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 35 మార్కులు పొంది ఉండాలి. వీరికి పరీక్ష ఫీజు రూ.150 ఉంటుంది.
● 6వ తరగతిలో ప్రవేశం పొందే ఎస్సీ, ఎస్టీ కులా లకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2015 ఆగస్ట్ 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. వీరు కనీసం 30 మార్కులు పొంది ఉండాలి. పరీక్ష ఫీజు రూ.75 చెల్లించాలి.
● సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో 4, 5 తరగతుల్లో చదివి ప్రమోషన్‌కు అర్హత పొంది ఉండాలి.
● పరీక్షలో వచ్చే మార్కులు, రూల్ ఆఫ్ రిజిర్వేషన్ ప్రాతిపాదికన సీట్లు కేటాయిస్తారు.
● ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. 5వ తరగతి స్థాయిలో ఉండే ఈ పరీక్షను తెలుగు/ఇంగ్లీష్ మీడియంలో రాయవచ్చు.
● cse.ap.gov.in (లేదా) apms.ap.gov.in వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్స్)లలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతోంది.
సీటు చాలా విలువైనది..
పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకు రావడమే ధ్యేయంగా ఏపీ మోడల్ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. వెనుకబడిన మండలాలను గుర్తించి ఈ పాఠశాలలను ప్రారంభించారు. ఇందులో ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించడంతోపాటు విద్యా కానుక కిట్లు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. తొమ్మిది నుంచి ఇంటర్ వరకు చదివే బాలికలకు కార్పొరేట్ తరహా హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. పూర్తి ఇంగ్లీష్ మీడియంతో సత్ఫలితాలను సాధిస్తున్న మోడల్ స్కూల్/జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందడం అంత సులువు కాదు. ప్రైవేటు పాఠశాలల్లో ఎంతో ఖర్చు పెట్టి నా అందుబాటులో లేని నాణ్యమైన ఇంగ్లీషు మీడియం విద్య, ఇక్కడ అందుబాటులో ఉండడం పేద పిల్లలకు వరంగా మారింది.
జిల్లాలో 7 మోడల్ స్కూల్స్ వివరాలు
జిల్లాలో నడిమూరు (కుప్పం మండలం), అగరం గ్రామం (గుడుపల్లి), తుమ్సి (శాంతిపురం), కమ్మనపల్లి (బైరెడ్డిపల్లి), ఏఎన్‌కుంట (పుంగనూరు), రామకుప్పం, రొంపిచెర్ల మండలాల్లో మొత్తం 7 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ఒక్కో చోట 100 సీట్లు చొప్పున మొత్తం 700 మందిని ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఇలా..
2025–26 విద్యా సంవత్సరానికిగాను ఈనెల 24వ తేదీ నుంచి నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు పేమెంట్స్‌కు అవకాశం కల్పించారు. అలాగే దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభించారు. ఆన్‌లైన్ పేమెంట్స్‌కు మార్చి 31వ తేదీతో గడువు ముగియనుంది. గతేడాది మాదిరిగానే 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న మోడల్ స్కూల్‌లోనే ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. మెరిట్ లిస్టు ఆధారంగా రోస్టర్ ప్రకారం సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్ 27న మెరిట్‌లిస్టు, అదేరోజు ఎంపిక జాబితాను వెల్లడించనున్నారు. ఏప్రిల్ 30న సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
సదుపాయాలు ఇలా..
నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సువిశాల ప్రాంగణాలతో రెండంతస్తుల భవనాలను కలిగి ఉన్నాయి.
ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా బోధన.
విశాలమైన తరగతి గదులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ఉచిత విద్య.
బయాలజీ, పిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు పూర్తిస్థా యి పరికరాలతో వేర్వేరుగా ల్యాబ్‌లు ఉన్నాయి.
అత్యాధునిక లాంగ్వేజ్ లాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
నీట్, జేఈఈ, ఎంసెట్, ఎన్‌ఎంఎంఎస్, ఐఎంవో, ఐఎస్వో వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
స్పోకెన్‌న్ ఇంగ్లీష్, చేతిరాతపై ప్రత్యేక శ్రద్ధ. అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయం.
ఎల్‌సీడీ ప్రొజెక్టర్‌తో విద్యా బోధన, డిజిటల్ విద్యా బోధనకు అవకాశం.
9వ తరగతి నుంచి అకడమిక్ విద్యకు సమాంతరంగా కనీసం రెండు ఒకేషనల్ కోర్సులు.
మోడల్ స్కూళ్లకు సమీప గ్రామాల అనుసంధానంతో కూడిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.
పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మోడల్ స్కూల్ ప్రవేశాల ప్రక్రియపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో ఏపీ మోడల్ స్కూళ్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేశాయి. ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోంది. ఇంజినీరింగ్, మెడిిసిన్ వంటి కోర్సులకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. – వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు జిల్లా
● మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం ● నోట
● మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం ● నోట
● మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం ● నోట
● మోడల్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం ● నోట
Comments
Please login to add a commentAdd a comment