చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల ఉద్యోగోన్నతులు చేపట్టాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు డీఈఓ వరలక్ష్మికి గురువారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగోన్నతుల జాబితా కసరత్తు పారదర్శకంగా చేపట్టాలన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్, ప్రత్యేక ప్రతిభావంతుల టీచర్ల ఉద్యోగోన్నతుల జాబితా విడుదలకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహన్‌రెడ్డి, మోహన్ మాట్లాడుతూ.. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు అర్హత ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్‌లు జిల్లాలో ఉన్నారన్నారు. వారికి సంబంధించిన సీనియారిటీ జాబితాను విడుదల చేయాలన్నారు. వివిధ సబ్జెక్టుల్లో విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగోన్నతులకు కేటాయించిన పోస్టులు భర్తీ చేయాలన్నారు. పాస్‌పోర్టు, ఎన్‌వోసీ తదితర అంశాలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చంద్రన్, డిల్లీబాబు, సుబ్రహ్మణ్యం, ఉమాపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment