ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ఒకరి డిబార్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక అభ్యర్థిని డిబార్ చేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్ అక్బర్ బుధవారం జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిత్తూరులోని సంతపేట పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ఒక అభ్యర్థిని ఆ యన డిబార్ చేశారు. అనంతరం పరీక్షల నిర్వహణలో అలసత్వం వహిస్తున్న ఇన్విజిలేటర్, చీఫ్, డిపార్ట్‌మెంట్ అధికారులపై చర్యలు తీసుకోవా లని విద్యాశాఖాధికారులకు సిఫార్సు చేశారు. జిల్లాలో ఈ నెల 5వ తేదీన నిర్వహించిన పరీక్షకు 2,747 మంది అభ్యర్థులకుగాను 2,302 మంది హాజరయ్యారు. మిగిలిన 444 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది 15 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు.
అమ్మవారి సేవలో
ఫుడ్ కమిషన్ చైర్మన్
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయనకు ఈఓ తీర్థప్రసాదాలు అందజేయగా, వేదపండితులు ఆశీర్వచనం పలికారు.
వెబ్‌సైట్‌లో పది హాల్ టికెట్లు
చిత్తూరు కలెక్టరేట్: పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009లో కూడా హాల్‌టికెట్‌లు పొందే వెసులుబాటు క ల్పించారన్నారు. అలాగే www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, మీ డియం, ఫొటో, సంతకం తదితర వివరాలు త ప్పుగా ఉంటే వెంటనే సంబంధిత హెచ్‌ఎంలు dir_govexams@yahoo.com మెయిల్‌కు ఫి ర్యాదు చేయాలన్నారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించవచ్చని ఆమె వెల్లడించారు.
డీవైఈఓ పరీక్షలు రాసే
టీచర్లకు మినహాయింపు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో డీవైఈఓ మెయిన్స్ పరీక్షలు రాసే టీచర్లకు పదో తరగతి పరీక్షల విధుల మినహాయింపు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేర కు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామ రాజు జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం డీఈఓ కార్యాలయానికి అందాయి. జిల్లాలో డీవైఈఓ మెయిన్ పరీక్ష రాసే టీచర్లకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధులు కేటాయించకూడదన్నారు. మార్చి 26, 27వ తేదీల్లో అర్హత గలవారికి సెలవు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంగ్లిష్ పరీక్షకు
577 మంది గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 577 మంది గైర్హాజరయ్యారని డీవైఈఓ సయ్యద్ మౌలా తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా లోని 50 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 12196 మందికి గాను 11715 మంది హాజరుకాగా, 480 మంది గైర్హాజరయ్యారన్నారు. వొకేషనల్ విద్యార్థులు 1808 మందికి గాను 1711 మంది హాజరుకాగా 97 మంది గైర్హాజరైనట్లు డీవైఈఓ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment