పుత్రశోకం
ప్రతి రోజు కళ్లముందు తిరుగుతున్న ఇద్దరు కుమారుల్లో ఒకరు కానరాని లోకాలకు వెళ్లిపోగా, మరొకరు మృత్యువుతో పోరాడుతూ ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో ఆ తల్లిదండ్రులకు కలిగిన శోకం వర్ణనాతీతం.
నగరి/విజయపురం: పుత్తూరు– చైన్నె జాతీయ రహదారి పిళ్లారిపట్టు వందనవైన్స్ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో రవిశేఖర్ (19) అనే విద్యార్థి మృతి చెందగా మునికుమార్ (20) అనే మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. అన్నదమ్ములైన ఈ విద్యార్థులు కళాశాలకు వెళుతుండగా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్, ద్విచక్రవాహాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పుత్తూరు మండలం గట్టు గ్రామానికి చెందిన మంజునాథ, లక్ష్మి దంపతులు వీధుల్లో కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నారు. వీరికి రవిశేఖర్, మునికుమార్ ఇద్దరు సంతానం. పెద్దవాడు మునికుమార్ పుత్తూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం, రెండో కుమారుడు రవిశేఖర్ బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటి నుంచి కళాశాల దూరంగా ఉండడంతో వీరు రోజు ద్విచక్రవాహనంలో కళాశాలకు వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం యథావిధిగా అన్నదమ్ములిద్దరూ ద్విచక్రవాహనంలో కళాశాలకు బయలుదేరారు. మార్గం మధ్యలోని పిళ్లారిపట్టు వందనవైన్స్ సమీపంలో ఓ ట్రాక్టర్ రాంగ్‌రూట్‌లో వచ్చి వారి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవిశేఖర్ (19) అక్కడికక్కడే మరణించగా, మునికుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లముందు ఆడుతూ పాడుతూ తిరిగే కొడుకుల్లో ఒకరు మరణించగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్న ఆ ఘటన చూసి, ఆ తల్లిదండ్రులు పడుతున్న తపన, ఆవేదన అందరినీ కలిచివేసింది. గట్టు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ట్రాక్టర్ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో ఒక కుమారుడి మృతి, మరో కుమారుడి పరిస్థితి విషమం
పుత్రశోకం
Comments
Please login to add a commentAdd a comment