సీఏ ఫలితాల్లో ఎమరాల్డ్స్ విజయ కేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : సీఏ ఇంటర్, ఫౌండేషన్ ఫలితాల్లో తిరుపతిలోని ఎమరాల్డ్స్ విద్యాసంస్థ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేసినట్లు ఆ సంస్థ డైరెక్టర్లు ఈ.గిరిధర్, కె.విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఏ ఇంటర్ కోర్సులో సాయిప్రమోద్ 321, మనోజ్ 320 మార్కులు సాధించారని, వీరితో పాటు 59.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే సీఏ ఫౌండేషన్ కోర్సులో ఎస్‌ఐ.నందిని, డి.పల్లవి, డి.మీన, పి.చందనప్రియ, కె.రిషతతో పాటు 68.76 శాతం మంది ఉతీర్ణత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని వారు అభినందించారు.
8న ఉమ్మడి జిల్లాలో
జాతీయ లోక్‌అదాలత్
చిత్తూరు అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో చెక్‌బౌన్స్, మోటారు వాహన కేసులు, డీవీసీ, బ్యాంకు, బీఎస్‌ఎన్‌ఎల్, చిట్‌ఫండ్, బీమా, రెవెన్యూ, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. వివరాలకు సమీపంలోని పోలీస్‌స్టేషన్, చిత్తూరు కోర్టు భవనాల్లో ఉన్న లీగల్‌సెల్ భవనంలో సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment