గుడుపల్లె : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాల్లో పీఈఎస్ మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ హెచ్‌ఆర్ కృష్ణారావు తెలిపారు. జనవరి–2025లో నిర్వహించిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 146 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 133 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. డిస్టింక్షన్ 16, ఫస్ట్ క్లాస్ 67, సెకెండ్ క్లాస్ 50 మంది సాధించారని తెలిపారు. ఇందులో ధార్మిక శ్రేష్ట 81%, ఆస్తాగోల్ 80%, లక్ష్మీ మానస 80%, భవిష్యా 80%, శ్రీదీప్తి 80%తో టాపర్లుగా నిలిచారు. టాపర్లుగా నిలిచిన వైద్య విద్యార్థులకు పీ ఈ ఎస్ కళాశాల అధ్యాపకులు అభినందించారు.
ఎంబీబీఎస్ ఫలితాల్లో పీఈఎస్ హవా!
ఎంబీబీఎస్ ఫలితాల్లో పీఈఎస్ హవా!
ఎంబీబీఎస్ ఫలితాల్లో పీఈఎస్ హవా!
ఎంబీబీఎస్ ఫలితాల్లో పీఈఎస్ హవా!