
రైస్ మిల్లులో చోరీ
పుత్తూరు: పట్టణంలోని నెత్తం గ్రామం వద్ద ఉన్న రైస్ మిల్లులో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో చోరీ జరిగింది. దుండగులు మిల్లు తలుపుల తాళాలు పగలగొట్టి, ఏసీ, ఇన్వట్టర్‌ను చోరీ చేసేందుకు ప్రయత్నించారు. స్థానికులు గుర్తించి కేకలు పెట్టడంతో దుండగులు పారిపోయారు. విషయం తెలుసుకుని మిల్లు వద్దకు వచ్చిన యజమాని బాలసుబ్రమణ్యం మిల్లులో అమర్చిన సీసీ కెమెరాలు, హార్డ్‌డిస్క్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఓబయ్య తెలిపారు.