కార్వేటినగరం : నియోజకవర్గం అభివృద్ధికి అడ్డుపడితే ఎవరినీ సహించబోనని, అయ్యా అయ్యా అంటూ సలాం కొట్టేవాడిని కాదు..నన్ను రెచ్చగొడితే వేరే లాంగ్వేజ్‌లో మాట్లాడుతా అని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. శనివారం పెనుమూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యా, అయ్యా అంటూ అగ్రకులస్తుల కు సలాం కొట్టే వాడ్ని నేను కాదూ. నన్ను రెచ్చ గొడితే ఎవ్వరనని చూడను వేరే భాషలో మాట్లా డుతా అని టీడీపీ నాయకులను హెచ్చరించారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరూ అధికార పార్టీకి మారినప్పుడు ఏమయ్యారు మీరంతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటూ తనని విమర్శించే వారిని క్షమించబోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను ఆర్డినరీ ఎమ్మెల్యేను కానూ ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన మేధావిని, నాకు ప్రపంచ దేశాల్లో కార్లు, బంగళాలు ఉన్నాయి. వేరేవారి వద్ద మీ పప్పులు ఉడకవు కాబట్టే ఈ థామస్ వద్ద చూపిస్తున్నారు. మీడియా ముందు కాబట్టి పచ్చి బూతులు తిట్టలేకపోతున్నా..అంటూ టీడీపీలో ఉంటూ తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఎమ్మెల్యే విరుచుకుపడ్డాడు. నేను దళితుడనే చులకన భావంతో చూస్తున్నారా...? నేను దళితుడైనంత మాత్రం మీకు వంగి వంగి సలాంలు కొట్టాలా..? నాకు అంతటి కర్మ పట్టలేదు. నాకు తిక్కరేగిందా మీ అంతు చూస్తానని హెచ్చరించారు. దళితుడంటే అంత చులకనా మీకు మీరు ఎవ్వరితోనైనా పెట్టుకొండి ఈ థామస్‌తో డ్రామా లు ఆడితే మీకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉంటా పేదల కోసం రాజకీయానికి వచ్చా, మీకు వంగి, వంగి నమస్కారాలు చేసేందుకు కాదని దుయ్యబట్టారు. ఎస్సీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికే ఎస్సీ నియోజకవర్గంగా కేటాయించారు. ఎస్సీలను తక్కువ చూస్తే ఊరుకునేది లేదని పత్రికలు కూడా ఎస్సీల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దళితుడు అయితే వంగి సలాం కొట్టాలా?
మేయర్లు, డిప్యూటీ మేయర్లు మారినప్పుడు ఏమయ్యారు మీరంతా
దళితులను చిన్న చూపు చూస్తే ఊరుకొనేది లేదు
టీడీపీ నాయకులపై ఎమ్మెల్యే థామస్ ఫైర్