చిత్తూరు కార్పొరేషన్ : రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. రైల్వే ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా.. స్థానిక సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన హేమకుమార్ (31) చిత్తూరు– తిరుపతి ఇంటర్‌సిటీ రైలులో వెళ్తుండగా చిత్తూరు సమీపంలోని ఘగర్ ఫ్యాక్టరీ వద్ద కాలు జారీ పడ్డారన్నారు. తీవ్రగాయాలతో ఉన్న అతడిని రైల్వే సిబ్బంది గుర్తించి 108కి సమాచారం ఇచ్చారన్నారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.