కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని హుండీ ద్వారా ఆలయానికి రూ. 1.34కోట్ల ఆదాయం వచ్చిందని ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం ఉదయం లెక్కించారు. ఇందులో గోసంరక్షణ హుండీ ద్వారా రూ.7,300, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.40,404 వచ్చిందన్నారు.
యూఎస్‌ఏవీ 620 డాలర్లు, ఇంగ్లాడ్‌వి 10 పౌండ్స్, యూరోవి 10 యూరోలు, కెనడావి 50 డాలర్లు, ఆస్ట్రేలియావి 20 డాలర్స్, మలేషియావి 4 రింగిట్స్, సింగపూర్‌వి 11 డాలర్స్ వచ్చాయన్నారు. బంగారం 31 గ్రాములు, వెండి 2.420 కిలోలు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఏసీ చిట్టెమ్మ, ఏఈఓలు కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.34 కోట్లు