
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
కుప్పం : కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని కొత్తపేట వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన కుప్పం వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు చెప్పారు. మృతుడికి 30 సంవత్సరాల వయస్సు కలిగి, చామనఛాయ రంగు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సంబంధిత రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని సైకిలిస్టు దుర్మరణం
చిత్తూరు అర్బన్ : నగర శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పార్థసారథి (55) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంగారెడ్డిపల్లికి చెందిన ఆయన చిత్తూరు సైకిల్ రైడర్స్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారు. రోజూ తలకు హెల్మెట్ ధరించి సైకిల్ రైడ్‌కు వెళ్లడం పార్థసారథికి అలవాటు ఈ క్రమంలో తిరుపతి రోడ్డు నుంచి చిత్తూరు వైపు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో దురదృష్టవశాత్తు హెల్మెట్ ఇంట్లో మరిచిపోయి.. అలాగే సైకిల్ రైడ్‌కు వచ్చేశారు. సైకిల్ నుంచి కిందపడి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్థసారథి మృతిపై చిత్తూరు సైకిల్ రైడర్స్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
బాలుడిని ఢీకొట్టిన వ్యాను
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని ప్రశాంత్‌నగర్ కాలనీ సమీపంలో లీలాద్రి (8) అనే బాలుడిని వ్యాను ఢీ కొట్టడంతో పరిస్థితి విషమంగా మారింది. తమిళనాడుకు చెందిన రాజా అనే వ్యక్తి రాజంపేట నుంచి అరటికాయలను తీసుకుని వానియంబాడీకు వెళ్లడానికి గూగుల్ మ్యాప్ ద్వారా వ్యాను నడుపుతూ బయలుదేరాడు. వాహనం ప్రశాంత్‌నగర్ కాలనీలోని వైఎస్సార్ కాలనీ సమీపానికి వస్తుండగా రోడ్డు దాటుతున్న లీలాద్రి అనే బాలుడిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి పక్క టెముకలు విరగడంతో రాణిపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాలూకా ఎస్‌ఐ మల్లికార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ బోల్తా..తప్పిన ప్రమాదం
గంగవరం : మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో గోశాల వద్ద శనగల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న లారీ గోశాల వద్ద అదుపు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పుంగనూరు : పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండుకు చెందిన అష్రఫ్ (25) ద్విచక్ర వాహనంపై వస్తుండగా కారు ఢీకొని గాయపడ్డాడు.వివరాలు ఇలా.. బుధవారం ద్విచక్ర వాహనంలో బయటకు వెళ్లి తిరిగి పుంగనూరుకు వస్తుండగా మార్గ మధ్యలోని గుడిసెబండ సమీపంలో కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అష్రఫ్‌ను స్థానికులు గమనించి అంబులెన్స్‌లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య