డీఎంలకు ఉత్తర్వులు జారీ చేసిన డీపీటీఓ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తమిళనాడులోని వేలూరు బస్టాండులో చిత్తూరు ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తిరుపతి–వేలూరు సర్వీసుల్లో చిత్తూరంటే బస్సు దిగేమంటున్నారని, అర్ధరాత్రి అవస్థలు పడుతున్నార ని ఫిర్యాదులు చేశారు. దీనిపై సాక్షి దినపత్రికలో గతవారం ‘చిత్తూరా సీటు లేదు’, ‘వేలూరు బస్టాండులో రగడ’ అనే పేరిట కథనాలొచ్చాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించారు.
తమిళనాడులోని వేలూరు బస్టాండులో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వేలూరు నుంచి వచ్చే చిత్తూరు వాళ్లు రాత్రి పూట ఇబ్బంది పడకూడదని డీపీటీఓ జగదీష్‌కు వివరించారు. ఇకపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయనకు తెలియజేశారు.
16వ తేదీన సంకటహర చతుర్థి
కాణిపాకం : ఈనెల 16వ తేదీన కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో సంకటహర చతుర్థి గణపతి వ్రతం జరగనున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమవుతోందన్నారు. ఈ సేవలకు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చునని పేర్కొన్నారు.