
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
చౌడేపల్లె : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలైందని, ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. బుధవారం పులిచెర్ల మండలం కొత్తపేటలో పెద్దిరెడ్డిని వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు కలిసి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల సంగతిపై పోరాటం చేయాలని పెద్దిరెడ్డి కోరారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు. కూటమి దౌర్జన్య కాండపై ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీలు శ్రీరాములు, లక్ష్మి నర్సయ్య , నేతలు మోహన్, శ్రీనివాసులు తదితరులున్నారు.