
● గాడి తప్పిన ఇంటర్మీడియట్ విద్య ● ఇంటర్ ప్రథమ సంవత్స
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 32 మండలాల్లో 139 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరంలో జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 28,261 మంది పరీక్షలకు హాజరయ్యారు. గత ఐదు సంవత్సరాల్లో వైఎస్సార్‌సీపీ సర్కారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు– నేడు పథకం అమలు చేసింది. ఆ పథకంలో కార్పొరేట్ కళాశాలలకు తలదన్నే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా గత సర్కారు చర్యలు చేపట్టింది. అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ కళాశాలలపై చిన్నచూపు చూస్తోంది. దీంతో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఆఖరి స్థానంలో నిలిచింది.
డీలా పడ్డ సర్కారు కళాశాలలు
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో సర్కారు జూనియర్ కళాశాలలు డీలా పడ్డాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ ప్రైవేట్ కళాశాలలతో పోల్చుకుంటే అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. ఎంతో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పటికీ ఫలితాల సాధనలో ఎందుకు పరుగులు పెట్టలేకపోతున్నారనే ప్రశ్నలు విద్యావేత్తల్లో తలెత్తుతున్నాయి. లోపం ఎక్కడుంది ? ఎందుకు విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంటర్మీడియట్ అధికారులు, కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
జిల్లాలో ఫలితాలు ఇలా ...
జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం ఫలితాల్లో చిత్తూరు జిల్లా 54 శాతం ఫలితాలతో రాష్ట్రంలో చిట్టచివరి 26వ స్థానంలో నిలిచింది. అదే విధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 74 శాతం ఫలితాలతో రాష్ట్రంలో 24వ స్థానంలో నిలిచింది.
మే 12వ తేదీ నుంచి సప్లిమెంటరీ
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫెయిలైన వారు, ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు 22వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రీ వెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్ట్‌కు రూ.1300, రీ కౌంటింగ్ ఒక్కో సబ్జెక్ట్ కు రూ.260 చెల్లించాల్సి ఉంటుంది. ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు ఆర్ట్స గ్రూపునకు రూ.1350, సైనస్ గ్రూపునకు రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది.
మేనేజ్‌మెంట్‌ల వారీగా ప్రథమ సంవత్సరం ఫలితాలు ఇలా.. మేనేజ్‌మెంట్ పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణత చెందిన ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులు
ప్రభుత్వ 2,481 1,172 1,309
ప్రైవేట్ 9,362 5,189 4,173
హైస్కూల్ ప్లస్ 361 140 221
మోడల్ స్కూల్స్ 511 312 199
కేజీబీవీ 176 133 43
ఏపీ రెసిడెన్షియల్స్ 292 222 70
మొత్తం 13,183 7,168 6,015
మేనేజ్‌మెంట్‌ల వారీగా ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇలా.. మేనేజ్‌మెంట్ పరీక్షలకు హాజరైన ఉత్తీర్ణత చెందిన ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులు
ప్రభుత్వ 2,160 1,514 646
ప్రైవేట్ 8,321 6,175 2,146
హైస్కూల్ ప్లస్ 288 185 103
మోడల్ స్కూల్స్ 441 349 92
కేజీబీవీ 227 180 47
ఏపీ రెసిడెన్షియల్స్ 325 271 54
మొత్తం 11,762 8,674 3,088
తొందరపాటు నిర్ణయాలొద్దు
విద్యార్థులు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 54 శాతం, ద్వితీయ సంవత్సరంలో 74 శాతం ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 47 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంప్రూవ్‌మెంట్ కు సంబంధిత కళాశాలల్లో ఫీజు చెల్లించి మే 12 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరుకావచ్చు. – సయ్యద్ మౌలా, జిల్లా ఇంటర్మీడియట్ డీవీఈవో

● గాడి తప్పిన ఇంటర్మీడియట్ విద్య ● ఇంటర్ ప్రథమ సంవత్స