
ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని కమాండ్ కంట్రోల్ విభాగాన్ని ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, డయల్–112 పనితీరు విభాగం, ఫిర్యాదులపై ఎంత సమయంలో స్పందిస్తున్నారనే విషయాలను ఆయన తనిఖీ చేశారు. మహిళలు, పిల్లల సంరక్షణ కోసం వినియోగిస్తున్న ‘శక్తి’ యాప్‌లో ఫిర్యాదు వస్తే ఎలా స్పందిస్తున్నారు..? నగరంలోని ప్రధాన కూడళ్లల్లో ఏర్పాటు చేసిన కెమెరాల పర్యవేక్షణ..? పై ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట కమాండ్ కంట్రోల్ ఎస్‌ఐ సహదేవి, కమ్యూనికేషన్ ఎస్‌ఐ భరత్ ఉన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జడ్జీల బదిలీ
చిత్తూరు అర్బన్ : చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం ఉత్తర్వు లు జారీ చేసింది. చిత్తూరు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎస్‌పిడి.వెన్నెలను గుంటూరు జిల్లా రేపల్లెకు, ఈమె స్థానంలో పీలేరులో పనిచేస్తున్న కె.రవిను చిత్తూరుకు బదిలీ చేశారు. మదనపల్లె ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న డి.వెంకటేశ్వర్లును అనంతపురం జిల్లా హిందూపురానికి , ఈయన స్థానంలో కృష్ణా జిల్లా గన్నవరంలో పనిచేస్తున్న కె.జయలక్ష్మిను నియ మిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
జలజీవన్ పనులను
పరిశీలించిన కేంద్ర బృందం
కార్వేటినగరం : కార్వేటినగరం మండలంలో జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను కేంద్ర బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కార్వేటినగరం దళితవాడలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్‌ను నీటిని పరిశీలించారు. జలజీవన్ మిషన్ కేంద్ర నిపుణులు అన్బ్‌జగన్ మాట్లాడుతూ.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. మండల వ్యాప్తంగా చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఈఈ నరేంద్రకుమార్, డీఈ సతీష్ కుమార్, ఏఈ గిరిష్ కుమార్, సర్పంచ్ ధనంజయవర్మ, కార్యదర్శి నా గరత్నమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి : ఎస్పీ