
సమస్తిపూర్/పట్నా: బిహార్‌లో కల్తీమద్యం తాగి మూడు రోజుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సమస్తీపూర్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురు, శుక్రవారాల్లో గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో 33 మంది చనిపోయారు. తాజాగా, శనివారం సమస్తీపూర్ జిల్లా పటోరీ పోలీస్‌స్టేషన్ పరిధి రుపౌలీ పంచాయతీలో ఆర్మీ, బీఎస్‌ఎఫ్ జవాన్లు ఇద్దరు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్‌పీ మానవ్‌జీత్ ధిల్లాన్ చెప్పారు. బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment