ban alcohol
-
Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్
గాంధీనగర్: మద్యపాన నిషేధం నుంచి గిఫ్ట్ సిటీని మినహాయిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం.. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ‘వైన్ అండ్ డైన్’ సేవలకు అనుమతి ఇచ్చింది. అయితే మద్య నిషేధంలో గాంధీనగర్ జిల్లాలోని (గిఫ్ట్ సిటీ)లో మినహాయిచడాన్ని ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గుజరాత్ మొత్తం వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపుతుందని మండిపడ్డారు. ‘గాంధీనగర్ గిఫ్ట్ సిటీలో మద్య నిషేధం లేకపోతే.. ఇక్కడి ప్రజలు మద్యం సేవిస్తారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఒక వ్యతిరేక ప్రభావం పడుతుంది’ అని శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గిఫ్ట్ సిటీలో మద్య నిషేదం ఎత్తివేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి లాభం చేకూరుతుందో తనకు అర్థం కావటం లేదని విమర్శించారు. గుజరాత్ ప్రభుత్వం గిఫ్ట్ సిటీలో ఉద్యోగులు, అధికారులు, సందర్శకులకు మద్యం నిషేధం ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రస్తుతం మందు బాటిళ్ల అమ్మకానికి అనుమతి లేదు. చదవండి: ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్ ఇయర్ -
40కి చేరిన కల్తీ మద్యం మరణాలు
సమస్తిపూర్/పట్నా: బిహార్‌లో కల్తీమద్యం తాగి మూడు రోజుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. సమస్తీపూర్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గురు, శుక్రవారాల్లో గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లో 33 మంది చనిపోయారు. తాజాగా, శనివారం సమస్తీపూర్ జిల్లా పటోరీ పోలీస్‌స్టేషన్ పరిధి రుపౌలీ పంచాయతీలో ఆర్మీ, బీఎస్ఎఫ్ జవాన్లు ఇద్దరు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ మానవ్‌జీత్ ధిల్లాన్ చెప్పారు. బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. -
తాగితే ఉద్యోగం ఊడబీకుడే: సీఎం సంచలన నిర్ణయం
పాట్నా: రాష్ట్రంలో విధించిన సంపూర్ణ మద్య నిషేధాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న బిహార్ ప్రభుత్వం తాజాగా మరింత పక్కాగా అమలు చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు కూడా మద్యం తాగకూడదని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసుల అంశంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దీనికి సంబంధించిన విషయమై ఆదేశాలు జారీ చేశారు. బిహార్‌లో సంపూర్ణ మధ్య నిషేధం 2016లో అమల్లోకి వచ్చింది. మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేయడానికి సీఎం నితీశ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేసే బాధ్యతను చౌకీదార్లకు అప్పగించిన విషయం తెలిసిందే. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తూ దొరికితే దానికి బాధ్యులుగా చౌకీదారులపై చర్యలు తీసుకోవాలనే ఆదేశాల ఉండడంతో పక్కాగా మద్య నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు సంపూర్ణంగా మద్యం నిషేధంలో భాగంగా పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో పోలీసులు ఎవరైనా మద్యం తాగి విధుల్లోకి వస్తే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం నితీశ్ నిర్ణయించారు. పోలీసులు ఎవరైనా తాగి కనిపిస్తే వారిని తక్షణమే డిస్మిస్ చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసులంతా తాము మద్యం తాగబోమని ప్రతిజ్ఞ కూడా చేయాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ విధంగా బిహార్‌లో సంపూర్ణ మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే రెండేళ్లుగా మద్య నిషేధం అమల్లో ఉన్నా మద్యం సేవించిన పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ విధంగా ఏకంగా 400 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు -
కిక్కు తగ్గింది!
నూజెండ్ల మండలానికి చెందిన సుబ్బారావు (పేరు మార్చాం) కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు. కుమారుడు పదో తరగతి, కుమార్తె ఇంటరీ్మడియెట్ చదువుతున్నారు. కూలికి వెళ్లితే రోజుకు రూ.400 వస్తుంది. పది నెలల కిందట వరకూ రోజు వారీ వచ్చే కూలి డబ్బుల్లో రూ.300 తాగుడుకే ఖర్చు చేసేవాడు. ఇక సుబ్బారావు మిగిలి్చన రూ.100తో పాటు అతని భార్య వ్యవసాయ కూలి పనులకు వెళ్లగా వచ్చే రూ.200తో సంసారాన్ని నెట్టుకొచ్చేది. ఆర్థిక ఇబ్బందులతో కూతురు, కుమారుడిని కూడా బడి మాన్పించి అప్పుడప్పుడు పనులకు తీసుకువెళ్లేది. ఈ క్రమంలో ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా బెల్టు షాపులు ఎత్తేయడం, మద్యం దుకాణాలు కుదించడంతో వారి గ్రామ పరిధిలో మద్యం సరిగా దొరకడంలేదు. తాగాలంటే మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. దీనికి తోడు ధరలు బాగా పెరిగాయి. దీంతో సుబ్బారావు నెమ్మదిగా మద్యానికి దూరంగా జరగడం మొదలు పెట్టాడు. గత ఏడెనిమిది నెలల నుంచి పూర్తిగా మద్యం తాగడం మానేశాడు. కూలి డబ్బులు మొత్తం ఇంట్లోనే ఇస్తున్నాడు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆర్థికంగా నిలబడి సంతోషంగా ఉంది. సాక్షి, గుంటూరు: ఇది ఒక సుబ్బారావు కుటుంబం సంతోషమే కాదు. మద్యం రక్కసి నుంచి బయటపడిన ఎందరో కుటుంబాల్లో వికసిస్తున్న ఆనందం. జిల్లాలో దశల వారీ మద్య నిషేధం సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గడం ఇందుకు నిదర్శనం. ♦గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 353 మద్యం షాపులు, 185 బార్లు ఉండేవి. మరో నాలుగు వేల వరకూ బెల్టుషాపులు గ్రామాల్లో అందుబాటులో ఉండేవి. ♦వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టగానే బెల్టు షాపులను రద్దు చేశారు. మద్యం షాపుల సంఖ్యను 20 శాతం కుదించారు. ♦ఈ ఏడాది జూన్ నుంచి మరో 13 శాతం దుకాణాలను రద్దు చేయడంతో ప్రస్తుతం జిల్లాలో మద్యం దుకాణాలు 239 మాత్రమే ఉన్నాయి. ♦దీనికి తోడు మద్యాన్ని ప్రజల నుంచి దూరం చేయడంలో భాగంగా మద్యం రేట్లను పెంచడం, మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గింది. ♦ప్రస్తుతం జిల్లాలో లిక్కర్ విక్రయాలు 52 శాతం, బీర్ల విక్రయాలు 81 శాతం మేర తగ్గాయి. ♦పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏటా 10 శాతం మేర మద్యం విక్రయాలు పెరుగుతాయనేది ఎక్సైజ్ శాఖ అంచనా. అయితే అందుకు విరుద్ధంగా మద్యం విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
మద్యం కిక్.. నిషేధంతో చెక్
బెల్టు షాపుల ఏర్పాటుతో రేయింబవళ్లు మద్యం దొరుకుతోంది. మద్యం తాగినవారు ఇతరులతో ఘర్షణ పడటం సర్వసాధారణంగా మారింది. ఇక తాగినవారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. విసుగు చెందిన గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. మద్యం విక్రయాలు నిషేధించాలని తీర్మానం చేశారు. పదేళ్లుగా మద్య నిషేధం కొనసాగుతుండటంతో వారు ఆశించిన ఫలితాలు సాధించారు. గ్రామాల్లో గొడవలు తగ్గాయి. గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. మద్యం అమ్మిన వారికి జరిమానా మందాపూర్ గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.30 వేల జరిమానా విధిస్తామని తీర్మానం చేశారు. తీర్మానం ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా విధించారు. ఆ డబ్బును పంచాయతీ ఖాతాలో జమచేశారు. ఇక చేవెళ్ల గ్రామంలో కూడా మద్యం వికయ్రించిన వ్యక్తికి రూ.10 వేలు జరిమాన విధించారు. దీంతో మద్యం విక్రయాలు తగ్గాయి. రాంపూర్, వెంకటరావుపేట, ముప్పారం, అప్పాజిపల్లి, రెడ్డిపల్లి, సీతానగర్‌లో మద్యం విక్రయాలపై నిషేధం కొనసాగుతోంది. మందాపూర్‌లో మద్య నిషేధంపై తీర్మానం చేసిన గ్రామస్తులు (ఫైల్) అల్లాదుర్గం మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది పంచాయతీలలో మద్యం అమ్మకాల నిషేధం అమలు చేస్తున్నారు. పదేళ్లుగా గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతోంది. మండల పరిధిలోని కాయిదంపల్లి, రాంపూర్, సీతానగర్, రెడ్డిపల్లి, వెంకట్రావుపేట, చేవెళ్ల, ము ప్పారం, అప్పాజిపల్లి, మందాపూర్ గ్రామాలలో మద్యం విక్రయాలను నిషేధించారు. మండలంలో మద్య నిషేధం అమలు చేసిన మొదటి గ్రామం కాయిదంపల్లి. ఈ గ్రామంలో మద్యం అమ్మకాలతో గ్రామస్తులు మద్యానికి బానిసలయ్యారు. దీంతో వీరి కుటుంబాలు వీధులపాలవుతున్నాయి. అంతేకాకుండా మద్య ం మత్తులో ఇతరులతో ఘర్షణ పడేవారు. గమనించిన గ్రామ పెద్దలు, నాటి సర్పంచ్ సంగమేశ్వర్ 2008లో బెల్ట్ షాపుల రద్దతోపాటు మద్యం విక్రయాలను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే రూ.5 వేల జరిమానా విధించాలని నిబంధనలు రూపొందించి తీర్మానంపై సంతకాలు చేశారు. గత 12 ఏళ్లుగా గ్రామంలో మద్య నిషేధం అమలు చేస్తున్నారు. నిషేధానికి గ్రామస్తులు కట్టుబడి ఉండటం చెప్పుకోదగ్గ విశేషం. ప్రజల సహకారంతో అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేయలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్లాస్టిక్ నిషేధం, మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం. ప్రజలు సహకారం అందిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిపై ఆధారపడిన కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడుతున్నాయి. – భేతయ్య, సర్పంచ్, కాయిదంపల్లి బెల్టు షాపుల నిషేధంతో ప్రశాంతం గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు నిషేధించడంతో గ్రామంలో ప్రశాంత వాతావరణం నేలకొంది. గ్రామంలో గొడవలు తగ్గాయి. పన్నెండేళ్లుగా మద్యం విక్రయాలపై నిషేధం కోనసాగుతుంది. ప్రజల కోరిక మేరకు చర్యలు తీసుకున్నాం. మద్య నిషేధంతో గ్రామాలు అభివృద్ధి బాటపట్టాయి. – సంగమేశ్వర్ , మాజీ సర్పంచ్ జరిమానా విధించాంగ్రామస్తులు, యువకుల సహకారంతో 2019లో గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాం. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేయించాం. మద్యం విక్రయించినందుకు రూ.30 వేలు జరిమానా వేశాం. అప్పటి నుంచి గ్రామంలో బెల్టుషాపుల్లో మద్యం విక్రయించడం లేదు. ప్రతీ గ్రామంలో ఇలాగే మద్యం విక్రయాలను నిషేదిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి.– రాజు, సర్పంచ్, మందాపూర్ -
మళ్లీ తగ్గిన మద్యం దుకాణాలు
విజయనగరం రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నవరత్నాల హామీల్లో ‘దశలవారీ మద్య నిషేధం’ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో ఉన్న మొత్తం మద్యం దుకాణాలను రెండు విడతల్లో 33 శాతం తగ్గిస్తూ చర్యలు తీసుకోవడంతో జిల్లాలో దుకాణాల సంఖ్య భారీగా తగ్గింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చింది. దీంతో దిగువ, మధ్య తరగతి అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రజా సంకల్పయాత్రలో గమనించి దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీనిచ్చారు. గత అక్టోబర్‌లోనే 20 శాతం తగ్గింపు గతేడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన దశలవారీ మద్య నిషేధహామీలో భాగంగా జిల్లాలో అప్పటివరకు ఉన్న 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గిస్తూ 168కి కుదించారు. అప్పటివరకు ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాలను మరింత తగ్గించాలని నిర్ణయిస్తూ మరో 13 శాతం దుకాణాలను తగ్గించి సోమవారం నుంచి అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో దుకాణాల సంఖ్య 142కి తగ్గింది. ఇప్పటికే మద్యం ధరలు పెంచి మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం మద్యం దుకాణాల తగ్గింపుతో మరింత షాకిచ్చిందని చెప్పొచ్చు. -
తగ్గిన మద్యం అమ్మకాలు
జంగారెడ్డిగూడెం: మద్యానికి బానిసలైనవారి బతుకుల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు ప్రసరిస్తున్నాయి. మద్య నిషేధం దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో తగ్గిన మద్యం అమ్మకాలే ఇందుకు నిదర్శనం. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 20 శాతం షాపులు తగ్గించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపుల నిర్వహణ చేపట్టారు. నిరీ్ణత వేళల్లోనే అమ్మకాలు సాగిస్తుండడంతో మద్యం వినియోగం తగ్గుముఖం పట్టింది. జిల్లాలో 18 నుంచి 20 శాతం వరకు మద్యం వినియోగం తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీబీసీఎల్ నేతృత్వంలో మద్యం షాపులను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తున్నారు. అలాగే మద్యం షాపులకు పరి్మట్ రూమ్‌లను రద్దు చేశారు. మద్యం ఎంఆర్పీ ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మద్యం షాపుల్లో ఫ్రిడ్జ్‌లు లేకపోవడంతో బీరుల వినియోగం కూడా గణనీయంగా పడిపోయింది. బెల్టు షాపుల నిర్వహణను నిషేధించడం, కఠినంగా వ్యవహరించడంతో లూజు అమ్మకాలు కట్టడి చేయబడ్డాయి. బెల్టుషాపుల నిర్వాహకులు సుమారు 800 మందిని ఎక్సైజ్ శాఖ బైండోవర్ చేసింది. లెక్కల్లో తగ్గిన కిక్కు : 2018లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు, 2019లో ప్రభుత్వం మద్యం షాపులు ప్రారంభమైన తరువాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలను పోల్చి చూస్తే కేవలం మూడు నెలలకే 18 శాతం మద్యం వినియోగం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2018లోని పై మూడు నెలల్లో జిల్లాలో 9,12,206 మద్యం కేసులు అమ్ముడు కాగా, 2019లో ఇదే మూడు నెలల్లో 7,50,192 మద్యం కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే మూడు నెలలను పోల్చి చూస్తే 1,62,014 మద్యం కేసుల అమ్మకాలు తగ్గాయి. ఇక బీర్లు అయితే 70 శాతం అమ్మకాలు తగ్గాయి. 2018 అదే మూడు నెలల్లో 5,04,844 బీరు కేసుల అమ్మకాలు జరగ్గా, 2019 అదే నెలల్లో కేవలం 1,56,303 కేసులు అమ్ముడయ్యాయి. అంటే మూడు నెలల్లో 3,48,541 కేసులు అమ్మకాలు తగ్గాయి. మద్యం షాపుల్లో సిట్టింగ్‌లు లేకపోవడం, ఫ్రిడ్జ్ సౌకర్యం లేకపోవడంతో బీర్లు వినియోగం తగ్గింది. 20 శాతం మద్యం షాపులు ఏటా తగ్గింపులో భాగంగా జిల్లాలో 377 షాపులు మాత్రమే అనుమతివ్వగా, ప్రస్తుతం 375 షాపులు నిర్వహిస్తున్నారు. చించినాడలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అక్కడ, చిట్టవరంలో కోర్టు కేసు పెండింగ్‌లో ఉండటం వల్ల ఆ రెండు చోట్ల షాపులు లేవు. గతంలో 474 షాపులు ఉండేవి. నాటుసారా, అక్రమ మద్యానికి అడ్డుకట్ట మద్యం వినియోగం తగ్గించడంతో పాటు నాటుసారా, అక్రమ మద్యానికి ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వైపు మద్యం అక్రమంగా రవాణా జరగకుండా రాష్ట్ర సరిహద్దులో 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే నాటు సారా తయారీ, అమ్మకాలపై విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. బెల్లపు ఊటలు ధ్వంసం, నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలు చేసేవారిపై, బెల్టుషాపులపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా మద్యం వినియోగం తగ్గి ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతున్న దిశగా మద్యం పాలసీ ప గణనీయంగా తగ్గింది జిల్లాలో మద్యం షాపులు తగ్గడం, ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం తదితర చర్యలతో అమ్మకాలు తగ్గేందుకు దోహదపడ్డాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా ప్రవేశించకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు, నాటుసారా తయారీ, విక్రయాలు, బెల్టుషాపులపై నిరంతర దాడులు, నిఘా తదితర చర్యలు వినియోగానికి అడ్డుకట్ట వేశాయి. – వి.అనసూయదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ -
ఏపీలో ‘మత్తు’ వదులుతోంది
సాక్షి, అమరావతి: మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబరు నెలలో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గుముఖం పట్టాయి. అంతేకాక ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుండటంతో నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేయడంతో గతానికి భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించిన తాజా వివరాలు ప్రకారం.. 2018 అక్టోబరులో 32,28,366 కేసులు లిక్కర్‌ను విక్రయించగా, 2019 అక్టోబరులో మాత్రం 23,60,089 కేసులు మాత్రమే అమ్మారు. గతేడాది అక్టోబరు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరు నెలలో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయి. అదే బీరు అమ్మకాలు చూసుకుంటే 2018 అక్టోబరులో 23,86,397 కేసులు అమ్ముడు కాగా, ఈ ఏడాది అక్టోబరులో 10,40,539 కేసులు మాత్రమే విక్రయించారు. గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం వచిన తర్వాత రాష్టంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను 4380 నుంచి 3500కు తగ్గించడమే కాకుండా, మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడంతో విక్రయాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేయడం అమ్మకాలు తగ్గడానికి మరో కారణం. బెల్టుషాపులు కనుమరుగు.. మరోవైపు గ్రామాల్లో కూడా బెల్టుషాపులు కనుమరుగయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిరంతరం నిఘా పెంచుతున్నారు. బెల్టుషాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం ఉన్న ప్రదేశాలపై నిఘాను పటిష్టం చేశారు. మద్యం అమ్మకాలు గ్రామాల్లో జరగనీయవద్దంటూ పోలీసులు నేరుగా ఆయా గ్రామంలోని పెద్దలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేస్తున్న అడుగుల్లో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించడం ద్వారా మద్య నియంత్రణ, నిషేధం దిశగా తీసుకుంటున్న చర్యల అమలుపై ప్రభుత్వం తన సంకల్పాన్ని గట్టిగా చాటింది. -
మద్యరహిత రాష్ట్రమే లక్ష్యం
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం క్రైం : మద్యం రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పి. హరికుమార్ వెల్లడించారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం నిషేధం దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం నాలుగు వేలకు పైగా మద్యం షాపులు లైసెన్స్‌లు ఇస్తే ప్రస్తుతం 3,500 మద్యం షాపులు ఇచ్చామని, 20 శాతం తగ్గించామని తెలిపారు. నాటు సారా అరికట్టేందుకు 15 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం లంక గ్రామాల్లో దాడులు నిర్వహించి 2,300 లీటర్ల బెల్లం ఊటను, 150 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నాటు సారా తయారీ, అమ్మకాలు, రవాణా నిర్వహించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నాటు సారా తయారీ చేసే గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా 93 మండలాల్లో 210 గుర్తించామని తెలిపారు. నాటు సారా అరికట్టేందుకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. 16 కొత్త వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న నాటు సారాను అరికట్టేందుకు పోలీసులు, గ్రామవలంటీర్ల సహకారం తీసుకుంటామన్నారు. నాటు సారా తయారీ చేసే వారు, తయారీ చేసేందుకు భూమి ఇచ్చిన యజమాని పైనా పీడీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కువగా కర్నూలు, తూర్పుగోదావరి, యానాం లంక గ్రామాల్లోని తోటలు, భూముల్లో నాటు సారా తయారీ చేస్తున్నారని వివరించారు. సారాను అరికట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లోని ప్రజల సహకారంతో సారా అరికడతామన్నారు. ఈ ఏడాదిలో 30 గంజాయి కేసులు విశాఖ జిల్లా పెద్దబైయలు, జి.కె. వీధి, హుక్కుంపేట, జి. మాడుగల తదితర ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది 30 గంజాయి కేసులు నమోదు చేసి ఆరు వేల కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, 125 వాహనాలు సీజ్ చేసినట్టు తెలిపారు. ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 50 శాతం గంజాయి అక్రమ రవాణాను అరికట్టామని అన్నారు. ఒడిశా రాష్ట్రం సహకారంతో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి పంటలు, రవాణాకు సంబంధించిన సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 18004254868కు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఎం.జయరాజు, సూపరింటెండెంట్ కె.వి.ప్రభుకుమార్, యు.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మంచిరోజులొచ్చాయ్..
పెయింటర్ పనిచేస్తూకుటుంబాన్ని పోషించే నిడదవోలుకు చెందిన విప్పర్తి నాగరాజు మద్యానికి బానిస అయ్యాడు. పనికి వెళ్లినా వచ్చిన డబ్బులతో తాగేవాడు. కొంతకాలానికి లివర్ చెడిపోయి 2016లో మృత్యువాత పడ్డాడు. అతని భార్య కూడా అనారోగ్యంతో ఉండటంతో వృద్ధాప్యం లోనూ నాగరాజు తల్లి సుబ్బలక్ష్మి కూలి పనులకు వెళ్లి ముగ్గురుమనవలను సాకుతోంది. మద్యంకారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయని, తన కుమారుడిని తమకు కాకుండా చేసిన ఆ మద్యం మహమ్మారిని లేకుండా చేయాలని కోరుతోంది.ఇప్పటికైనా దశలవారీ మద్య నిషేధానికి ముందుకు వచ్చిన జగన్మోహనరెడ్డి చాలా మంచి పని చేస్తున్నారని, తన కష్టం ఏ కుటుంబానికి రాకూడదని ప్రార్థిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు, నిడదవోలు: ‘మద్య నిషేధాన్ని గత ప్రభుత్వాలు చేసి ఉంటే మా బతుకుల్లో వెలుగులు ఉండేవి. అలా చేయకుండా గ్రామ గ్రామాన మద్యం దుకాణాలు పెట్టి మా పిల్లలను మాకు కాకుండా చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్రెడ్డి దశల వారీ మద్య నిషేధంతో ముందుకు రావడం మంచి పరిణామం’ అంటూ మద్యం వల్ల తమ భర్తలను, పిల్లలను పొగొట్టుకున్న కుటుంబాలుఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకుండా దశలవారీ మద్య నిషేధాన్ని అమలు చేయాలనుకోవడం మంచి పరిణామమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఏటా 20 శాతం మద్యం షాపులు తొలగిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని నెలల్లోనే ఆయన నిలబెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనమద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఉన్న 474 మద్యం దుకాణాలు ఇప్పుడు 379కి తగ్గిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యంను ఆదాయ వనరుగా, బీరును హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేసిన ప్రభుత్వం ఇంటికి వెళ్లిపోయింది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఇచ్చిన హామీలో భాగంగా మొదటి ఏడాదే షాపులు తగ్గించడంతో పాటు ప్రభుత్వమే నిర్వహణను చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే మద్యం అందుబాటులో ఉండటం లేదు. బెల్టు షాపుల నిర్మూలన, మద్యం అమ్మకాలకు చెక్‌పెట్టడం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో ఉండే మద్యం షాపుల్లో ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మెన్లు, మిగిలిన ప్రాంతాల్లో ఒక సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మెన్లు చొప్పున జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మందికి ఉపాధి దొరికింది. నిడదవోలుకు చెందిన చెరుకూరి పార్వతి భర్త దుర్గామహేష్ (26) పెయింటర్ పనులు చేస్తూ గత ఐదేళ్లుగా మద్యానికి బానిసగా మారాడు. మద్యం అలవాటు కారణంగా కిడ్నీలు పాడైపోయాయి. స్తోమత కొద్ది వైద్యం చేయించినా ఇటీవలే మహేష్ మృతి చెందడంతో కుటుంబ పోషణ అతని భార్యపై పడింది. దీంతో చర్చిపేటలో చిన్న తోపుడు బండి పెట్టుకుని టిఫిన్ అమ్మడం ప్రారంభించింది. అయినకాడికి అప్పులు చేసి చిన్న హోటల్ నడుపుతున్నా ఆశించిన లాభాలు లేకపోవడంతో అర్థికంగా ఇబ్బందులు పడుతోంది. తన ఇద్దరు పిల్లలతోపాటు అత్తను ఆ హోటల్‌పై వచ్చిన ఆదాయంతోనే పోషిస్తోంది. తన భర్త మరణానికి కారణమైన మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని పార్వతి మనస్ఫూర్తిగా కోరుతోంది. అధికారంలోకి రాగానే దశలవారీ మద్య నిషేధానికి ముందడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్‌ను అభినందిస్తోంది. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తే తమలా రోడ్డున పడాల్సిన అవసరం ఏ కుటుంబానికి ఉండదనేది పార్వతి అభిప్రాయం. -
నిషేధానికి తొలి అడుగు..
నెల్లూరు(క్రైమ్): సంపూర్ణ మధ్య నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చల విడిగా విక్రయాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. పలు ఆంక్షలతో విక్రయాలు జరిగాయి. నూతన మద్యంపాలసీ మంగళవారం అమలులోకి వచ్చింది. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 280 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా నాలుగుచోట్ల మినహా మిగిలిన చోట్ల దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మద్యం విక్రయాలు సాగాయి. ప్రతి దుకాణం వద్ద వివరాలు, విక్రయవేళలు, ఎంఆర్పీ ధరలతో పాటు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ముద్రించిన ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేశారు. పడిగాపులు కాసిన మందుబాబులు... గతంలో ఉదయం 10గంటలకే మద్యందుకాణాలు ప్రారంభమయ్యేవి. దీంతో మందుబాబులు పదిగంటల నుంచి మద్యసేవనంలో మునిగితేలేవారు. అయితే తాజాగా మారిన వేళల ప్రకారం ఉదయం 11గంటల నుంచి మద్యం దుకాణాలు తెరవడం, మందుబాబులు దుకాణాల వద్ద మద్యంకోసం పడిగాపులు కాశారు. రాత్రి 8 గంటలకు దుకాణాలు మూసివేస్తుండడంతో రాత్రి 7గంటల నుంచి క్యూకట్టారు. దీంతో దుకాణాలవద్ద కంట్రోల్‌చేయడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ప్రారంభం కాని నాలుగు దుకాణాలు... నెల్లూరు నగరంలోని నిప్పోసెంటర్, బుజబుజనెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి పట్టణాల్లో నాలుగుదుకాణాలు ప్రారంభం కాలేదు. పలు ప్రభుత్వ మద్యం దుకాణాలను నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి. రాధయ్య, నెల్లూరు, గూడూరు ఈఎస్‌లు కె. శ్రీనివాసాచారి, వెంకటరామిరెడ్డి తదితరులు పరిశీలించారు. ఆయా ప్రాంత సిఐలు షాపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు. -
మత్తు దిగుతోంది..!
సాక్షి, కృష్ణాజిల్లా ,మచిలీపట్నం : రాష్ట్రంలో దశల వారీ మద్య నిషేధం వైపు ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్పలితాలనిస్తున్నాయి. అధికారంలోకి వచ్చీరాగానే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపడం.. దశల వారీ మద్య నిషేదంలో భాగంగా ఏటా 20 శాతం చొప్పున షాపులను తగ్గించడం వంటి చర్యలు మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపాయి. నూతన పాలసీ అమలు కాకముందే... నూతన మద్యం పాలసీ ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాక ముందే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. అక్టోబర్ నుంచి 20 శాతం దుకాణాలకు కోత పెడుతూ, మిగిలిన షాపులను ప్రభుత్వమే నిర్వహించేందుకు ఓ వైపు సన్నాహాలు చేస్తోంది. మరో వైపు గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దొరకని చోటు అంటూ ఉండేది కాదు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరికేది కాదు కానీ.. మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరికేది. ప్రతి మద్యం షాపునకు కనీసం 10 నుంచి 25 వరకు బెల్ట్ షాపులుండేవి. ఏటా మద్యం విక్రయాలు 10 నుంచి 20 శాతం మేర పెరుగుతూ ఉండేవి. అంతే కాదు టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు పెంచేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వాదాయానికి గండి పడినా ఫర్వా లేదు.. అక్కా చెల్లమ్మలకు తానిచ్చేన హామీని అమలు చేసి తీరుతానని సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపారు. దీంతో జిల్లాలో ఒక్కటంటే ఒక్క బెల్టు షాపు కూడా బూతద్దం పెట్టి వెతికినా కన్పించని పరిస్థితి నెలకొంది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ వ్యత్యాసం కన్పిస్తోంది. 1.10 లక్షల కేసుల విక్రయాలు తక్కువగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు జిల్లాలో ఐఎంఎల్ మద్యం గతేడాది 16,48,742 కేసుల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 14,85,140 కేసుల విక్రయాలు జరిగాయి. వీటిలో మచిలీపట్నం యూనిట్ పరిధిలో గతేడాది 5,98,379 కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 5,34,842 కేసుల విక్రయాలు జరిగాయి. విజయవాడ యూనిట్ పరిధిలో గతేడాది 10,50,363 కేసుల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 9,50,298 కేసుల విక్రయాలు జరి గాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచి ఆగష్టు వరకు జరిగిన అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే ఐఎంఎల్ మద్యం గతేడాది 10,08,042 కేసుల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 9,00,578 కేసుల విక్రయాలు జరిగాయి. మచిలీపట్నం యూనిట్లో గతేడాది 3,66,443 కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది 3,20,647 కేసుల విక్రయాలు జరిగాయి. మొత్తంగా జూన్ నుంచి ఆగష్టు వరకు గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.10 లక్షల కేసుల ఐఎంఎల్ మద్యం విక్రయాలు తగ్గాయి. పెరిగిన బీరు విక్రయాలు... కాగా మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గగా, బీరు అమ్మకాలు మాత్రం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7,79,210 కేసులు అమ్మగా, ఈ ఏడాది 9,37288 కేసుల విక్రయాలు జరిగాయి. ఈ విధంగా మద్యం అమ్మకాలు గతేడాదితో పోల్చుకుంటే 10 శాతం తగ్గగా, బీరు అమ్మకాలు మాత్రం 19 శాతం మేర పెరిగాయి. ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు విక్రయాలు గతేడాది 546.15 కోట్లు కాగా, ఈ ఏడాది 608.40 కోట్లు నమోదయ్యాయి. ఇక జూన్ నుంచి చూస్తే గతేడాది అమ్మకాలు రూ.328.78 కోట్లు కాగా, ఈ ఏడాది 364.70 కోట్లుగా నమోదయ్యాయి. బెల్టుషాపుల రద్దు ప్రభావమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. దశల వారీగా మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయించింది. జిల్లాలో ఒక్క బెల్టుషాపు కూడా లేకుండా చేశాం. గతంలో కూడా ఇదే రీతిలో తొలగించేవాళ్లం కానీ కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఏర్పాటు చేసేవారు. ఈ సారి ఆ పరిస్థితి కన్పించడం లేదు. మద్యం షాపుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఈ ఏడాదే 20 శాతం షాపులు తగ్గుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ అవుట్‌లెట్స్ రాబోతున్నాయి. బెల్టు షాపుల తొలగించడం వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తుంది. – మేడికొండ మనోహ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మచిలీపట్నం -
దేవుడిసాక్షిగా మద్య నిషేధం
సాక్షి, ధారూరు: దేవుడి సాక్షిగా తమ గ్రామంలో మద్య నిషేధం విధిస్తున్నట్లు గురుదోట్ల వాసులు తీర్మానం చేశారు. ఉల్లంఘిస్తే రూ.25 వేల జరిమానా విధిస్తామన్నారు. వివరాలు.. మండలంలోని గురుదోట్ల గ్రామంలో కొందరు బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొడవలు, ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. ఈవిషయం పంచాయతీ దృష్టికి వచ్చింది. సర్పంచ్, ఎంపీటీసీ మహిళలు కావడంతో గ్రామస్తులతో కలిసి ఈవిషయమై చర్చించారు. గ్రామంలో పలువురు బెల్ట్ షాపుల ద్వారా విక్రయాలు జరుపుతున్నారని, దీంతో యువకులు మద్యానికి అలవాటై గొడవలకు దిగుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో గురువారం నిర్వహించిన నిమజ్జనంలో గొడవలు, ఘర్షణలు చెలరేగాయని తెలిపారు. గురుదోట్లతోపాటు అనుబంధ తండాలైన ఊరెంట తండా, బిల్యానాయక్ తండాల్లోనూ మద్యం విక్రయాలను నిషేధించాలని సర్పంచ్ అనిత అధ్యక్షతన, ఎంపీటీసీ మాణిక్‌బాయి, గ్రామస్తులు తీర్మానం చేశారు. దీనికి అందరూ కట్టుబడి ఉండాలని, నియమాన్ని ఉల్లంఘిస్తే రూ. 25 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉప సర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి మహబూబ్, మాజీ ఎంపీటీసీ చంద్రయ్య, జీపీ కోఆప్షన్ సభ్యుడు పుల్యానాయక్ తదితరులు ఉన్నారు. -
కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది
సురాపానం నిషేధం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. తొలుత మద్య నియంత్రణ చట్టానికి పదును పెడుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, పశ్చిమ గోదావరి : మందు బాబుల ‘నిషా’ దింపేందుకు సీఎం వైఎస్ జగన్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీలోనూ మద్య నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించింది. కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మద్యం షాపుల సమయాన్ని సైతం కుదించటంతోపాటు నిబంధనలు పాటించని మద్యం దుకాణదారులపై క్రిమినల్ కేసులు పెట్టేలా చట్టాన్ని చేసే పనిలో నిమగ్నమైంది. ఇక జిల్లాలో ప్రభుత్వమే స్వయంగా 11 మద్యం దుకాణాలను నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా 11 షాపులను ఏర్పాటు చేసి, ఫలితాలను విశ్లేషించి, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదాయం కాదు.. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ప్రధాన ఆదాయ వనరుగా మద్యానికి గత ప్రభుత్వాలు పెద్దపీట వేస్తే .. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు మాత్రం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు దూసుకుపోతోంది. వందల కోట్ల ఆదాయాన్ని కాదని పాదయాత్రలో ఆనాడు ప్రతిపక్ష నేతగా మహిళల బాధలు విన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే హామీని నిలబెట్టుకునేందుకు చకాచకా అడుగులు వేస్తున్నారు. 2018లో మద్యం ద్వారా ఆదాయం రూ.1306కోట్లు ఉంటే, 2017 సంవత్సరంలో రూ.1154.82కోట్లు మేర మద్యం విక్రయాలతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇలా రూ.వందలకోట్లు మేర ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని పూర్తిగా నిషేధించే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారు. దశలవారీగా మద్యం షాపులను నియంత్రిస్తూ, చివరి ఏడాది నాటికి మద్యపాన నిషేధాన్ని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో సీఎం వైఎస్ జగన్ ముందుకు వెళుతున్నారు. కొత్త చట్టంతో ‘కిక్కు’పోతుంది కొత్తగా ఆమోదించిన చట్టం మేరకు విక్రయాల నియంత్రణే ప్రధానాంశంగా ఉంది. జిల్లాలో మద్యం షాపులు సమయపాలన పాటించకపోవటం, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన వంటి అనేక అంశాలను కొత్త చట్టం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే మద్యం షాపులు ఉండడంతో డబ్బుల సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారు. బెల్టు షాపులు ఏర్పాటు చేయటం సామాజిక భద్రతకు విఘాతంగా మారింది. గతంలో నిబంధనలు మీరితే నిర్వాహకులకు జరిమానాలు విధించటంతోపాటు తాత్కాలికంగా లైసెన్సులు రద్దు చేసేవారు. కొత్త చట్టంలో లైసెన్సులు తీసుకున్న మద్యం నిర్వాహకులు నిబంధనలు మీరితే క్రిమినల్ కేసులు సైతం పెట్టనున్నారు. ప్రభుత్వం దుకాణాల్లో మద్యం విక్రయించటం ద్వారా సమయాన్ని అతితక్కువకు కుదించేలా నిర్ణయిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం 12గంటల సమయంలో 4గంటలు కోత విధిస్తూ, 8గంటలకు తగ్గించేలా చర్యలు చేపడతారని అంటున్నారు. మద్యం దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పేలా లేవు. జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇప్పటి వరకూ జిల్లాలో 476 మద్యం దుకాణాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవల మూడు నెలలు రెన్యువల్ చేయగా వీటిలో 123 మద్యం దుకాణాల వరకూ రెన్యువల్ చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మద్యం నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని గుర్తించిన మద్యం వ్యాపారులు ఇతర మార్గాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో అక్టోబర్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇక నూతన పాలసీలో ఎటువంటి విధివిధానాలు ఖరారు చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వషాపులపై నివేదిక జిల్లాలో ప్రభుత్వమే 11మద్యం దుకాణాలను పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏలూరు, భీమవరం సర్కిల్స్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఎక్కడ పెట్టాలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఏలూరు పరిధిలో 5షాపులు, భీమవరం పరిధిలో 6షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఏలూరు సర్కిల్లో బాపిరాజుగూడెం, తిమ్మాపురం, బీ.కొండేపాడు, మార్కొండపాడు, శ్రీనివాసపురం, భీమవరం సర్కిల్లో కొణితివాడ, తణుకు అర్బన్, చించినాడ, కొతలపర్రు, జిన్నూరు, ఎల్‌ఎన్‌పురాలలో ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు అధికారులు యత్నిస్తున్నారు. -
మద్యం మాఫియాకు చెక్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధ కార్యచరణకు ఉపక్రమించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మద్య నియంత్రణ చట్ట సవరణ’ బిల్లును రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది. మద్యం దుకాణాల లైసెన్సులు, మద్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ బిల్లును రూపొందించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా ‘ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ యాక్ట్–1993ను సవరిస్తూ మంగళవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టగా, బుధవారం కూలంకుషంగా చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే.. : ఈ బిల్లును శాసనసభ ఆమోదించడంతో రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా అడుగు ముందుడుగు పడింది. ప్రస్తుతం మద్యం వ్యాపారం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దాంతో వారు లైసెన్స్ షరతులను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. నిర్ణీత సమయాలతో నిమిత్తం లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇష్టానుసారంగా బెల్డ్ షాపులు నిర్వహిస్తూ సామాజిక భద్రతకు భంగం కలిగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం క్షీణించడంతోపాటు విలువైన మానవ వనరులను నష్టపోవాల్సి వస్తోంది. పేదల కుటుంబాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. దాంతో ప్రజల నుంచి.. ముఖ్యంగా మహిళల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయమై మహిళలు కొన్నేళ్లుగా ధర్నాలు చేస్తున్నారు. తన పాదయాత్రలో ఈ పరిస్థితులను గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. దశల వారీగా మద్యం నిషేధమే ఈ సమస్యకు పరిష్కారమని భావించారు. ప్రభుత్వ ఆదాయం కోల్పోయినా పర్వాలేదు ప్రజల బతుకులు బాగు పడాలనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు తాజాగా మద్య నియంత్రణ చట్టం సవరణ కోసం శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాలను ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి సభకు వివరించారు. అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బిల్లును సమర్థిస్తూ ప్రసంగించారు. పేదలు, మహిళల జీవితాలను బాగు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అనంతరం ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మద్యం పీడ వదిలించడానికే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ సామాజిక వేత్తగా, ఓ తత్వవేత్తగా ఆలోచించి మద్యం మహమ్మారి పీడ వదిలించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. మద్యం.. ఆడపడుచుల గుండెకు చేసిన గాయాన్ని నయం చేయడానికి సీఎం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను తమ ఆదాయ వనరుగా భావించడం దురదృష్టకరం. మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. కానీ విలువైన మానవ వనరులు, సామాజిక సంపద తరిగిపోతోంది. మద్యం పేదల జీవితాలను కబళించివేస్తోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పేద మహిళల కష్టాలను చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం రక్కసి అంతు చూడటానికి మొదటి అడుగుగా ఈ బిల్లును తీసుకువచ్చారు. అందుకే ఆయనకు ఈ రాష్ట్ర ఆడపడుచుల తరపున కృతజ్ఞతలు. – భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి మూల కారకుడు చంద్రబాబే : రోజా ‘పేదల జీవితాలను నాశనం చేస్తున్న మద్యం మహమ్మారిని రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారానే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్ట సవరణ తేవడం సంతోషకరం. ఎందుకంటే ప్రైవేటు షాపుల యజమానులు బెల్డ్ షాపులు పెట్టి దోచుకుంటున్నారు. దీనికి చంద్రబాబే మూల కారకుడు. ఆయన ప్రభుత్వం ఐదేళ్లలో రూ.75 వేల కోట్ల విలువైన మద్యాన్ని ఏరులై పారించింది. 40 వేల బెల్డ్ షాపులు ఏర్పాటు చేసింది. కానీ 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది. అదీ చంద్రబాబు ప్రభుత్వ విధానం. కానీ మన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యాన్ని దశల వారీగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు. అదీ ఆయన నిబద్దత’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించింది చంద్రబాబు ప్రభుత్వమేనని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. మద్యం మాఫియాను అంతం చేసేందుకు సీఎం జగన్ గొప్ప బిల్లు తీసుకువచ్చారని కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ కొనియాడారు. -
వారి కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చాను..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధ కార్యచరణకు ఉపక్రమించారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘మద్య నియంత్రణ చట్ట సవరణ’ బిల్లును రాష్ట్ర శాసనసభ బుధవారం ఆమోదించింది. మద్య నిషేదం దిశగా అడుగులేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ‘మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని, అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను. నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చాం. తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయి’ అని ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : మద్యం మాఫియాకు చెక్) -
ఏపీలో నవ చరిత్రకు శ్రీకారం
రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక మార్పునకు ఊతమిచ్చే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇదివరకెన్నడూ లేని రీతిలో స్థానికులకు ఉపాధి కల్పించే కీలక నిర్ణయాలకు నాంది పలికింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించడానికి అడుగు ముందుకు వేసింది. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. నిరుద్యోగ యువతకు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తూ, మహిళల చిరకాల కోరిక నెరవేరుస్తూ నవ సమాజ నిర్మాణానికి అంకురార్పణ గావించింది. రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా, దశల వారీగా మద్య నిషేధం దిశగా మద్య నియంత్రణ చట్టాన్ని సవరించేలా ప్రవేశ పెట్టిన కీలక బిల్లులను బుధవారం సభ్యుల హర్షధ్వానాల నడుమ శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రూపొందిన ఈ బిల్లులు నిరుద్యోగులు, మహిళల పాలిట వరం అని ఈ సందర్భంగా పలువురు శాసనసభ్యులు కొనియాడారు. పేదలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోతారని ప్రశంసించారు. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిశ్రమలు, కర్మాగారాలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు ఉద్దేశించిన చరిత్రాత్మక బిల్లును బుధవారం రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు రూపొందించిన ఈ బిల్లు నిరుద్యోగుల పాలిట వరం అని పలువురు శాసనసభ్యులు అభివర్ణించారు. ఏపీ పరిశ్రమలు, కర్మాగారాలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి బిల్లు–2019ను శాసనసభ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు పొట్ట చేత పట్టుకుని వలసలు పోవాల్సిన అవసరం ఉండదని శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై చర్చకు ప్రతిపాదిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి, కర్మాగారాల శాఖ మంత్రి జి.జయరాం మాట్లాడారు. ‘అందరి తల రాతను బ్రహ్మదేవుడు రాస్తాడని విశ్వసిస్తుంటారు. అందరి సంగతేమో గానీ మా తలరాత రాసింది మాత్రం వైఎస్ జగన్మోహనుడు’ అని అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్‌లా, వాల్మీకులకు వాల్మీకి మహర్షిలా, క్రైస్తవులకు ఏసుక్రీస్తులా, ముస్లింలకు అల్లా లాగా, అందరి దేవుడు షిర్డీ సాయిలాగా సమాజంలోని అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగన్ వినమ్రంగా నమస్కరిస్తూ బిల్లుపై మాట్లాడాల్సిందిగా సంజ్ఞలు చేశారు. బాబు వంచిస్తే.. జగన్ ఆదుకున్నారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగం అని చెప్పి అందర్నీ వంచించారని మంత్రి జయరాం అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రస్తుత బిల్లు ప్రకారం స్థానిక పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, ఇదో చారిత్రక నిర్ణయమని వివరించారు. నైపుణ్యం, అర్హత లేదన్న సాకుతో పరిశ్రమల యజమానులు స్థానికులను తిరస్కరించే వీలు లేదని, నైపుణ్యం లేకపోతే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నారు. మిగతా 25 శాతం ఉద్యోగాలలో యాజమాన్యాలు ఇష్టం వచ్చిన వారిని నియమించుకునే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి బిల్లును తీసుకువచ్చిన చరిత్ర లేదన్నారు. ఈ బిల్లు చట్టమైతే అనేక ప్రాంతాలలో పరిశ్రమలు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నైపుణ్యం లేని వారికి మూడేళ్ల కాలంలో శిక్షణ ఇవ్వొచ్చన్నారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల పరిశ్రమల యాజమాన్యాలకు చాలా ఖర్చులు తగ్గుతాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు ఉందని, దాన్ని మించి ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం కల్పిస్తున్నారని వివరించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చేయలేని పనులు నవ యువకుడైన వైఎస్ జగన్ తన 45 రోజుల పాలనలో చేసి చూపారన్నారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు రాష్ట్ర విభజన నాటి హామీలను అమలు చేయనప్పుడు నోరెత్తని ఆంగ్ల ఛానళ్లు ఇప్పుడు ఈ బిల్లును వివాదాస్పదం చేయాలని చూడడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన మేనిఫెస్టో మూడు తరాల భవిష్యత్ అన్నారు. మహాత్మా గాంధీ కలలు సాకారం మంగళవారం ఆమోదించిన ఐదు బిల్లులు సామాజికమైనవైతే బుధవారం ప్రతిపాదించిన బిల్లులు చరిత్రాత్మకమైనవని కిలారు రోశయ్య అన్నారు. మహాత్మాగాంధీ కన్న కలలను సాకారం చేసే దిశగా వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఎంతో గొప్పగా చెప్పుకునే అమరావతి ప్రాంత అభివృద్ధి పనుల్లోనూ సుమారు 80 శాతం మంది కార్మికులు ఇతర రాష్ట్రాల వారని, స్థానికులకు ఎటువంటి అవకాశం కల్పించలేదన్నారు. 2016 నుంచి నాలుగేళ్లలో రూ.19,58,000 కోట్ల పెట్టుబడులు, 43 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. వి.వరప్రసాద్ మాట్లాడుతూ ఈ బిల్లుతో ప్రతి నియోజకవర్గంలో ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. వలసల్ని నిరోధించవచ్చన్నారు. ఈ బిల్లులోని అంశాలను అమలు చేయని పరిశ్రమల యాజమాన్యాలకు, అధికారులకు కూడా జరిమానాలు విధించేలా ప్రతిపాదనలు ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఉండకపోతే పరిశ్రమలు వచ్చి ఉండేవని పలాస ఎమ్మెల్యే అప్పలరాజు దుయ్యబట్టారు. నైపుణ్యం లేదనే సాకుతో ఉద్యోగాలు తిరస్కరించే అవకాశం ఇకపై ఉండదన్నారు. గ్రామీణ యువతకు ఇదో వరమన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మక మార్పునకు ఈ బిల్లు శ్రీకారం చుడుతోందన్నారు. పరిశ్రమలకు స్థానికులు భూములు ఇస్తున్నప్పుడు ఉద్యోగాలు వేరే వాళ్లకు ఇస్తామనడంలో అర్థం లేదని, ఇకపై ఈ సమస్య ఉండదన్నారు. జగన్ పట్టుదలతోనే... సామాజిక న్యాయం, బడుగు వర్గాలకు సాధికారతకు ఉద్దేశించిన 5 బిల్లులు సభ ఆమోదం పొందేంత వరకు మా అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నం ముట్టలేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. జగన్ పట్టుదలకు, బీసీల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలకు ఇదే నిదర్శనమన్నారు. మహాత్మాగాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ ఎలాగో ఇక వైఎస్ జగన్ కూడా తమకు అంతేనని అభివర్ణించారు. ప్రస్తుతం జగనిజం నడుస్తోందన్నారు. ఏపీ రాజకీయ చరిత్ర చెప్పాల్సి వస్తే జగన్‌కు ముందు జగన్‌కు తర్వాత అని చెప్పాల్సి వస్తుందన్నారు. ఏ నాయకునికీ తట్టని ఆలోచనలెన్నో వైఎస్ జగన్‌కు తట్టాయని, అందుకే ఆయన మహనీయుడని అన్నారు. పారిశ్రామిక విప్లవం సామాజిక బాధ్యతతో పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ చేస్తున్న చట్టం రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుంది. ఎందుకంటే పరిశ్రమలకు అవసరమైన రీతిలో యువతకు శిక్షణ ఇచ్చి నిపుణులైన ఉద్యోగులను ప్రభుత్వమే అందిస్తుంది. ఇక పారిశ్రామికీకరణతో కాలుష్యం, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న స్థానికులకు పరిశ్రమల ఏర్పాటు పట్ల సానుకూల ధోరణి పెరుగుతుంది. స్థానికులకే ఉద్యోగాల్లో సింహభాగం దక్కాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతోంది. అదే నినాదంతో అమెరికన్ల మనసు గెలుచుకుని ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అదే రీతిలో బ్రిటన్ కూడా బ్రెగ్జిట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చింది. – మేకపాటి గౌతంరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి యువత భవిష్యత్‌కు ఇక భరోసా పరిశ్రమల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే నమ్మి టీడీపీకి అధికారం అప్పగిస్తే చంద్రబాబు యువతను మోసం చేశారు. దాంతో యువతలో నిరాశ నిస్పృహలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం యువతలో కొత్త ఆశలు రేకెత్తించింది. తమ భవిష్యత్ బాగుంటుందన్న భరోసా వారికి కలుగుతోంది. ప్రజలు ఆయన నాయకత్వం కలకాలం ఉండాలని కోరుకుంటున్నారు. – రాపాక వరప్రసాద్, ఎమ్మెల్యే, రాజోలు -
నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి
తమిళనాడు, పెరంబూరు: మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్న న్యాయవాది నందిని వివాహం బుధవారం నిడారంబరంగా జరిగింది. వివరాలు.. మదురైకి చెందిన న్యాయవాది నందిని, ఆయన తండ్రి ఆనందన్‌లు మద్య నిషేధం కోసం పోరాటం చేస్తున్నారు. నందినికి ఆమె తండ్రి స్నేహితుడి కొడుకు గుణజ్యోతిబసుతో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ నెల 5వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఇటీవల నందిని, ఆమె తండ్రి ఆనందన్ మద్యనిషేధం కోరుతూ శివగంగై జిల్లాలో పోరాటం చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని తిరుపత్తూర్ కోర్టులో హాజరుపరచగా కోర్టును ధిక్కరించిన కేసులో వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. వారిని మదురై జైలుకు తరలించారు. దీంతో నందిని పెళ్లి ఆగిపోయింది. ఇదిలాఉండగా నందిని, ఆమె తండ్రి ఆనందన్‌లు మూడు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ పరిస్థితుల్లో నందిని పెళ్లిని వెంటనే జరిపించాలని ఆమె తండ్రి నిర్ణయించుకున్నాడు. దీంతో బుధవారం మదురై జిల్లా, తెన్నమల్లూర్‌లోని వారి కులదైవం పట్టవన్ స్వామి అలయంలో నిరాడంబరంగా నందిని, గుణ జ్యోతిబసుల వివాహం జరిగింది. అనంతరం వధూవరులిద్దరూ కుల దైవం సన్నిధిలో ఇకపై తామ వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక సేవలోనూ శ్రద్ధ చూపుతామని ప్రతిజ్ఞ చేశారు. -
దిగుతున్న కిక్కు!
సాక్షి, చిత్తూరు : దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలుచేస్తూ.. క్రమేణా మద్యాన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామన్న వైఎస్ జగన్ మాట క్రమేణా ఆచరణలోకి వస్తోంది. ఏటా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు సీఎం ప్రకటించడం.. బెల్టు దుకాణాలు ఎక్కడా ఉండకూడదని అధికారులను ఆదేశించడంతో మద్యం వ్యాపారులు నష్టాల భయంతో వెనకడుగు వేశారు. ఫలితంగా జిల్లాలో 20 శాతం మద్యం దుకాణాలు తగ్గాయి. జిల్లాలో మొత్తం 427 మద్యం దుకాణాలు, 41 మద్యం బార్లు ఉన్నాయి. వీటికి 2017 జూలై నుంచి నిర్వహణ లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్‌తో మద్యం దుకాణాల గడువు ముగియడం, కొత్త విధానం ఖరారు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు ఉన్నవాటికి గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. జూన్ నెలాఖరు నాటికి ఈ మూడునెలల కాలానికి లైసెన్సు నగదు చెల్లించిన వారికి మాత్రమే అనుమతులు జారీచేసింది. మిగిలిన 75 దుకాణాలను రెన్యువల్ చేసుకోవడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో వాటి లైసెన్స్‌లను అధికారులు రద్దుచేశారు. ఇందులో చిత్తూరు ఈఎస్ పరిధిలో 27, తిరుపతి పరిధిలో 48 దుకాణాలున్నాయి. చిత్తూరు రూరల్ పరిధిలో 6, కార్వేటినగరం 1, మదనపల్లె 2, ములకలచెరువు 3, పుంగనూరు 4, పలమనేరు 4, వాయల్పాడు 1, పీలేరు 6, తిరుపతి అర్బన్ 4, తిరుపతి రూరల్ 4, పాకాల 6, పుత్తూరు 9, శ్రీకాళహస్తి 8, సత్యవేడు 12, నగరి లో 5 దుకాణాల నిర్వాహకులు లైసెన్స్ గడువును పొడగించుకోలేదు. ఉక్కుపాదం మోపడంతో.. జిల్లాలో ఉన్న మొత్తం మద్యం దుకాణాల్లో 20 శాతం వరకు దుకాణాల నిర్వాహకులు లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయమే. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బెల్టు దుకాణాలు ఉండడానికి వీలు లేదని ఆయన ఆదేశాలు జారీచేశారు. బెల్టు దుకాణాల్లో మద్యం బాటిళ్లు కనిపిస్తే వాటిని సరఫరా చేసిన మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో బెల్టు షాపుల ద్వారా మద్యం ఏరులై పారడం, ఎంఆర్పీ ఉల్లంఘన, అక్రమ మద్యం లాంటి వ్యవహారాలు జోరుగా సాగాయి. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించడంతో వ్యాపారులకు భయం పట్టుకుంది. దీనికితోడు అన్ని మద్యం దుకాణాల వద్ద ఎంఆర్పీ ధరలు ప్రదర్శించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం సైతం వ్యాపారులకు మింగుడుపడలేదు. పైగా దుకాణాల్లో రోజుకు రూ.2లక్షల వరకు మద్యం అమ్మకాలు జరిగితేనే లాభాలు వస్తాయని, ఇందుకు ఉపయోగపడే బెల్టు దుకాణాలు లేకపోవడం వల్ల చాలామంది వ్యాపారులు మద్యం నిర్వహణ నుంచి పక్కకు తప్పుకున్నారు. కొత్త పాలసీపై కసరత్తు కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలా.. లేక లైసెన్సులను జారీచేయాలా అనే దానిపై ఓ కమిటీని కూడా వేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీలను పరిశీలించడానికి కమిటీ సైతం చర్యలకు ఉపక్రమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికకు కనీస సమయం కావాల్సి ఉండడంతో ఇప్పటికే ఉన్న మద్యం దుకాణాల గడువును మూడునెలలు పొడిగించింది. భవిష్యత్తులో మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో జిల్లాలో 20శాతం వరకు మద్యం దుకాణాలు తగ్గడం మద్యపాన నిషేధానికి బీజం పడినట్లే అయ్యింది. -
గూంటూరులో జనచైతన్య వేధిక అధ్వర్యంలో సదస్సు
-
ఆ నగరాల్లో మద్యం, మాంసం బంద్!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో పలు నగరాల పేర్లు మార్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మరో సంచలనానికి సిద్దమయ్యాడు. అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను శ్రీ అయోధ్యగా మార్చిన యోగి ప్రభుత్వం ఇప్పుడు ఆ నగరాల్లో సంపూర్ణ మద్యం, మాంసం నిషేధం విధించడానికి సిద్దమైంది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందిన ఆ రాష్ట్ర మంత్రి, శ్రీకాంత్ శర్మ మంగళవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మధురలో ఈ తరహా నిషేదం విధించిందని, ఇప్పడు అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ల్లో కూడా నిషేదం విధించాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయోధ్యలో మద్యం, మాంసం అమ్మడం శ్రీరామునికే అమర్యాదకమన్నారు. నగరాల పేర్లు మార్చడంపై దేశవ్యాప్తంగా యోగి ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి. ప్రతిపక్షాలే కాకుండా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు సైతం యోగిని తప్పుబడుతున్నాయి బీజేపీ పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా? అంటూ మిత్రపక్షం ఎస్బీఎస్పీ నేత, యోగి ఆదిత్యనాథ్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ సవాలు చేసిన విషయం తెలిసిందే. ఇక నగరాల పేర్ల మార్పుపై దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ కోర్టు కొట్టేసింది. పిటిషనర్ తొలుత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. -
బెల్ట్ షాపుల నియంత్రణలో విఫలం
పొన్నూరు (చేబ్రోలు) : పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించటంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ విమర్శించారు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న మద్యం బెల్టు షాపులను నియంత్రించాలని కోరుతూ పొన్నూరు పట్టణంలోని ఆచార్య ఎన్జీ రంగా విగ్రహం వద్ద ఆదివారం అఖిలపక్షం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చని టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపుల రద్దుకు సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని, అయితే ఎక్కడా బెల్టుషాపుల నియంత్రణ జరగలేదన్నారు. మద్యం మహమ్మారికి ఎందరి జీవితాలో గాలిలో కలిసిపోవటమే కాకుండా కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 600కు పైగా హమీలిచ్చిన బాబు ఏ ఒక్కదాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ ముస్తఫా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార టీడీపీ మద్యం తాగండి, తాగి ఊగండి అన్న నినాదంతో విచ్చలవిడిగా బెల్టు షాపులను నడుపుతోందన్నారు. టార్గెట్లు ఇచ్చి మద్యం విక్రయాలు సాగిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత మాట్లాడుతూ నవ్యాంధ్రను మద్యాంధ్రగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. పొన్నూరు జెడ్పీటీసీ, కాపు సంఘం నాయకుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచినీరు దొరకని ఊరు ఉందేమో కాని మద్యం దొరకని గ్రామమే లేదని ఎద్దేవా చేశారు. బెల్టు షాపుల వల్ల యువత పెడదోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు కేవీ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ జాతీయ రహదారులపై మద్యం షాపులకు అనుమతి ఇవ్వవద్దని జీవో జారీ చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వాటిని రాష్ట్ర రహదారులుగా మార్చి విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయటం హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు తన్నీరు కిషోర్, సీపీఐ ఎంఎల్ నాయకుడు పరశురామయ్య, ఆమ్ఆద్మీ నాయకులు గాజుల నాగభూషణం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్.రూత్‌రాణి, కాపు సంఘం నాయకులు జి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు వడ్రాణం ప్రసాదరావు, బొనిగల వేణు ప్రసాద్, ఆకుల వెంకటేశ్వరరావు, బోయిన శివనాగరాజు తదితరులు ఉన్నారు. -
మహా మానవ హారం
మహా మానవ హారం • ప్రపంచంలోనే పొడవైన హారం ఏర్పాటు చేసిన బిహార్ • 11,400 కి.మీ. పొడవునా.. 3 కోట్ల మంది ప్రజలతో పట్నా: ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవహారాన్ని శనివారం ఏర్పాటు చేసిన బిహార్ ప్రజలు, సంపూర్ణ మద్య నిషేధానికి తాము మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. 11,400 కి.మీ పొడవైన మానవ హారాన్ని దాదాపు మూడు కోట్ల మంది బిహార్ ప్రజలు కలిసి 45 నిమిషాల పాటు శ్రమించి నిర్మించారు. ఈ ఘట్టాన్ని కెమెరాల్లో బంధించేందుకు బిహార్ ప్రభుత్వం 40 డ్రోన్లు, నాలుగు విమానాలు, ఒక హెలికాప్టర్‌ను వాడింది. ఉపగ్రహా చిత్రాలు తీయడానికి ఇస్రో సాయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం 12.15 నిమిషాల నుంచి ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం సాగింది. హారంలో సీఎం నితీశ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌లు పక్క పక్కన నిలబడి చేతులు పట్టుకున్నారు. గతంలో ప్రపంచపు అత్యంత పొడవైన మానవహారం రికార్డు 1050 కి.మీతో బంగ్లాదేశ్ పేరిట ఉండేది. 2016 ఏప్రిల్ నుంచే బిహార్‌లో దేశీ, విదేశీ, భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం సహా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మొత్తం మూడు కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. తొలుత 11,292 కి.మీ పొడవైన మానవహారం ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించిందనీ, అంచానాలకు మించి జనం తరలి రావడంతో హారం పొడవు 11,400 కి.మీకు పెరిగిందని నితీశ్ తెలిపారు. ఈ ప్రపంచ రికార్డు నమోదు కోసం గిన్నిస్ బుక్ ప్రతినిధులను సంప్రదించారా అని అడగ్గా, ‘మేం ఎందుకు సంప్రదించాలి? గిన్నిస్‌బుక్, గిన్నిస్బుక్లా ఉండాలంటే, వాళ్లే ఈ మాహా మానవ హారాన్ని గుర్తించి నమోదు చేసుకోవాలి’అని నితీశ్ బదులిచ్చారు. -
అఖిలేష్‌కు నితీష్ సక్సెస్ మంత్రా..
పట్నా : "బాబూ అఖిలేష్.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ గెలిచి..తిరిగి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావా? అయితే నేను చెప్పినది పాటించు.."అంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ యూపీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు అద్బుతమైన సలహా ఇచ్చారు. బిహార్ మాదిరిగానే ఉత్తరప్రదేశ్‌లోనూ మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తే, ఎన్నికల్లో విజయం వెతుకుంటూ వస్తుందని, తన సక్సెస్ మంత్రకూడా అదేనని నితీష్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ లో హోరాహోరీగా జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు ప్రధాన కారణం సంపూర్ణ మద్య నిషేధ హామీనేనని నితీష్.. అఖిలేష్ కు చెప్పారు. అదే మంత్రాన్ని ఇప్పుడు యూపీలోనూ అమలుచేయాలని సూచించారు. ఇప్పటికే సమాజ్‌వాద్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో సీఎం అఖిలేష్, తన తండ్రి ములాయం సింగ్, బాబాయి శివపాల్ యాదవ్ ల నుంచే మద్దతు కోల్పోతున్నారు. అఖిలేష్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో తన ప్రీతిపాత్రుడైన సోదరుడు శివపాల్ యాదవ్‌ను ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నియమించారు. అంతేకాక వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ అభ్యర్థి ఎవరన్నది కూడా ములాయం సింగ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో అఖిలేష్‌కు నితీష్ నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. యూపీలో మద్య నిషేధం అమలు చేపడితే, ఎన్నికల్లో గెలవడానికి ఎవరి సపోర్టు అక్కర్లేదని నితీష్ పేర్కొన్నారు. మహిళా ఓటర్ల మద్దతు పొందవచ్చని, దీంతో తన ఖాతాల్లో ఓట్ల సంఖ్యను పెంచుకోవచ్చని అఖిలేష్‌కు నితీష్ చెప్పారు. రిస్క్ లేకుండా దేన్ని సాధించలేవని, దేనినైనా నీవు ధైర్యంగా ఎదుర్కోలేనప్పుడు, పెద్ద పెద్ద రాజకీయ లక్ష్యాలను సాధించలేవని నితీష్ హెచ్చరించారు. -
అధికారం మాదే!
‘రానున్న ఎన్నికల్లో మార్పు తథ్యం... అధికారం మాదే...!’ అని ప్రజా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం, అవినీతి నిర్మూలన లక్ష్యంగా తొలి సంతకాలు ఉంటాయని ప్రకటించారు. తదుపరి అవినీతి సొమ్ముతో అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు కూడ బెట్టిన ఆస్తుల్ని జప్తు చేస్తామన్నారు. * మద్యం , అవినీతి నిర్మూలనే లక్ష్యంగా తొలి సంతకం * అన్నాడీఎంకే, డీఎంకే అవినీతి ఆస్తుల జప్తు * ప్రజా కూటమి నేతల ప్రకటన * మోగిన ‘ప్రజా’ ప్రచార గంట * ప్రజా స్పందనతో ఆనందం సాక్షి, చెన్నై : ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ప్రజా సంక్షేమ కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల పయనానికి శ్రీకారం చుడుతూ ప్రచార భేరికి ఈ కూటమి నేతలు వైగో, తిరుమావళవన్, జి రామకృష్ణన్, ముత్తరసన్ సిద్ధమయ్యారు. ఆదివారం కడలూరు వేదికగా తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాజకీయ మార్పు లక్ష్యంగా ప్రజా చైతన్య పయనం నినాదంతో ఈ ప్రచార భేరి చేపట్టారు. కడలూరులో జరిగిన తొలి ప్రచార సభకు జనం నుంచి అమిత స్పందన రావడంతో ఆ కూటమి వర్గాల్లో ఆనందం వికసించింది. అలాగే, చిదంబరంలో జరిగిన మరో ప్రచార సభకు సైతం జనం తరలిరావడంతో, ఆరంభం సక్సెస్‌తో ఇక, అధికారం తమదేనన్న ధీమా ఆ కూటమి నేతల్లో నెలకొన్నట్టైంది. అధికారి మాదే : ప్రచార భేరిలో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ప్రసంగిస్తూ, ప్రజా కూటమిని చీల్చేందుకు రక రకాలుగా కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. తొలుత ఇయక్కంగా, తదుపరి కూటమిగా ఆవిర్భవించిన ఈ ప్రజా కూటమి రానున్న ఎన్నికల్లో మెగా విజయంతో అధికార పగ్గాలు చేపట్టేందుకు తగ్గ శుభగడియలు వచ్చాయని ధీమా వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడకు ప్రజా సమూహం తరలి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు మార్చి మార్చి రాష్ట్రాన్ని గత నలభై ఏళ్లుగా దోచుకుంటూ వచ్చాయని ఆరోపించారు. దోపిడి లక్ష్యంగా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని, అయితే, ఆ దోపిడీ సొమ్మును వారి నుంచి లాక్కుని ప్రజలకు ఇచ్చేందుకు తాము ముందుకు వచ్చి ఉన్నామన్నారు. ప్రజా హిత కార్యక్రమాలతో ముందుకు సాగుతూ వచ్చిన తమ కూటమి రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అధికార మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ వస్తున్నారని, తమ ఓటు ఆయుధంతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పేందుకు సిద్ధం అయ్యారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం, భావి తమిళనాడును తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రజల్లోకి వచ్చిన తమ కూటమి అధికారంలోకి రాగానే, కీలక నిర్ణయాలకు సిద్ధం అయిందని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకం మద్య నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా ఉంటాయన్నారు. తదుపరి రాష్ట్రాన్ని దోచుకుని అన్నాడీఎంకే, డీఎంకే వర్గాలు కూడ బెట్టుకుని ఉన్న ఆస్తుల్ని జప్తు చేసి, ప్రజలకు పంచడం లక్ష్యంగా తమ పయనం ఉంటుందని ప్రకటించారు.