విజయనగరం రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల హామీల్లో ‘దశలవారీ మద్య నిషేధం’ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలో ఉన్న మొత్తం మద్యం దుకాణాలను రెండు విడతల్లో 33 శాతం తగ్గిస్తూ చర్యలు తీసుకోవడంతో జిల్లాలో దుకాణాల సంఖ్య భారీగా తగ్గింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించి మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చింది. దీంతో దిగువ, మధ్య తరగతి అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రజా సంకల్పయాత్రలో గమనించి దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీనిచ్చారు.
గత అక్టోబర్‌లోనే 20 శాతం తగ్గింపు
గతేడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన దశలవారీ మద్య నిషేధహామీలో భాగంగా జిల్లాలో అప్పటివరకు ఉన్న 210 మద్యం దుకాణాలను 20 శాతం తగ్గిస్తూ 168కి కుదించారు. అప్పటివరకు ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహిస్తున్నారు. మద్యం అమ్మకాలను మరింత తగ్గించాలని నిర్ణయిస్తూ మరో 13 శాతం దుకాణాలను తగ్గించి సోమవారం నుంచి అమల్లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో దుకాణాల సంఖ్య 142కి తగ్గింది. ఇప్పటికే మద్యం ధరలు పెంచి మందుబాబులకు షాకిచ్చిన ప్రభుత్వం మద్యం దుకాణాల తగ్గింపుతో మరింత షాకిచ్చిందని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment