
హైదరాబాద్: మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి అనంతరం శృంగారం కోసం ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడకు చెందిన మహిళకు సంగీత్‌కుమార్ అనే వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో మనస్పర్దలు రావడంతో మూడు నెలల కిందట ఆమె షేక్‌పేటలోని తన తల్లితో ఉంటుంది.
ఈనెల 19న మధ్యాహ్నం యూసుఫ్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి మద్యం సేవించి తిరిగి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి మీ ఫ్యామిలీ నాకు తెలుసు, కారు ఎక్కు మీ ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారు ఎక్కించుకున్నాడు.
అయితే మార్గ మధ్యలో కారు ఆపి తనతో శృంగారం చేయాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమె కారు దిగి మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment