Madhuranagar
-
పోలీసు స్టేషన్ లో యువకులపై 3rd డిగ్రీ
-
మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ అదృశ్యం
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జి.రాజేశ్వరి, రవికుమార్ దంపతులు తమ కుమారుడు లోకేషకుమార్‌తో కలిసి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 30న రాజేశ్వరి మార్నింగ్‌వాక్‌కు వెళుతున్నట్లు చెప్పి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. మధ్యాహ్నం లోకేష్ అత్తగారికి ఫోన్ చేసి తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, తాను చనిపోనని, ఇంటికి మాత్రం రానని చెప్పింది. ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో లోకేష్ ఆదివారం మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మధురానగర్‌లో దారుణం.. లిఫ్ట్ ఇచ్చి కారులో ...
హైదరాబాద్: మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి అనంతరం శృంగారం కోసం ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్‌గూడకు చెందిన మహిళకు సంగీత్‌కుమార్ అనే వ్యక్తితో 2011లో వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే భర్తతో మనస్పర్దలు రావడంతో మూడు నెలల కిందట ఆమె షేక్‌పేటలోని తన తల్లితో ఉంటుంది. ఈనెల 19న మధ్యాహ్నం యూసుఫ్‌గూడలోని కల్లు కంపౌండ్‌కు వచ్చి మద్యం సేవించి తిరిగి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారులో వచ్చి మీ ఫ్యామిలీ నాకు తెలుసు, కారు ఎక్కు మీ ఇంటి వద్ద దింపుతానని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. అయితే మార్గ మధ్యలో కారు ఆపి తనతో శృంగారం చేయాలంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమె కారు దిగి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు.. 24 గంటల్లోనే పోలీసులకు చిక్కాడు
హైదరాబాద్: జీవనోపాదిలేక ఎంబీఏ చదివిన ఓ డ్యాన్స్ మాస్టర్ దొంగగా మారాడు. తను నివసించే ప్రాంతంలోనే చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పుతూ జీవనం సాగించేవాడు. అయితే కొంత కాలంగా కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అతను తప్పుడు దారిలోకి అడుగుపెట్టాడు. అయితే ఆ పని అతనికి అలవాటు లేకపోవడంతో తప్పు చేసిన 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సార్ నగర్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. పెద్దపల్లికి చెందిన డి. సుచరిత అనే యువతి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె మధురా నగర్ కాలనీలోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే గురువారం కూడా ఆమె రోజు మాదిరిగానే ఆఫీస్‌కు బయలుదేరింది. ఈ క్రమంలోనే సుచరిత మధురానగర్ మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురు చూడసాగింది. ఇక అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు సుచరిత మెడలోని రూ. 45 వేలు విలువ చేసే బంగారు గొలుసును దొంగిలించాడు. దీనితో బాధితురాలు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. నిందితుడిని నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చింత వినోద్(27)గా గుర్తించారు. ఎట్టకేలకు నిందితుడు వినోద్‌ను పోలీసులు దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేకనే గొలుసు చోరీకి పాల్పడ్డారని, చోరికి పాల్పడటం ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు. -
బుజ్జాయిని బలిగొన్న బకెట్
విజయవాడ (మధురానగర్) : తన బుజ్జిబుజ్జి మాటలతో ఆ ఇంట వెలుగులు పండించిన బుజ్జాయిని రక్కసి బకెట్ బలితీసుకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ తిరిగిన తన మూడేళ్ల చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. స్థానిక మధురానగర్ వీవీ నరసరాజు రోడ్డుకు చెందిన మజ్జి గణేష్ దంపతులకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె కీర్తనకు మూడేళ్లు. ఇటీవలే జన్మదిన వేడుకలు జరుపుకొంది. బుధవారం ఉదయం అందరూ పన్నుల్లో ఉండగా, కీర్తన ఇంటి బయట నీటితో నిండిన బకెట్ వద్దకు వెళ్లింది. అక్కడే ఆడుకుంటూ కొద్దిసేపటికి బకెట్లోకి వంగి పడిపోయింది. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక కీర్తన చనిపోయింది. కొద్దిసేపటికి చుట్టుపక్కల వారు చెప్పడంతో తల్లిదండ్రులు గమనించారు. అయితే, కీర్తన అప్పటికే చనిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పీవీఆర్, ఉపాధ్యక్షుడు మహాలక్ష్మయ్య తదితరులు కీర్తన కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు
– మహిళపై దాడి – ఒంటిపైనున్న నగల దోపిడీ తిరుపతి క్రైం: నగరంలోని మధురానగర్‌లో శుక్రవారం దొంగలు పట్టపగలే ఓ మహిళపై దాడికి పాల్పడి బంగారు దోచుకున్నారు. బాధితురాలు సురేఖ అలియాస్ జ్యోతి కథనం మేరకు... మధురానగర్‌కు చెందిన సురేఖ (48) తన ఇద్దరు కూతుళ్లు, తల్లితో పాటు ఉంటుంటున్నారు. శుక్రవారం చిన్నకూతురు సొంతపని నిమిత్తం బయటికి వెళ్లింది. పెద్ద కూతురు, తల్లి మిద్దెమీద ఉన్న గదిని శుభ్రం చేసేందుకు వెళ్లారు. సురేఖ దేవుడి పటాలను శుభ్రం చేయాలని బయటికి వెళ్లింది. ఈ క్రమంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ముసుగు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు సురేఖ మొఖంపై కారం చల్లారు. నోటికి, మెడకు టేప్ చుట్టేశారు. అంతేగాక తలపై, మొఖంపై బలంగా కొట్టారు. ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఆమె మెడలో ఉన్న చైన్, చేతికున్న బంగారు గాజులు, కమ్మలు లాక్కున్నారు. అనంతరం ఆమెను ఇంట్లోకి నెట్టి పక్కనే ఉన్న కాంపౌండ్ వాల్ దూకి పరారయ్యారు. ఆమె కూడా వారి వెనుకనే పరిగెత్తేందుకు ప్రయత్నించింది. కేకలు వేయడంతో పక్కింటి వారు కూతురు, తల్లి కిందకు వచ్చారు. బాధితురాలని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జున, క్రైం సీఐ భాస్కర్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. ఈ దోపిడీలో 8 సవర్ల గాజులు, 3 సవర్ల చైన్, 6 గ్రాముల కమ్మలు పోయినట్లు బాధితురాలు తెలిపింది. -
ఇదండీ.. మన స్మార్ట్ అంగన్వాడీ!
ఈ ఫొటో చూశారా!.. ఆ ఏదో షాపు.. అయితే మనకేంటి అంటారా?.. అక్కడే మీరు పప్పులో కాలేశారు. మీరునుకుంటున్నట్లు అది పాన్షాపో.. చిన్న కిరాణా కొట్టో కాదు.. పేదవర్గాలకు చెందిన పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు.. గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు మన పాలకులు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రం. అది కూడా ఏ పల్లెలోనో లేదు.. రాష్ట్ర ఆర్థిక రాజధాని, స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న మన విశాఖ మహనగర నడిబొడ్డులోనే ఉండటం విశేషం. నగరంలోని సీతంపేట ప్రాంతంలోని మధురానగర్ చాకలిగెడ్డ అంగన్వాడీ కేంద్రం దుస్థితి ఇది. దీని పరిధిలో సుమారు 320 కుటుంబాలు ఉండగా 1258 మంది జనాభా ఉన్నారు. వీరిలో పేదవర్గాలకు చెందిన 16 మంది గర్భిణులు, ఆరుగురు బాలింతలు, 10 మంది పిల్లలకు ఈ అంగన్వాడీ కేంద్రం ద్వారా సేవలు, పౌష్టికాహారం అందాల్సి ఉంది. కేంద్రంలో ఓ కార్యకర్త, ఆయా ఉండాల్సి ఉండగా శుక్రవారం ‘సాక్షి’ పరిశీలించే సమయంలో ఆయా, ఆమెతోపాటు నలుగురు చిన్నారులు మాత్రమే బిక్కుబిక్కుమంటూ కనిపించారు. పౌష్టికాహారం, వారికి చదువు చెప్పడం వంటివేవీ కనిపించలేదు. ఒక ఇంటి మేడ మెట్ల కింద ఇరుకైన గదిలో ఏర్పాటు చేసిన ఆ కేంద్రం పరిస్థితి చూస్తే.. అదేదో నామమాత్రంగా నడుస్తున్నట్లే కనిపిస్తోంది. స్మార్ట్ సిటీ అని పాలకులు ఆర్భాటం చేస్తున్న విశాఖ నగరంలో పరిస్థితి ఏమాత్రం స్మార్ట్‌గా లేదని ఈ కేంద్రాన్ని చూసేవారెవరికైనా అర్థమవుతుంది. -
అప్పు చెల్లించలేదని వ్యక్తి అపహరణ
శంషాబాద్ (రంగారెడ్డి) : తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని రుణదాతలు అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన బురాన్ శంషాబాద్‌లోని మధురానగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగానే వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు దేవరకద్రకు చెందిన సుజాత అనే మహిళ దగ్గర రూ.40వేలు అప్పు కింద తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం బురాన్ ఇంటికి సుజాత తరఫున నలుగురు వ్యక్తులు వచ్చి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరారు. తనకు బయట వచ్చేవి ఉన్నాయని, అవి వచ్చిన వెంటనే తీరుస్తానని అతడు చెప్పాడు. దీంతో మాట్లాకుందాం రమ్మంటూ అతడ్ని తమ వెంట తీసుకెళ్లిపోయారు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ నర్సమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య
మధురానగర్ : కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవ వధువు కానరాని లోకాలకు చేరుకుంది. అయోధ్యనగర్ లోటస్ల్యాండ్మార్క్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోటస్‌ల్యాండ్ మార్క్ ఎనిమిదో బ్లాక్ వద్ద రోడ్డుపై ఓ యువతి మృతదేహం పడి ఉంది. ఆ ప్రాంతంలో నివాసం ఉండే 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానికులతో కలిసి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఆమె వడదెబ్బకు చనిపోయి ఉంటుందని భావించారు. సింగ్‌నగర్ ఎస్ఐ ఇంద్రశ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ నాయక్ సిబ్బందితో వచ్చి మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు తీవ్రగా యత్నించారు. ఫలితం లేకపోవటంతో లోటస్ల్యాండ్మార్క్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆ యువతి 8వ బ్లాకు లోపలికి వెళ్లడం, ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోవటం కనిపించాయి. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. ఎస్.వెంకటేశ్వరరావు రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. లోటస్ ల్యాండ్ మార్క్ ఎనిమిదో బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె సౌజన్య(25)కు ఈనెల 20వ తేదీన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో వివాహం చేశారు. సౌజన్య కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. దంపతులిద్దరూ హైద్రాబాద్‌లోనే ఉంటున్నారు. వెంకటేశ్వరరావు దంపతులు వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెనాలి వెళ్లారు. మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో సౌజన్య ఎనిమిదో బ్లాకులోకి వెళ్లింది. అనంతరం ఐదో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ చూస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు దంపతులు తెనాలి నుంచి తిరిగి వచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటేశ్వరరావు వద్ద నుంచి సౌజన్య భర్త ఫోన్ నంబరును పోలీసులు తీసుకుని కాల్ చేశారు. తన భార్య డ్యూటీకి వెళ్లిందని, తానుకూడా డ్యూటీలో ఉన్నానని చెప్పారు. కుమార్తె మృతదేహం వద్ద వెంకటేశ్వరరావు దంపతులు విలపిస్తున్న తీరు చూపరుల కంట తడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బుల్లా సేవలు సౌజన్య చనిపోయినప్పటినుంచి రాత్రి వరకు 50వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ స్థానికులతో కలిసి ఘటనాస్థలిలోనే ఉన్నారు. పోలీసులు మృతురాలి వివరాలు తెలుసుకోవటంలో అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు. సౌజన్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.