
కల్హేర్ (నారాయణఖేడ్): తల్లిదండ్రులు సెల్‌ఫోన్ రీచార్జ్ చేయించలేదని మనస్తాపానికి గురైన విద్యార్థి నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూ ర్ ఈ సంఘటన చోటుచేసుకుంది. సిర్గాపూర్‌కు చెందిన నాయిని పెంటయ్య, పోచవ్వ దంపతులకు రేణుక, నాగార్జున (15), కృష్ణ సంతానం. నాగార్జున సిర్గాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
ఆన్‌లైన్ పాఠాలు వినడం కోసం గత నెల 31న ఫోన్ రీచార్జ్ చేయించాలని తల్లిదండ్రులను కోరాడు. వారు స్పం దించకపోవడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కుటుంబీకులు ఎంత వెతి కినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం నాగార్జున మృతదేహం నల్లవాగు ప్రాజెక్టులో కన్పించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహన్ని వెలికితీశారు.
Comments
Please login to add a commentAdd a comment