Mahabubnagar: Boy Extramarital Affair With Married Woman - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం..మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య

Published Tue, Nov 9 2021 11:54 AM | Last Updated on Tue, Nov 9 2021 1:27 PM

Boy Extramarital Affair With Married Woman In Mahabubnagar - Sakshi

మధు (ఫైల్‌)

సాక్షి, దేవరకద్ర (మహబూబ్‌నగర్‌): మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన మధు (20) మూడు రోజుల క్రితం అడ్డాకుల మండలం గుడిబండలోని పెద్దమ్మ జయమ్మ ఇంటికి వచ్చాడు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఆ ఇంటి మందున్న చెట్టుకు ఊరేసుకుని చనిపోయాడు. సోమవారం ఉదయం బంధువులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.

సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ విజయకుమార్‌ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, 20రోజుల క్రితం గోపన్‌పల్లిలో ఓ వివాహితతో కలిసి ఈ యువకుడు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటనలో ఆమె మృతి చెందగా మధు ప్రాణాలతో బయటపడిన విషయం విదితమే. వివాహేతర సంబంధం నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఈ యువకుడు చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement