
ఇన్‌సెట్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి తల్లిదండ్రులు రమేశ్, శ్యామల
దొడ్డబళ్లాపురం: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు పరువు పేరుతో ఆమెను హత్యచేయడం అక్కడక్కడా జరుగుతోంది. ఈసారి తల్లిదండ్రులే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన చెన్నపట్టణ తాలూకా తెంకనహళ్లిదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు రమేశ్ (50), భార్య శ్యామల (42) ఆత్మహత్యవారు. వీరి కుమార్తె శిల్ప (21) ను ఎంతో అల్లారుముద్దుగా పోషించారు. ఆమె ఇదే గ్రామానికి చెందిన యువకుడు పునీత్‌తో ప్రేమలో పడింది. కులాలు ఒక్కటే అయినా పలు కారణాల వల్ల శిల్ప తల్లిదండ్రులు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో మే 30న శిల్ప పునీత్‌తో వెళ్లిపోయి వివాహం చేసుకుంది. విషయం తెలిసిన దంపతులు అవమానభారంతో మంగళవారం నాడు తమ తోటలో మామిడి చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో బుధవారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment