Mother and father
-
ఈ హృదయ విదాకర కేసులో తీర్పు ఇవ్వలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : తన కుమారుడి కారుణ్య మరణానికి (euthanasia) అనుమతించాలని దాఖలు చేసిన తల్లిదండ్రల అభ్యర్ధనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ హృదయ విదారక కేసులో పిటిషనర్లకు మద్దతుగా తీర్పు ఇవ్వలేమని తెలిపింది. అదే సమయంలో 11ఏళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుణ్ని చూసుకునేందుకు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏదైనా సంస్థ బాధితుడి సంరక్షణ బాధ్యతల్ని చూసుకుంటుందో తెలుసుకోవాలని కేంద్రాన్ని కోరింది. కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే.. అశోక్ రాణా,నిర్మలా దేవి దంపతుల కుమారుడు హరీష్ రాణా. 2013లో చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివేవారు. ఆ ఏడాది ఆగస్టు 3న సాయంత్రం 7 గంటలకు చండీగఢ్ నుంచి తండ్రి అశోక్ రాణాకు ఫోన్ వచ్చింది. హరీశ్ కింద పడిపోయి, గాయాలపాలయ్యారని చెప్పారు.నాలుగో అంతస్తు నుంచి కిందపడిహరీష్ తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అలా అయ్యింది. తొలుత హరీష్‌కు చండీగఢ్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. తలకు బలమైన గాయం కావడంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు.ట్రీట్మెంట్ కోసం ఆస్తులమ్మితల్లిదండ్రులు ఇంటి నుంచి చికిత్స అందించే వారు. చికిత్స నిమిత్తం హరీష్ రాణాకు పైపుల (రైల్స్ ట్యూబ్) ద్వారా ఆహారాన్ని, మెడిసిన్‌ను పంపించే వారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చయ్యేది. ఉన్న ఆస్తుల్ని అమ్మి చికిత్స అందించినా.. కుమారుడిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో కుమారుడి కారుణ్యం మరణానికి అవకాశం కల్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలనితాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు బాధితుడి తల్లిదండ్రులు. మంగళవారం బాధితుల పిటిషన్‌పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అశోక్ రాణా తరుఫు న్యాయవాది మాట్లాడుతూ.. కుమారుడి వైద్యం కోసం అశోక్ రాణా దంపతులు తమ ఇంటిని విక్రయించారని, ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని, కారుణ్య మరణం పొందేలా వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.పిటిషన్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేంపిటిషన్ల అభ్యర్ధనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రైల్స్ ట్యూబ్ తొలగింపు కారుణ్య మరణంలో భాగం కాదు. రైల్స్ ట్యూబ్ తీసివేస్తే రోగి ఆకలితో మరణిస్తారు'అని బెంచ్ పేర్కొంది. అయితే, ఈ హృదయ విదారకమైన కేసులో పిటిషన్లకు మద్దతుగా తీర్పు ఇవ్వలేం. అలాగని చూస్తూ ఉండిపోం. పిటిషనర్లైన తల్లిదండ్రులు దశాబ్దానికి కుమారుడి కోసం కష్టపడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణంలో ఇప్పటి వారి జీవితంలో వెలుగు చూడలేదు.అందుకే తల్లిదండ్రుల్ని ఆర్ధిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పిస్తూ కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని బెంచ్ అభ్యర్థించింది.తల్లిదండ్రులకు ఉపశమనం కలిగేలాఇది చాలా కఠినమైన కేసు. తల్లిదండ్రులు 13 ఏళ్లుగా కష్టపడుతున్నారని, ఇకపై తమ కుమారుడి వైద్య బిల్లులు భరించలేకపోతున్నారని సీజేఐ తెలిపారు. ఏదైనా సంస్థ హరీష్ రాణాను జాగ్రత్తగా చూసుకోగలదో లేదో తెలుసుకోండి. రైల్స్ ట్యూబ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నప్పటికీ, కారుణ్య మరణానికి అనుమతించలేమని’అని బెంచ్ తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఆరోగ్య మంత్రిత్వ శాఖను సంప్రదింస్తామని చెప్పారు. -
తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు..
సాక్షి, మల్యాల(కరీంనగర్): తమ కూతురు చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట భైఠాయించిన సంఘటన మల్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మల్యాల మండలకేంద్రానికి చెందిన సంగ శ్రీనివాస్–మంజుల కుమార్తె తేజస్విని గతేడాది సెప్టెంబర్ 3న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా స్థానికుల సమాచారం మేరకు అప్పటి సీఐ కిశోర్ శవయాత్రను మధ్యలో నిలిపివేసి పోస్టుమార్టంకు తరలించారు. తల్లిదండ్రులే కూతురిని చంపారంటూ పుకార్లు పుట్టాయి. తమ కూతురు చావుకు తాము కారణం కాదని నిరూపించుకునేందుకు తేజస్విని మృతికి కారణాలు కనుగొనాలని పోలీసుల చుట్టూ తిరుగుతున్నామని శ్రీనివాస్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల అబ్బాయి ప్రేమపేరుతో వంచించడంతోనే కూతురు మృతిచెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రమణమూర్తి బాధితులతో మాట్లాడి కేసు విచారణ చేపడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
నేడు తల్లిదండ్రుల దినోత్సవం: ప్రత్యక్ష దైవాలు అమ్మానాన్న..
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): క్షీరసాగర మథనంలో అమృతం లభించినప్పుడు దేవతలు పరస్పరం పంచుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కానీ అదే అమృతం దొరికితే కడుపున పుట్టిన బిడ్డల కోసం పంచిపెట్టగలిగిన అమృత మూర్తులు తల్లిదండ్రులు. కని పెంచడంతో పాటు బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలూ శ్రమించే నిత్య కార్మికులు అమ్మానాన్నలు. తమలా బిడ్డలు కష్టపడకూడదనే ఆకాంక్షతో కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకునే అమ్మానాన్నల ను అవసాన దశలో వృద్ధాశ్రమాలకు పరిమితం చేసే నవతరం సంతానం ఇప్పుడు కనిపించడం ప్రపంచీకరణ చేసిన దారుణం. పరిస్థితులు ఏవైనా తమ ఉనికికి రూపం ఇచ్చి, ఉన్నతికి ఉన్నదంతా ధారపోసే తల్లిదండ్రుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఉన్న కొన్నాళ్లూ కంట తడి పెట్టకుండా చూసుకోగలిగితే అదే పదివేలు అనుకునే కన్నవాళ్లకు కొదవ లేదీ లోకంలో.. నేడు తల్లిదండ్రుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా తల్లిదండ్రుల దినోత్సవం జరపాలన్న ప్రతిపాదన అమెరికాలో ప్రారంభమైంది. 1984లో అప్పటి దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారికంగా ఈ రోజుకు ఆమోద ముద్ర వేశారు. అమ్మానాన్నల్లో ఎవరూ తక్కువ కాదనే సందేశాన్ని విస్తరింపజేయడమే ఈ దినోత్సవం అసలు నేపథ్యం. మన అస్తిత్వానికి పునాది అమ్మానాన్నలే.. ఎవరి జీవితం ఉన్నత స్థితికి చేరినా, వారి వెనక నిరంతరం శ్రమించిన తల్లిదండ్రులే ఉంటారనేది సత్యం. మనందరం ఈనాడీ స్థితిలో ఉన్నామంటే నిన్నటి వరకు వాళ్లు మన కోసం పడిన కష్టానికి ఫలితమే. వాళ్ల సహకారం, ప్రేరణతోనే ఈ స్థితికి చేరుకున్నామని జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఇపుడున్న యువతరం నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఛేదించాలి. తమ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శ్రమించిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా పూజించాలి. వాళ్ల రుణం తీర్చుకునేందుకు బతికి ఉన్నంత వరకు ప్రయత్నించాలి. ఈ పేరెంట్స్ డే అందుకు ప్రేరణ కలిగించాలి. – రాహుల్ హెగ్డే, ఎస్పీ రాజన్న సిరిసిల్ల అమ్మానాన్నల కల నిజం చేయాలని.. చిన్న వయసులో జిల్లా స్థాయి అధికారిగా ఈ స్థితిలో ఉన్నానంటే కారణం కేవలం మా అమ్మానాన్నలు మాత్రమే. సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన నాన్న చిన్న జీతంతో మమ్మల్ని సంతోషంగా పెంచారు. చదువు విషయంలో నన్ను, తమ్ముడిని, అమ్మను కూడా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం కారణంగానే మా అమ్మ పెళ్లయిన పదిహేనేళ్ల తర్వాత లెక్చరర్ ఉద్యోగం సాధించగలిగింది. మా అమ్మ నాకు మంచి స్నేహితురాలు. నా పెళ్లయ్యాక కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రోద్బలం చాలా ఉంది. నన్నో కలెక్టర్‌గా చూడాలన్న అమ్మానాన్న కల నిజం చేసేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నా. ఎప్పటికైనా సాధించి చూపాలన్నది నా డ్రీమ్. – అలేఖ్య పటేల్, సీడీపీవో, రాజన్న సిరిసిల్ల కుమారుడిని కలెక్టర్ చేసిన ట్రాన్స్‌కో ఉద్యోగి కోరుట్ల: దురిశెట్టి మనోహర్ ఓ సాధారణ ట్రాన్స్‌కో ఉద్యోగి. భార్య జ్యోతి గృహిణి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు అనుదీప్, అభినయ్. మనోహర్ ట్రాన్స్‌కో సబ్ ఇంజనీర్‌గా విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కొడుకులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాలన్న తపన వీడలేదు. ఆయన తపనకు తోడు పిల్లలను భార్య ఆ దిశలో సంసిద్ధం చేసే పనిలో పాలుపంచుకుంది. తల్లిదండ్రుల తపనను అర్ధం చేసుకున్న పెద్ద కుమారుడు అనుదీప్ వారి కలలను సాకారం చేసే దిశలో ముందుకు సాగాడు. 2011లో బిట్స్ పిలానీ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్ ప్రిపరేషన్‌పై దృష్టి సారించాడు. 2013లో సివిల్స్ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికయ్యాడు. 2017లో అఖిల భారత స్థాయిలో సివిల్స్ మొదటి ర్యాంకు సాధించి తల్లిదండ్రుల కలలు పండించాడు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండో కుమారుడు అభినయ్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సివిల్స్‌కు ప్రిపేరవుతున్నాడు. -
కూతురు ప్రేమపెళ్లి.. పరువు కోసం కన్నవారు ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు పరువు పేరుతో ఆమెను హత్యచేయడం అక్కడక్కడా జరుగుతోంది. ఈసారి తల్లిదండ్రులే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన చెన్నపట్టణ తాలూకా తెంకనహళ్లిదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు రమేశ్ (50), భార్య శ్యామల (42) ఆత్మహత్యవారు. వీరి కుమార్తె శిల్ప (21) ను ఎంతో అల్లారుముద్దుగా పోషించారు. ఆమె ఇదే గ్రామానికి చెందిన యువకుడు పునీత్‌తో ప్రేమలో పడింది. కులాలు ఒక్కటే అయినా పలు కారణాల వల్ల శిల్ప తల్లిదండ్రులు వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో మే 30న శిల్ప పునీత్‌తో వెళ్లిపోయి వివాహం చేసుకుంది. విషయం తెలిసిన దంపతులు అవమానభారంతో మంగళవారం నాడు తమ తోటలో మామిడి చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో బుధవారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. -
అనాథలను ఆదుకోరూ...
వెల్గటూరు(ధర్మపురి) : రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. లైన్ బండి(లారీ) నడుపుతున్న నాన్న, పొద్దంతా బీడీలు చుట్టే అమ్మ నెల వ్యవధిలో అంతుచిక్కని వ్యాధితో మరణించడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. వీరిలో పెద్ద పాప కూడా అనారోగ్యం బారిన పడడం.. అమ్మమ్మ లేచి నడవలేని స్థితిలో ఉండడం ఆ కుటంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుతం చిన్నారులకు బంధువులు బుక్కెడు వండి పెడితే తింటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం .. మండలంలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన పొనగంటి శ్రీనివాస్(45), బుజ్జవ్వ (38) దంపతులు అంతుచిక్కని వ్యాధి బారినపడి నెల వ్యవధిలో మృతి చెందారు. దీంతో వారిపిల్ల్లలు శ్రీవాణి(17), వెంకటేశ్(13), వైష్ణవి(10) వీధిన పడ్డారు. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బుజ్జవ్వను వివాహం చేసుకుని ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు. సుమారు 20ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. శ్రీనివాస్ పెట్రోల్ ట్యాంకర్ లైన్‌బండి నడుపుతుండగా అతడి భార్య బీడీలు చుడుతూ పిల్లలను పోషించుకుంటున్నారు. నెలక్రితం శ్రీనివాస్ మరణించగా.. గురువారం బుజ్జవ్వ మృతి చెందింది. దీంతో పిల్లలు అనాథలయ్యారు. వీరితో పాటు ఉంటున్న అమ్మమ్మ చంద్రవ్వ కళ్లు కనపడక లేవలేని స్థితిలో ఉంది. ఉన్నతాధికారులు, నాయకులు స్పందించి పిల్లల చదువు ఆగిపోకుండా.. వారిని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. -
గాలిలో దీపంలా చిన్నారుల ప్రాణాలు
భీమవరం(పెళ్లకూరు): ఒకటి కాదు...రెండు కాదు...వరుసగా రోడ్డు ప్రమాదాలే...నిత్యం ఏదోకచోట విద్యార్థులు ప్రయాణించే బస్సులే ప్రమాదాలకు గురవుతున్నాయి. ముక్కుపచ్చలారరని చిన్నారులతో పాటు కళాశాలకెళ్లే విద్యార్థులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో పాటు తీవ్రంగా గాయపడుతున్నారు. అన్నింటికంటే ప్రధానంగా ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. తల్లిదండ్రులు ప్రాణపదంగా భావించే తమ పిల్లలను ఎంతో ఆనందంగా స్కూల్‌కు పంపిస్తుంటే ప్రమాదాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా 71వ జాతీయ రహదారిపై భీమవరం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం సాయంత్రం స్కూల్ వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో 19 మంది విద్యార్థులకు గాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిల్లకూరు వడ్డిపాళెం గ్రామంలోని ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులను భీమవరం, నెలబల్లి గ్రామాలకు తీసుకెళుతుంది. క్రాస్ రోడ్డుకు వ్యాన్ తిరిగే సమయంలో నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్లే లారీ స్కూల్ వ్యాన్‌ను వెనుక భాగంలో ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలోకి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యానులో ఉన్న 19మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలు ఆషాకు గాయాలయ్యాయి. వ్యాన్‌లో వున్న రాంధీప్, కౌశిక్‌లకు తలపైన, సంధీప్, రేష్మ, భరత్‌కుమార్‌లకు కాలు, చెయ్యి విరిగాయి. వాసు, వెంకటేష్, రూప, పురంధరీశ్వరి, గణేష్, ఉదయ్‌కుమార్, పవన్, ప్రవళిక తదితరులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై శివశంకరావు తన సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయపడిన విద్యార్థులను 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. తలపై గాయాలైన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. నాయుడుపేట సీఐ రత్తయ్య, ఎస్సై ఆంజనేయరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్కూల్‌వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్‌కి గతంలో పలుమార్లు హెచ్చరించామని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌వ్యాన్ ప్రమాదానికి గురైన సమాచారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్థులకు వెంటనే వైద్య సేవలు చేయించేలా చర్యలు చేపట్టారు. తమ బిడ్డలకు ఏమైందో నంటూ ఆసుపత్రి ప్రాంగణం తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటాయి. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొడుకు కొడుతున్నాడయ్యా..
ప్రత్తిపాడు: మండలంలోని వంగిపురం గ్రామానికి చెందిన శిగా ఏసు, నవమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ఈ వృద్ధ దంపతుల వయసు 80 ఏళ్ల పైమాటే. వారికి ఉన్న ఎకరం పొలం తెగనమ్మి వచ్చిన నగదుతో అప్పులు తీర్చుకుని, మరికొంత వారి శేషజీవితం నిమిత్తం ఉంచుకున్నారు. మిగిలిన సొమ్మును నలుగురు సంతానానికి సమానంగా తలాకొంచెం పంచారు. తమకున్న పది సెంట్ల స్థలంలో ఒక సెంటు భూమి తాము ఉంచుకుని మిగిలిని తొమ్మిది సెంట్లు ముగ్గురు కుమారులకు పంచి ఇచ్చారు. ప్రస్తుతం వీరు పెద్ద కుమారుడు సుభాకరరావు వద్ద తలదాచుకుంటున్నారు. ఈ పంపకాల విషయం సుభాకరరావు, వృద్ధ దంపతులకు మధ్య మన స్పర్ధలు తలెత్తాయి. తమ వద్ద ఉన్న సెంటు భూమిని కూడా తదనంతరం పెద్దకొడుకుకే రాసిస్తామని చెప్పినా అతడు వినలేడు. తల్లిదండ్రులు దాచుకున్న కొద్దిపాటి డబ్బుతోపాటు ఆ సెంటు స్థలం కూడా తన పేరిట ఇప్పుడే రాసివ్వాలని వేధించడం ప్రారంభించాడు. వృద్ధురాలనే కనికరం కూడా లేకుండా కొడుతున్నాడు. ఈనేపథ్యంలో కొడుకు పెడుతున్న చిత్ర హింసలు భరించలేని ఆ వృద్ధ దంపతులు శనివారం ప్రత్తిపాడు పోలీసులను ఆశ్రయించి తమ గోడును వెల్లబోసుకున్నారు. కొడుకుని స్టేషన్‌కు పిలిపించి, సర్దిచెప్పిన ఎస్ఐ కె.వాసు వృద్ధులను అతడి వెంట పంపించారు. ఇంటికి వెళ్లాక తన బుద్ధి మార్చుకోని సుభాకరరావు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహంతో మళ్లీ ఆ వృద్ధులపై చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శనివారం రాత్రి వంగిపురం గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. గతంలోనూ ఒకసారి పెద్దకొడుకు తల్లిపై చేయి చేసుకోవడంతో అప్పట్లో కూడా పోలీసులను ఆశ్రయించారు. బాధలు భరించలేక రెండో కొడుకు ఇంటికి వెళ్తే వాస్తు ప్రకారం తన ఇంట్లో ఉండకూడదంటూ బయటకు పంపేశాడంటూ ఆ అభాగ్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి
కరీంనగర్ హెల్త్ : ప్రాణంతో ఆస్పత్రిలో చేరిన ఓ యువకడు... శుక్రవారం శవమై కుటుంబ సభ్యులకు చేరాడు. మత్తు ఇంజెక్షన్ వికటించడంతోనే కొడుకు ప్రాణాలు పోయూయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి తల్లిదండ్రులు గట్టు రాజమ్మ, మురళి, భార్య రాణి కథనం.. కమాన్‌పూర్ మండలం జూలపల్లికి చెందిన గట్టు అనిల్ (24) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ‘మిషన్ కాకతీయ’ పూడికతీత పనుల భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ సమీపంలో పనులు నిర్వహిస్తున్నాడు. గత నెల 31న పనిచేస్తున్న క్రమంలో లోడుతో ఉన్న లా రీ అదుపుతప్పి పడిపోయింది. ప్రమాదంలో అనిల్ ఎడమచేరుు విరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేకపోవడంతో నగరంలోని అమృత నర్సింగ్ హోమ్ (ఎల్.రాంరెడ్డి హాస్పిటల్)లో చేర్పిం చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యు లు ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. బాధితుడికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సలహాకూడా ఇచ్చారు. కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని ఈనెల 3వ తేదీన ఆరోగ్యశ్రీ కార్డును తీసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడికి పూర్తిస్థాయి చికిత్స కోసం అడ్మిట్ చేశారు. ఈనెల 8న ఉదయం 9 గంటలకు వైద్యులు ఆపరేషన్ కోసం అనిల్‌ను థియేటర్లోకి తీసుకెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల కు డాక్టర్ పిలిచి మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో రోగికి ఫిట్స్ వచ్చినట్లు తెలిపాడు. వైద్యం అందించేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వేరే ఆస్పత్రికి పంపిస్తున్నామని తెలిపి సాయంత్రం 3.30 గంటలకు న గరంలోని శ్రీలక్ష్మి హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో చే ర్పించిన ప్పటి నుంచి రోగి పరిస్థితి తెలపకుండా వైద్యులు డబ్బులు గుంజుతూ కాలయూపన చేశారు. రోగిని చూడనివ్వలేదు. అనిల్ బతికే ఉన్నాడనే నమ్మకం కోల్పోయిన కుటుంబ సభ్యులు ఈనెల 16న జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఆయన రోగి పరిస్థితి తెలుసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఆదేశాలు జారీ చేశారు. డీఎంహెచ్‌వో డాక్లర్ల బృందాన్ని హాస్పిటల్‌కు నిర్ధారణకు పంపించారు. వైద్యుల బృందం శుక్రవారం ఉదయం 7 గంటలకు అనిల్ చనిపోరుున ట్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అనిల్ చనిపోయూడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితుల పక్షాన న్యా యవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితిని గమనించిన ఆస్పత్రుల యూజమాన్యాలు అనిల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారుు. అప్పటికే కోమాలో ఉన్నాడు.. శ్రీలక్ష్మి హాస్పిటల్‌కు తీసుకువచ్చేటప్పటికే అనిల్ కోమాలో ఉన్నాడు. మత్తు ఇంజక్షన్ వల్లనో.. దేనికో తెలియదు ఆపరేషన్ సమయంలో క్షతగాత్రుడి గుండె ఆగిపోరుుంది. బీపీ తగ్గిపోయి, పల్స్ పనిచేస్తూ కోమాలో ఉన్నాడు. వెంటిలేటర్ ఇస్తూ ఆస్పత్రికి తరలించాం. అప్పుడు మృతుడి తల్లి ఉంది. ఆస్పత్రికి తీసుకువచ్చాక పరిస్థితి విషమంగా ఉందని తెలియచేశాం. రెండు, మూడు రోజులు వైద్య సేవలు అందిస్తే క్యూర్ అయ్యేట్టు కనిపించాడు. తర్వాత బీపీ తగ్గిపోయింది. మెదడుకు ఆక్సిజన్ అంద క అనిల్ చనిపోయూడు. - డాక్టర్ వినయ్‌కుమార్, శ్రీలక్ష్మి హాస్పిటల్ -
ప్రేమను బతికించుకోలేక..
మానవపాడు : చిన్నవయసులో అర్థంకాని ఆకర్షణను ప్రేమ అనుకుని ఎలాగైనా బతికించుకోవాలనే తపనతో ఆ ఇద్దరూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి తల్లిదండ్రులు ఒప్పుకోరని బయటకు వెళ్లిన 24 గంటల్లోపే చావులోనైనా ఒకటి కావాలని తలచి తనువు చాలించారు. హృదయ విదారకమైన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొన్ని రోజులుగా మండలంలోని చిన్నపోతులపాడుకు చెందిన సుమన్ (20), మాధవి (15) ప్రేమించుకుంటున్నారు. సుమన్ కర్నూలు పట్టణంలోని ఎస్టీబీసీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్, మాధవి మానవపాడులోని ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదవుతున్నారు. వీరి మధ్య కొంత కాలంగా ప్రేమవ్యవహారం కొనసాగుతుండటంతో ఇంట్లోవారు గమనించి మందలించి బాగా చదువుకోవాలని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం ఇద్దరూ కలిసి కర్నూలు జిల్లాలోని నంద్యాలకు చేరుకున్నారు. అదే రాత్రి పది గంటలకు అన్న సురేష్‌కు ఫోన్‌చేసి ‘మా ప్రేమ బతకడం కష్టంగా ఉండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నాం...’ అని సుమన్ చివరిసారిగా మాట్లాడారు. ఆ తర్వాత వారి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ఇరు కుటుంబాలవారు మానవపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే ఆదివారం ఉదయం 9.30 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని పొన్నూర్ శివారులో ఆత్మహత్య పాల్పడినట్టు తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
నన్ను క్షమించండి..!
‘‘ నన్ను క్షమించండి.. చదువులో రాణించి డాక్టర్ కావాలన్న నా కలను నెరవేర్చుకో లేకపోతున్నాను. నా తల్లిదండ్రులు నాతో ప్రేమగా ఉండడం లేదు. దీనివల్ల నేను కొంత ఆందోళనకు గురయ్యా.. నేను చదువులో ఫస్ట్ ఉంటూ అందరి మన్ననలు పొందాను. ఉపాధ్యాయులు కూడా నాతో సక్రమంగా మాట్లాడడం లేదు. ఈ మధ్యకాలంలో ప్రిన్సిపాల్ నాతో కొంత అసౌకర్యంగా ఉంటున్నారు. నేను మరింత బాధకు గురయ్యాను. నాలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు..’’ అని జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లిలో ఆత్మహత్మకు పాల్పడిన విద్యార్థిని మమత(13) సూసైడ్ నోట్లో తన ఆవేదన వ్యక్తపరిచింది. మహబూబ్‌నగర్ క్రైం: తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామానికి చెందిన రత్నం, సులోచన కు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నాడు. పెద్దకుమార్తె మమత (13) చిట్టెబోయినిపల్లి బాలికల గురుకుల పాఠశాలలో 9వ తరగతి చ దువుతోంది. చదువులో రాణిస్తూ ఉపాధ్యాయుల మన్నలను పొందింది. దీనికితోడు క్రీడల్లో పలు అంశాల్లో నైపుణ్యం సాధించింది. ఇదిలాఉండగా, గురువారం ఉదయం తన హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఉదయం పాఠశాలలో ప్రార్థన సమయానికి రాకపోవడంతో తోటి విద్యార్థినులు వెళ్లిచూడగా ఉరేసుకుని కనిపించింది. హుటాహుటిన చికిత్సకోసం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. సంఘటన తెలుసుకునేందుకు ఏజేసీ డాక్టర్ రాజారాం జిల్లా ఆస్పత్రిని సందర్శించి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులతో కారణాలు తెలుసుకున్నారు. డాక్టర్ కావాలనుకున్న కలను నెరవేర్చలేకపోతున్నానని సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. కాళ్ల వెండిపట్టీలు, రూ.200లను క్లాస్టీచర్కు ఇస్తున్నట్లు రాసింది. ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే.. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జయంతి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని విద్యార్థిని మమత తల్లిదండ్రులు రత్నం, సులోచన ఆరోపించారు. కూతురును విగతజీవిగా చూసి కన్నీరుమున్నీరయ్యారు. చదువులో ఎప్పుడూ ఫస్ట్‌గా ఉండే తమ కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు ఉన్నాయని విలపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు రోదించారు. ‘స్వేరోస్’ విచారం ఎంతో భవిష్యత్ ఉన్న మమత మృతిపట్ల స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.విజేందర్, రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్.స్వాములు, జిల్లా ప్రధానకార్యదర్శి టి.కృష్ణ, ఎం.వెంకట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థినుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులదే అన్నారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి మహబూబ్‌నగర్ క్రైం: చిట్టెబోయిన్‌పల్లి గురుకుల పాఠ శాల ప్రిన్సిపాల్ జయంతిని సస్పెండ్ చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థిని మమత(13) మృతికి ప్రిన్సిపాల్ జయంతే కారణమని కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించారు. జడ్చర్ల సీఐలు జంగయ్య, గిరిబాబు, టూటౌన్ సీఐ సోమ్నారాయణ్సింగ్, ఎస్సై రమేశ్‌లు బాధితులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నివేదిక కోరినబాలల హక్కుల కమిషన్ మమత(13) మృతిపై వచ్చేనెల 3వ తేదీలోగా సమగ్రనివేదిక సమర్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించింది. బాలిక మృతికి ప్రిన్సిపాల్ జయంతే కారణమని తండ్రి చెప్పాడని పేర్కొంది. బఅంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం వెంటనే అందించాలని కోరింది. చదువు, ఆటాపాటల్లో ప్రతిభావంతురాలిగా ఉన్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం పట్ల విచారం వ్యక్తంచేసింది. ప్రిన్సిపాల్‌పై అట్రాసిటీ కేసునమోదు మమత ఆత్మహత్య ఘటనకు సంబంధించి ప్రిన్సిపాల్ జయంతిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేసినట్లు సీఐ జంగయ్య తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు తన సూసైడ్‌నోట్‌లో పేర్కొనడంతో ఆమెపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ప్రియుడు మోసం చేశాడని..
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. చెప్పాపెట్టకుండా వే రే అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అలా ఎందుకు చేస్తున్నావని నిలదీసిన ప్రియురాలిని ‘నీ చావు నీవు చావుపో’ అంటూ కఠినంగా మాట్లాడాడు. తీవ్ర వేదనకు గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్రగుంట్ల: ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరులోని గుంత బజారు కాలనీలో నివాసముంటున్న అలమూరు దస్తగిరి, దస్తగిరమ్మకు ఇద్దరు కూతుర్లు. వారిలో పెద్ద అమ్మాయి దస్తగిరమ్మ, చిన్నమ్మాయి ఇమాంబీ. దస్తగిరి డ్రైవరుగా పని చేసుకుంటూ మరో పక్క కూడలిలో కూరగాయల అంగడి పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్దామ్మాయి దస్తగిరమ్మ నంద్యాలలోని బీటెక్ చదువుతుండగా, చిన్నమ్మాయి ఇమాంబీ ఎర్రగుంట్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇమాంబీ కళాశాలకు పోతుండగా అదే గ్రామానికి చెందిన నల్లమేకల ఉత్తమకుమార్‌రెడ్డి(ఉత్తమారెడ్డి) వెంట పడుతూ వేధించాడు. ఈ తరుణంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఎనిమిది నెలలుగా అమ్మాయి చుట్టూ తిరిగాడు. తరుచూ ఫోన్ చేస్తుండేవాడు. మరో అమ్మాయితో వివాహం కుదరడంతో... అయితే శనివారం మరో అమ్మాయితో అనంతపురంలోని పెళ్లికి పూనుకొని మార్చి 7,8 తేదీల్లో వివాహం ఖాయం చేసుకున్నారు. శనివారం ఇమాంబీకి ఫోన్ చేశాడు. ‘నీ చావు నీవు చావు అని, నాకు వివాహం కుదిరిందని చెప్పాడ’ని మృతురాలి బంధువులు తెలిపారు. ఇమాంబీ ఇంటిలో తల్లిదండ్రులు ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం కూరగాయల అంగడి నుంచి తల్లి దస్తగిరమ్మ ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉండడం గమనించింది. కిటికిలో నుంచి చూడగా కూతురు ఉరి వేసుకొని వేలాడుతూ ఉండడం గమనిచింది. వెంటనే పక్కనే ఉన్న స్థానికులను పిలిచి తలుపులు పగలగొట్టి లోనికి పోయి వేలాడుతున్న ఇమాంబీని కిందకు దించారు. అప్పటికే మృతి చెందినది. తల్లిదండ్రులు బోరుమని విలపించారు. ఇమాంబీ మృతికి కారకుడైన ఉత్తమకుమార్‌రెడ్డిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ భానుమూర్తి సందర్శించారు. తల్లి దస్తగిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నెల్లూరుకు సింధు భౌతిక కాయం
నెల్లూరు (అర్బన్) : అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతి చెందిన నెల్లూరుకు చెందిన సాయిసింధు (25) భౌతికకాయం ఆదివారం నగరానికి చేరుకుంది. సింధుని ఆమె భర్తే కడతేర్చాడని ఈ నెల 11వ తేదీన ఆమె తల్లిదండ్రులు కిన్నెర కృష్ణయ్య, ఉమామహేశ్వరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఎంబసీ అధికారులు, స్థానిక తెలుగు అసోసియేషన్ సహకారంతో సింధు భౌతికకాయం నెల్లూరుకు తెప్పించారు. అమెరికా నుంచి కార్గో విమానంలో శనివారం సింధు భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ నుంచి తల్లిదండ్రులు, బంధువులు అంబులెన్స్‌లో ఆది వారం ఉదయం 8.30 గంటలకు నగరంలోని సవరాల వీధిలో ఉన్న ఆమె ఇంటికి తీసుకువచ్చారు. సింధు భౌతికకాయం రావడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు వచ్చి సింధు మృతదేహాన్ని చూసి విలపించారు. తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహం రావడంతో చూసి గుండెలవిసేలా రోదించారు. పోలీసులకు ఫిర్యాదు : ఇది వరకే ఎస్పీకి ఫిర్యాదు చేసిన సాయి సింధు తల్లిదండ్రులు ఆదివారం తమ కుమార్తె మృతి పై అనుమానాలు ఉన్నాయని, మరోసారి మూ డో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రీ పోస్టుమార్టం నిర్వహించి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ బాజీజాన్ సైదా, ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. నెల్లూరు తహశీల్దార్ జనార్దన్‌రావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.డీఎస్ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సింధు భౌతికకాయానికి రీ పోస్టుమార్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సింధు ఇక లేదని... పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన తమ కుమార్తె సాయి సింధు పెళ్లయిన మూడున్నర సంవత్సరాలకే చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వీరిని చూసి చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు. గతేడాది ఆగస్టులో సింధు నెల్లూరులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. భర్త ఉదయ్‌కుమార్ వేధిస్తున్నాడని వారి దృష్టికి తీసుకు వచ్చింది. వాళ్లు తమకు ఉండేది ఇద్దరు కుమార్తెలని, ఆస్తి వారికే ఇస్తామని చెప్పి ఒక ఎకరా పొలం రాసిస్తామన్నారు. భర్త సరేనని ఒప్పుకోవడం సింధు అమెరికాకు వెళ్లింది. అంతా సజావుగా ఉందనుకున్న సమయంలో ఈ నెల 6వ తేదీన సింధు ఆత్మహత్యాయత్నం చేసిందని, 9వ తేదీన చనిపోయిందని ఉదయ్‌కుమార్ సింధు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లు అప్పటి నుంచి సింధు భౌతికకాయాన్ని నెల్లూరుకు తెప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. -
నేడు ప్రేమికుల రోజు
నిజమైన ప్రేమ చావదు... కడప అర్బన్ : ప్రేమ రెండు హృదయాలను కలుపుతుంది. కానీ, నేటి రోజుల్లో ఆకర్షణనే ప్రేమగా భావిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడి తమ పిల్లలను పెంచి పెద్దచేసి తమ ఆశయాలను సాధిస్తారని భావిస్తే...వారి ఆశయాలను ఆకర్షణ పేరుతో తుంచేసి తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. గత సంవత్సరం.... ఊ జనవరి 20వ తేదిన ప్రొద్దుటూరుకు చెందిన మైనర్ ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఊ ఫిబ్రవరి 7వ తేదిన నందలూరుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్యకు పాల్పడింది. అదే నెలలో 4వ తేదిన పులివెందులకు చెందిన మైనర్ విద్యార్థి ప్రేమించిన అమ్మాయి ప్రేమకు ఒప్పుకోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఊ మార్చి 3న రైల్వేకోడూరుకు చెందిన ఓ మైనర్ బాలికను ఓ వ్యక్తి తాను ప్రేమించానంటూ పెళ్లి చేసుకుని ప్రస్తుతం కట్నం కోసం ఆమెను వేధిస్తున్నాడు. ఊ ఏప్రిల్ 23న సిద్దవటంకు చెందిన ఓ ప్రేమజంట ఇంటినుంచి వెళ్లిపోయారు. తర్వాత తమ ప్రేమ విఫలమై ఇంటికి తిరిగి వచ్చారు. ఊ సెప్టెంబరు 17న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తన ప్రేమ విఫలమైందని కళాశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేనెలలో 21న మైనర్ బాలిక వేరే యువకుడితో స్నేహంగా తిరుగుతుంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయి చేస్తున్నది తప్పని చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఊ 2012లో రాయచోటికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, సావిత్రి తన ఇద్దరు కుమార్తెలను కుమారుల మాదిరిగా కంటికి రెప్పలా చూసుకున్నారు. వారికి మంచి చదువులు చెప్పించారు.పెద్ద కుమార్తె ప్రేమ పేరుతో ప్రేమించిన వాడితో ఇంటి నుంచి వెళ్లిపోయింది. తర్వాత చిన్న కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ప్రేమ పేరుతో ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. గెలిచి చూపించండి... నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదు...యుక్త వయస్సు వచ్చిన యువతీ యువకులు తమ ప్రేమ నిజమని తల్లిదండ్రులను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకుంటే అందరూ మెచ్చుకుంటారు. తర్వాత తాము ఆపదలో ఉన్నా కూడా తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉంటుంది. అలాగని తల్లిదండ్రులను మోసం చేసి తమ దారి తాము చూసుకునేందుకు చేసే ప్రయత్నంలో ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మదిలోనికి రానీయకుండా...ఒకవేళ అలా వస్తే మీకు చాలా ఆప్తులైన వారితో మాట్లాడాలి. మీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న వారి గురించి ఆలోచించండి. ఎన్నో కష్టాలను గట్టెక్కి జీవితంలో విజేతలుగా నిలిచిన వారి జీవితగాథలు చదవండి. ఆదర్శంగా నిలవండి. కులాలు వేరైనా.. మా కులాలు వేరైనా.. 20 ఏళ్లుగా ప్రేమతో అన్యోన్యంగా జీవిస్తున్నాం. విద్యను అభ్యసిస్తున్న తరుణంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. మాపెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అయినా ఇద్దరం ఒక్కటిగా కష్ట, నష్టాలను పంచుకొని జీవిస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు తేజేశ్, జ్ఞానప్రసూన. వారిద్దరినీ చక్కగా చదివించుకుంటున్నాం. నేను అంగన్వాడీ కార్యకర్తగా, నా భర్త సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఎన్నటికీ మా మధ్య కులాల భేదాలు రాలేదు. ఉన్నంతలో హాయిగా ప్రేమ జీవితం కొనసాగిస్తున్నాం. నా భర్త ప్రేమను ఆదర్శంగా తీసుకొని.. ప్రేమ వివాహాలు చేసుకొన్న వారికి అండగా నిలిచి.. చేయూత నిస్తున్నారు. -సూరేపల్లె శ్రీనివాసులు, శ్రీదేవి, రాజంపేట ప్రేమంటే బాధ్యత.. కడప కల్చరల్ : ప్రేమ రెండక్షరాలే. ప్రేమ అంటే ఆకర్షణ కాదు.. అవగాహన ఉండాలి. ముఖ్యంగా ప్రేమంటే పెద్ద బాధ్యత అని ప్రముఖ సైకాలజిస్ట్ ఒ.వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆయన ఇంటర్వ్యూ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం. సాక్షి : ప్రేమంటే ఏమిటి? ఓవీ రెడ్డి : మాటలు చాలవు...ఎవరి అనుభూతి వారిది. సాక్షి : ఏ వయస్సు వారిది నిజమైన ప్రేమ? ఓవీ రెడ్డి : దీనికి వయోభేదం లేదు. సాక్షి : ప్రేమించమని బలవంతం పెట్టడం, కత్తులతో దాడులు, మోసం చేయడం, ప్రేమ వివాహాల్లోనూ విడాకులు? లోపం ఎక్కడుంది? ఓవీ రెడ్డి : అవగాహన లోపమే అరాచకాలకు కారణం. ఆకర్షణనే ప్రేమ అని భావిస్తున్న అమాయకత్వం. సాక్షి : నిజమైన ప్రేమను గుర్తించడం ఎలా? ఓవీ రెడ్డి : ఆకర్షణలో మోహం, ఉద్వేగం, పగటి కలలు కనడం, ఏకాగ్రత లోపం ఉంటాయి. వ్యక్తిని కాకుండా ప్రేమ భావాన్ని మాత్రమే ఇష్టపడతారు. ఏదో ఘనత సాధించినట్లు ఊహాల్లోనే ఉండిపోతారు. అదో రకమైన భ్రమాన్విత మనోమయ ప్రణయోన్మాదంతో నిండిపోతారు. అందానికే విలువనిస్తారు. శరీరంపైనే ఆకర్షణ. నిజమైన ప్రేమికుల్లో భ్రమ, స్వార్థం ఉండవు. పరవశానికి లోనైనా మిగతా వారి భావోద్వేగాలకూ విలువనిస్తారు. అవగాహనతో నడుచుకుంటారు. శారీరక ఆకర్షణకు ప్రాధన్యమివ్వరు. దాపరికరాలు ఉండవు. చెడును కూడా పంచుకోవడానికి సిద్ధమవుతారు. ప్రేమంటే సరదాలే కాదు...జీవితాన్ని నడిపే బాధ్యత అని భావిస్తారు. సాక్షి : మన జిల్లాలో ప్రేమ విషాదాలున్నాయా? ఓవీ రెడ్డి : ఈ ఆరు నెలల్లోనే అలాంటి 20 సంఘటనలు జరిగాయి. ఇందులో విజయాలకంటే వైఫల్యాలే ఎక్కువ. అందుకే ప్రేమ పట్ల నేటికీ సమాజంలో గౌరవం లేదు. సాక్షి : టేనేజీ ప్రేమికులకు మీ సందేశం ఏమిటి? ఓవీ రెడ్డి : ప్రేమంటే యువతీ యువకుల శరీర ఆకర్షణే కాదు...జీవితంలో అంతకుమించిన బాధ్యతలు ఉన్నాయి. వాటిని నెరవేర్చగల శక్తి సంపాదించాకే ఈ వ్యవహారంలోకి దిగాలి. తల్లిదండ్రులు, తోబుట్టువులు, నేస్తాలు, దేశం పట్ల కూడా అదేస్థాయి ప్రేమను చూపాలి. అప్పుడే ఉత్తమ పౌరడనిపించుకుంటాం. వ్యాపారం.. అదుర్స.. ప్రేమికుల దినోత్సవ సందర్భంగా గ్రీటింగ్స్ తదితర వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. గతం కంటే పాతికశాతం కొనుగోలు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నా కేవలం గ్రీటింగ్ కార్డులకు సంబంధించి జిల్లా అంతటా రూ. 50 వేలకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. వాటితోపాటు మగ్గులు, చాక్లెట్లు, రిస్ట్ బ్యాండ్స్, కీ చైన్లు, లాకెట్లు, ఇలా దాదాపు 20 రకాల వస్తువులను యువతీ యువకులు కొంటున్నారు. కడప కల్చరల్ : వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన పేదింటి యువకుడు రాజేష్ (పేరు మార్చాము) హైదరాబాదులో నాల్గవ సంవత్సరం ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మూడవ సంవత్సరంలో ఫేస్బుక్ ద్వారా ప్రకాశం జిల్లాకు చెందిన హైదరాబాదులోని మరో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న శ్రావణి (పేరు మార్చాము) పరిచయం అయింది. నేరుగా కలుసుకున్నారు. కబుర్లు, షికార్లు అయ్యాయి. తల్లిదండ్రులు పంపుతున్న డబ్బుతో అరకొర వసతులతో ప్రైవేటు హాస్టల్లో ఉంటూ బ్రిలియంట్‌గా చదువు సాగిస్తున్న రాజేష్ ప్రేమలో పడ్డ తర్వాత అప్పులు చేయడం ఎక్కువైంది. కళాశాలకు వెళ్లడం బాగా తగ్గింది. కళాశాలలో సహ విద్యార్థులకు, అధ్యాపకులకు విషయం తెలిసి కొందరు ఆత్మీయంగా మందలించారు. మరికొందరు లక్కీఫెలో అంటూ ప్రోత్సహించారు. అకస్మాత్తుగా ఓసారి స్నేహితుడు అతని గదికి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న రాజేష్ కనిపించాడు. ఇతర స్నేహితుల సహకారంతో ఆస్పత్రిలో చేర్చారు. రాజేష్ కాస్త తేరుకున్నాక జరిగిన దానికి కారణమేమిటని అడిగాడు. తన ప్రేమికురాలు తనను మోసం చేసిందని, ఆమెకు తనకంటే ధనికులైన మరో ఇద్దరు ప్రేమికులున్నారని, తాను పేద వాడినని తెలుసుకున్న ఆమె మూడు రోజుల క్రితం తనకు గుడ్‌బై చెప్పిందన్నారు. ప్రేమకు పేదరికం ఏమిటని, తాను నిజాయితీగా ప్రేమించానని, ఆమెకోసం ఇటీవల దాదాపు రూ. 2 లక్షలు అప్పు చేసి జల్సాగా తిప్పానని వాపోయాడు. స్నేహితుడు రాజేష్‌ను ఓదార్చి అతని ప్రియురాలు శ్రావణి చిరునామా తీసుకుని వెళ్లి కలి శాడు. మొదట్లో తాను రాజేష్‌ను నిజాయితీగా ప్రేమించానని, కానీ తనలా మధ్య తరగతి కుటుంబాని కంటే పేదవాడైన రాజేష్‌ను పెళ్లాడి తానేం సుఖ పడతానని ఆమె ప్రశ్నించింది. భర్తను ఎన్నుకునే హక్కు తనకు ఉందని, తన పరిశీల నలోని ఉత్తమం అనిపించిన వాడినే చేసుకుంటానని స్పష్టంగా చెప్పింది. రాజేష్ అనారోగ్య స్థితి గురించి చెప్పి కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా అంత మానసిక బలహీనుడిని చేసుకుని తానేం సుఖ పడతానని నిలదీసింది. నిజానికి అతనికి కూడా తానుగాక మరో రెండు, మూడు ఎఫైర్స్ ఉన్నాయని, వారు రాసుకున్న ఉత్తరాలను తెచ్చి చూపింది. పోలీసు కంప్లైట్ ఇవ్వకుండా వదిలి పెడుతున్నానని హెచ్చరించింది. విషయాన్ని తన మిత్రుడు రాజేష్‌కు తెలి పాడు. సైకాలజిస్ట్ ఓవీఆర్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించగా రాజేష్ దారిన పడ్డాడు. ప్రస్తుతం బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. శ్రావణి కూడా వివాహమై భర్తతో హాయిగానే ఉంది. ప్రేమ...మోసం బ్రిలియంట్‌గా చదువు సాగిస్తున్న రాజేష్ ప్రేమలో పడ్డాడు. కళాశాలకు వెళ్లడం తగ్గించాడు. సహ విద్యార్థులకు, అధ్యాపకులకు విషయం తెలిసి మందలించారు. మరికొందరు లక్కీఫెలో అంటూ ప్రోత్సహించారు. అకస్మాత్తుగా ఓసారి స్నేహితుడు అతని గదికి వెళ్లగా, అపస్మారక స్థితిలో ఉన్న రాజేష్ కనిపించాడు. ఆస్పత్రిలో చేర్చారు. రాజేష్ కాస్త తేరుకున్నాక కారణమేమిటని అడిగితే ప్రేమికురాలు మోసం చేసిందని చెప్పాడు.