వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి | Treatment | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి

Published Sat, Apr 18 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

Treatment

కరీంనగర్ హెల్త్ : ప్రాణంతో ఆస్పత్రిలో చేరిన ఓ యువకడు... శుక్రవారం శవమై కుటుంబ సభ్యులకు చేరాడు. మత్తు ఇంజెక్షన్ వికటించడంతోనే కొడుకు ప్రాణాలు పోయూయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి తల్లిదండ్రులు గట్టు రాజమ్మ, మురళి, భార్య రాణి కథనం.. కమాన్‌పూర్ మండలం జూలపల్లికి చెందిన గట్టు అనిల్ (24) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ‘మిషన్ కాకతీయ’ పూడికతీత పనుల భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ సమీపంలో పనులు నిర్వహిస్తున్నాడు.
 
 గత నెల 31న  పనిచేస్తున్న క్రమంలో లోడుతో ఉన్న లా రీ అదుపుతప్పి పడిపోయింది. ప్రమాదంలో అనిల్ ఎడమచేరుు విరిగింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేకపోవడంతో నగరంలోని అమృత నర్సింగ్ హోమ్ (ఎల్.రాంరెడ్డి హాస్పిటల్)లో చేర్పిం చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యు లు ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. బాధితుడికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సలహాకూడా ఇచ్చారు. కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుని ఈనెల 3వ తేదీన ఆరోగ్యశ్రీ కార్డును తీసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడికి పూర్తిస్థాయి చికిత్స కోసం అడ్మిట్ చేశారు. ఈనెల 8న ఉదయం 9 గంటలకు వైద్యులు ఆపరేషన్ కోసం అనిల్‌ను థియేటర్‌లోకి తీసుకెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల కు డాక్టర్ పిలిచి మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో రోగికి ఫిట్స్ వచ్చినట్లు తెలిపాడు. వైద్యం అందించేందుకు సౌకర్యాలు లేకపోవడంతో వేరే ఆస్పత్రికి పంపిస్తున్నామని తెలిపి సాయంత్రం 3.30 గంటలకు న గరంలోని శ్రీలక్ష్మి  హాస్పిటల్‌లో చేర్పించారు. ఆస్పత్రిలో చే ర్పించిన ప్పటి నుంచి రోగి పరిస్థితి తెలపకుండా వైద్యులు డబ్బులు గుంజుతూ కాలయూపన చేశారు. రోగిని చూడనివ్వలేదు. అనిల్ బతికే ఉన్నాడనే నమ్మకం కోల్పోయిన కుటుంబ సభ్యులు ఈనెల 16న జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
 
 ఆయన రోగి పరిస్థితి తెలుసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి ఆదేశాలు జారీ చేశారు. డీఎంహెచ్‌వో డాక్లర్ల బృందాన్ని హాస్పిటల్‌కు నిర్ధారణకు పంపించారు. వైద్యుల బృందం శుక్రవారం ఉదయం 7 గంటలకు అనిల్ చనిపోరుున ట్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అనిల్ చనిపోయూడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధితుల పక్షాన న్యా యవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరిస్థితిని గమనించిన ఆస్పత్రుల యూజమాన్యాలు అనిల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారుు.
 
 అప్పటికే కోమాలో ఉన్నాడు..
 శ్రీలక్ష్మి హాస్పిటల్‌కు తీసుకువచ్చేటప్పటికే అనిల్ కోమాలో ఉన్నాడు. మత్తు ఇంజక్షన్ వల్లనో.. దేనికో తెలియదు ఆపరేషన్ సమయంలో క్షతగాత్రుడి గుండె ఆగిపోరుుంది. బీపీ తగ్గిపోయి, పల్స్ పనిచేస్తూ కోమాలో ఉన్నాడు. వెంటిలేటర్ ఇస్తూ ఆస్పత్రికి తరలించాం. అప్పుడు మృతుడి తల్లి ఉంది. ఆస్పత్రికి తీసుకువచ్చాక పరిస్థితి విషమంగా ఉందని తెలియచేశాం. రెండు, మూడు రోజులు వైద్య సేవలు అందిస్తే క్యూర్ అయ్యేట్టు కనిపించాడు. తర్వాత బీపీ తగ్గిపోయింది. మెదడుకు ఆక్సిజన్ అంద క అనిల్ చనిపోయూడు.
 - డాక్టర్ వినయ్‌కుమార్, శ్రీలక్ష్మి హాస్పిటల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement