సాక్షి, హైదరాబాద్: మొబైల్ యాప్స్ ద్వారా రుణా లిచ్చి అధికవడ్డీలతో వేధించిన కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 39 చైనా యాప్స్‌కు (ఫిన్‌టెన్ కంపెనీలు) తన ఎన్‌బీఎఫ్‌సీ (నాన్‌బ్యాంకింగ్ ఫైనా న్స్ కంపెనీ) కూడో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సహకరించిన సంస్థ డైరెక్టర్ కమ్ సీఈవో పవిత్రా ప్రదీప్ వాల్వేకర్‌ను ఈడీ శనివారం అరెస్ట్ చేసింది.
కమిషన్ కోసం ఆశపడ్డ సంబంధిత సంస్థ 39 చైనా యాప్స్‌కు తన ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా సర్వీస్ ప్రొవైడర్స్‌గా ఉంటూ, సంబంధిత ఫిన్‌టెక్ కంపెనీల మొబైల్ యాప్ ఏర్పాటుకు సహకరించిందని, ఇందులో భాగంగా కూడోస్‌కు చెందిన కాల్‌సెంటర్ల ద్వారా వేధింపు లకు పాల్పడి దేశవ్యాప్తంగా రూ. 2,224 కోట్ల మేర లోన్స్ రివకరీ పేరుతో వసూలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడించింది.
ఇలా లోన్ల రూపేనా ఇచ్చిన డబ్బుకు అదనంగా వచ్చిన రూ. 544 కోట్ల సొమ్మును ఇతర దేశాలకు సంబంధిత యాప్స్ కంపెనీలు బదిలీ చేసినట్టు, ఈ మొత్తం స్కాంలో కూడోస్ సంస్థ రూ.24 కోట్ల మేర లబ్ధిపొందినట్టు ఈడీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment