
కమల్ మైతి (ఫైల్) పలాష్ పాల్ (ఫైల్)
అమీర్‌పేట: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతోనే ఫ్లంబర్ కమల్ మైతి (50)ని హత్య చేసినట్లు కార్పెంటర్ పలాష్ పాల్ పోలీసులకు తెలిపాడు. బోరబండ ఎస్‌పీఆర్‌హిల్స్ హనుమాన్ స్టోన్ కట్టర్స్ ఇందిరానగర్‌లో ఫేజ్–2లోని శ్రీ మాతా పోచమ్మ సహిత శ్రీ కనకదుర్గా భవానీ, శివదత్త, మారుతీ స్వరూప షిరిడి సాయిబాబా ఆలయం సెల్లార్‌లోని కార్పెంట్ షాపులోని పెట్టెలో అస్తి పంజరం బయట పడిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు పాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పథకం ప్రకారం కమల్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్ పాల్ 2009లో నగరానికి వచ్చి మాదాపూర్‌లోని ఓ నిర్మాణ సంస్థలో కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఫ్లంబర్‌గా పనిచేసే కమల్ మైతితో అక్కడే పరిచయం ఏర్పడింది. పాల్, కమల్‌ది ఒకే ప్రాంతం కావడంతో ఇరు కుటుంబాల సభ్యులు సన్నిహితంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో కమల్ భార్య భవానీ మైతితో పలాష్‌పాల్ వివాహేతర సంబంధం ఏర్పచుకున్నాడు. ఈ విషయం కమల్‌కు తెలియడంతో ఆమెను మందలించడంతో పాటు ఆమె తల్లి దండ్రులకు విషయాన్ని తెలిపాడు. అప్పటి నుంచి భవానీ మైతి పాల్‌కు దూరంగా ఉంటూ వస్తోంది.
భర్త కారణంగానే తనకు ఆమె దూరమైందని భావించిన పలాష్.. కమల్ హత్యకు పథకం వేశాడు. ఎస్‌పీఆర్ హీల్స్‌లో కమల్ ఇంటిని నిర్మిస్తుండగా డోర్స్, కిటికీలు అమర్చే పనిని పాల్ తీసుకున్నాడు. 2020 జనవరి 10న కమల్‌కు ఫోన్ చేసి డోర్స్ అన్నీ తయారు అయ్యాయని వచ్చి చూసుకోవాలని చెప్పాడు. దీంతో కమల్ కార్పెంటర్ షాపులోకి వెళ్లగానే దువ్వడ పట్టే కర్రతో కమల్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు రాత్రి భర్త ఇంటికి రాకపోవడంతో భార్య భాబానీ మైతి మరుసటి రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్యతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.
చదవండి:
Ghatkesar: అత్యాచార ఘటన సూత్రధారి శివ?
Comments
Please login to add a commentAdd a comment