కొడుకు ఎలా ఉన్నాడని అడిగాడు.. అంతలోనే | Father Son Duo Deceased Of Covid 19 In 1 Day Span Bagepalli Karnataka | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకుపై కరోనా పగ.. రోజు వ్యవధిలో ఇద్దరూ మృతి

Published Fri, May 7 2021 10:22 AM | Last Updated on Fri, May 7 2021 2:15 PM

Father Son Duo Deceased Of Covid 19 In 1 Day Span Bagepalli Karnataka - Sakshi

బాగేపల్లి/కర్ణాటక: బాగేపల్లి తాలూకాలోని దేవరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.ఎస్‌. నాగిరెడ్డి (54), అతని కుమారుడు సుబ్బారెడ్డి(29)ని కరోనా పొట్టనబెట్టుకుంది. పరగోడు జీపీ పరిధిలో దేవరెడ్డి పల్లికి చెందిన కాంగ్రెస్‌ నేత, చిక్కబళ్లాపుర జిల్లా సహకార ఒక్కూట డైరెక్టర్‌గా ఉన్న డి.ఎస్‌. నాగిరెడ్డి, చిక్కబళ్లాపుర ఎస్‌జేసీటీఐ ఇంజనీరింగ్‌ కళాశాలలో అధ్యాపకుడైన సుబ్బారెడ్డి మృతులు. వారం క్రితం తండ్రీకొడులకు కరోనా సోకింది. చిక్కబళ్లాపురలో ఓ ఆస్పత్రిలో చేరారు. బుధవారం తనయుడు మరణించగా, ఆ విషయం తండ్రికి చెప్పలేదు. కొడుకు ఎలా ఉన్నాడు అని అడిగితే బాగున్నాడు అని చెప్పారు. గురువారం తండ్రి కూడా ప్రాణాలు విడిచాడు.    

పెయింటర్‌ ఆత్మహత్య 
కెలమంగలం: కెలమంగలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బారందూరు గ్రామానికి చెందిన శంకర్‌ (26) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి తాగుడు అలవాటుండేది. గురువారం ఉదయం 10 గంటలప్పుడు మద్యం మత్తులో ఇంటికెళ్లిన శంకర్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. గమనించిన భార్య త్రివేణి (21) కెలమంగలం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి శవాన్ని  డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు.   

చదవండి: విద్యార్థినికి అబార్షన్‌.. యువకుడికి యావజ్జీవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement