సాక్షి, శివాజీనగర: పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకుంటే అసలుకే మోసం చేశాడు. కరోనా వైరస్ సోకి మృతి చెందిన తండ్రి మృతదేహాన్ని స్వీకరించేందుకు కుమారుడు ససేమిరా అన్న విషాద సంఘటన నగరంలో చోటు చేసుకుంది. చామరాజపేటకు చెందిన కే.సీ.కుమార్ (63) అనే వ్యక్తి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో కరోనా జబ్బుతో చేరారు. జులై 13న పరిస్థితి విషమించి మరణించాడు. (గేమింగ్ స్కామ్‌లో మల్టీలెవల్ మార్కెటింగ్...!)
తండ్రి మృతదేహం తీసుకోవాలని ఆయన కుమారునికి ఆస్పత్రి సిబ్బంది అనేకసార్లు ఫోన్లు చేశారు. వారం రోజులైనా జాడలేదు. కొడుకు వస్తాడేమోనని ఆస్పత్రి సిబ్బంది అప్పటినుంచే మార్చురిలో భద్రపరిచారు. ఇటీవల వెళ్లిన తనయుడు ఆస్పత్రి ఫీజులు చెల్లించి, తండ్రి మృతదేహం తనకు వద్దని చెప్పేసి వెళ్లిపోయాడు. ఆస్పత్రి ఫోన్ నంబర్లను కూడా బ్లాక్ చేశాడు. చివరకు ఆస్పత్రి సిబ్బంది పాలికె సహకారంతో ఆ అభాగ్యుని అంత్యక్రియలను జరిపించారు. చదవండి: ఆప్కో అవినీతిపై కొనసాగిన సీఐడీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment