
గుంటూరు : ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయపడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ప్రేమయ్య తెలిపిన వివరాలు.. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన తిన్నెబోయిన నాగరాజు(40) కుటుంబ సభ్యులు అరుణ, నాగశ్రీ, ఫణిదశ్రీలతో కలసి రెండు రోజుల క్రితం తిరుపతి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం సోమవారం రాత్రి సమయంలో తిరిగి విజయవాడ బయలుదేరారు.
ఈ క్రమంలో తెల్లవారుజామున బుడంపాడు, ఏటుకరు మధ్యలో గడ్డి మడుల సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన హైవే పెట్రోలింగ్ ఆర్‌ఎస్ 2 పోలీసులు క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురికి తరలిం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment