
సాక్షి, గుంటూరు : అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుబడింది. వాటర్ ట్యాంకులో దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం దాచిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు ఏకంగా కొరియర్ సెంటర్లను కేంద్రంగా చేసుకుని అక్రమ మద్యం దందా చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణ నుంచి కొరియర్ ద్వారా మద్యం తెప్పించి అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఎఈబీ అధికారులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment