
సాక్షి, గుంటూరు: తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో జరిగిన ప్రేమికులపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. నిన్న రాత్రి పుష్కర ఘాట్‌లో కూర్చొని ఉన్న ప్రేమజంటపై ఇద్దరు దాడికి దిగారు. యువకుడిని తాళ్లలో కట్టేసిన దుండగులు.. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
దాడి ఘటనపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్
విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌పై పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. పోలీసులు నిందితులు కోసం గాలింపు చేపడుతున్నారని తెలిపారు. బాధితురాలికి మహిళా కమిషన్ అన్ని విధాలా అండగా ఉంటుందని వాసి రెడ్డి పద్మ అన్నారు.
చదవండి: చేతికి చిక్కాక.. గుట్టుచప్పుడు గాకుండా..
గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..
Comments
Please login to add a commentAdd a comment