
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు: మాదేశ్(35) అనే వ్యక్తి హత్య కేసులో అతని భార్యతో పాటు ముగ్గురిని జిగణి పోలీసులు అరెస్ట్‌చేశారు. వివరాలు.. డెంకణికోటకు చెందిన ప్రేమా, మాదేశ్‌లది ప్రేమ వివాహం. వీరికి ఒక కూతురు ఉంది. మాదేశ్ టైలర్‌గా, ప్రేమ జిగణి సమీపంలో గార్మెంట్స్‌లో పనిచేసేది. లాక్‌డౌన్ సమయంలో ఇంటివద్దనే ఉండే ప్రేమకు శివమల్ల అనే వ్యక్తితో సంబంధం ఏర్పడింది.
ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని వెళ్లిపోవాలనుకున్నారు. ఇందుకు అడ్డుగా ఉన్నాడని మాదేశ్‌ను చంపేయాలని నిర్ణయించారు. ఈ నెల 17 తేదీ రాత్రి అతడు ఒంటరిగా ఉండగా రాళ్లతో కొట్టి చంపి పరారయ్యారు. పోలీసులు గాలించి ప్రేమా, శివమల్లుతో పాటు వారికి సహకరించిన మల్లేశ్‌ను అరెస్ట్ చేశారు. (అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం.. మందలించడంతో)
Comments
Please login to add a commentAdd a comment