'పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..?' | Husband Calls Her Wife Untouchable In The Name Of Caste In Gujarat | Sakshi
Sakshi News home page

'పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..?'

Published Sun, Jan 9 2022 2:37 AM | Last Updated on Sun, Jan 9 2022 10:39 PM

Husband Calls Her Wife Untouchable In The Name Of Caste In Gujarat - Sakshi

ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే ఆ భర్త పూర్తిగా మారి సైకోలా తయారయ్యాడు.ఆ యువకుడు అగ్రకులానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని గ్రామస్తులు ఎగతాళి చేస్తున్నారని పునరాలోచనలో పడ్డాడు. భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే నువ్వు అంటరానిదానివని సదరు యువతిని కులం పేరుతో దూషించాడు. తనను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తే అలాంటి మాట అనడంతో ఆ భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా జోతానా తాలుకాకు చెందిన సదరు జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి వయసు 20 ఏళ్లు. యువకుడి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మెమాగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం.. కాగా యువకుడు అగ్ర కులానికి చెందిన వాడు. ఐనప్పటికీ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా సూటిపోటి మాటలతో వేధించేవారు. అలా అందరూ తనను వెక్కిరించడంతో అతడు కూడా సదరు యువతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని భావించాడు. 

పెళ్లికి ముందు బంగారం అని పిలిచిన వాడే పెళ్లి చేసుకున్నాక అంటరానిదానివని అనడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురయింది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి అతడు శృంగారం కోసం వస్తే ఆమె నిరాకరించింది. నన్ను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను నీతో శృంగారం చేయనని తెగేసి చెప్పింది. ఇక దాంతో అతడు కోపంతో భార్యను ఇష్టానుసారం కొట్టి బలవంతంగా అనుభవించసాగాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఆ యువతిని రేప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే ఇదే క్రమంలో ఇటీవల ఐరన్ రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె ఆస్పత్రి పాలయింది. అనంతరం మెహ్సానాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత గత్లోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement