
కర్ణాటక: భార్యను భర్త పిస్తోల్ కాల్చి హత్య చేసిన ఘటన కొడగు సోమవారపేట తాలూకా బెట్టళ్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. కిషన్ అలియాస్ గోపాల్–చస్మా దంపతులు గొడవ పడ్డారు. ఆవేశంతో కిషన్ తన వద్ద ఉన్న పిస్తోల్‌తో చస్మాపై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ విషయాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment