తుపాకి కాల్చటం నేర్పిస్తానని భార్యను.. | Husband Teaching Gun Firing Woman Assassinated In Karnataka | Sakshi
Sakshi News home page

తుపాకి కాల్చటం నేర్పిస్తానని భార్యను..

Published Wed, Jan 13 2021 7:24 AM | Last Updated on Wed, Jan 13 2021 7:24 AM

Husband Teaching Gun Firing Woman Assassinated In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : తుపాకీని కాల్చడం నేర్పిస్తానని భార్యను పొట్టనబెట్టుకున్నాడో భర్త. ఈ సంఘటన కర్ణాటక, తుముకూరు జిల్లాలోని డి.కొరటిగెరెలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలు శారద (28). సోమవారం రాత్రి 9:30 సమయంలో ఆమె భర్త కృష్ణప్ప (35) తన స్నేహితుని వద్దనున్న నాటు తుపాకీని తీసుకొచ్చి దీనిని ఎలా కాల్చాలో చూపిస్తానన్నాడు. ఏం జరిగిందో కానీ తూటా పాయింట్‌ బ్లాంక్‌లో నేరుగా ఆమె తలలోకి దూసుకుపోయింది. అభాగ్యురాలు క్షణాల్లో మృతిచెందింది. తెల్లవారుజామున 2 గంటలకు హెబ్బూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని కృష్ణప్పను అరెస్టు చేశారు. కావాలనే హత్య చేశాడా, ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement