సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన ఘరానా సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేటకు చెందిన నాగేశ్వర రావుకు సైబర్ నేరస్తులు రూ.43 లక్షలను కుచ్చుటోపి పెట్టారు. అతడికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రాగా, స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆశ చూపడంతో సదరు అమౌంట్‌ను సైబర్ నేరస్తుల ఖాతాలోకి నాగేశ్వరరావు డిపాజిట్ చేశాడు. తిరిగి ఫోన్ చేస్తే వారి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment