stock market scam
-
స్టాక్ మార్కెట్ కుంభకోణంలో మోదీ, షా: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్ మార్కెట్కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటూ వారిచి్చన సలహాలు నమ్మి రిటైల్ ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఫేక్’ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన రోజు స్టాక్ మార్కెట్ సూచీలు విపరీతంగా పెరిగిపోయాయని, ఈ నెల 4న ఎన్నికల అసలు ఫలితాలు వెల్లడయ్యాక సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారని, షేర్లు కొనాలంటూ ప్రజలకు సూచించారని చెప్పారు. స్టాక్ మార్కెట్లు, షేర్ల గురించి ప్రధానమంత్రి, హోంమంత్రి బహిరంగంగా మాట్లాడడం దేశంలో ఇదే మొదటిసారి అని గుర్తుచేశారు. ప్రధానమంత్రి, హోంమంత్రి చేసే పని స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు లెక్క తప్పుతాయని బీజేపీ నేతలకు ముందే తెలుసని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్ల వరకు వచ్చే అకాశం ఉందని అంతర్గత అధికారిక సర్వేలో తేలిందన్నారు. 200 నుంచి 220 సీట్లు వస్తాయంటూ నిఘా సంస్థలు మోదీ ప్రభుత్వానికి నివేదించాయని తెలిపారు. ఇదంతా తెలిసి కూడా 5 కోట్ల కుటుంబాలకు పెట్టుబడి సలహాలు ఎందుకిచ్చారని మోదీ, అమిత్ షాపై రాహుల్ మండిపడ్డారు. రిటైల్ ఇన్వెస్టర్లను ముంచేశారు షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ పెట్టుబడి సలహాలను ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన వారికి, బీజేపీకీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. మోదీ, అమిత్ షా సలహాలను విశ్వసించి పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కొందరు బడాబాబులు కాజేశారని ఆరోపించారు. ఇన్వెస్టర్లను ముంచేసి రూ.వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. మోదీ, అమిత్ షాతోపాటు తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించిన వారిపై దర్యాప్తు జరపాలని రాహుల్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడించిన ప్రకారం ఎప్పుడేం జరిగిందంటేమే 13: జూన్ 4 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు) కంటే ముందే షేర్లు కొనేసి పెట్టుకోండి అని అమిత్ షా సూచించారు. మే 19: జూన్ 4న స్టాక్ మార్కెట్ రికార్డులు బద్ధలవుతాయి. కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 1: సార్వత్రిక ఎన్నికల్లో తుది దశ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జూన్ 3: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన మెజారీ్టతో అధికారంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో పుంజుకుంది. సూచీలు ఆల్‌టైమ్ అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. జూన్ 4: ఓట్ల లెక్కింపు మొదలైంది. బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం లేదని తేలింది. దాంతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. మార్కెట్లో పెట్టుబడి పెట్టిన చిన్నస్థాయి ఇన్వెస్టర్ల సంపద రూ.30 లక్షల కోట్ల మేర కరిగిపోయింది.పస లేని ఆరోపణలు పీయూష్ గోయల్ మండిపాటు స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురైన ఓటమిని తట్టుకోలేక ఇలాంటి పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఇన్వెస్టర్లను దగా చేయొద్దని సూచించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత మన మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అధిక రేట్ల వద్ద భారీగా షేర్లు కొన్నారని, వాటిని భారత ఇన్వెస్టర్లు విక్రయించి, లాభం పొందారని పీయూష్ గోయల్ వివరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.67 లక్షల కోట్లు ఉన్న స్టాక్ మార్కెట్ విలువ ఇప్పుడు రూ.415 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. దేశీయ, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా లబ్ధి పొందారని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టాక్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందన్నారు. మార్కెట్లో నమోదైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ 4 రెట్లు పెరిగిపోయిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని గుర్తుచేశారు. -
అతి పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ వెనుక మోదీ, షా : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ‘అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణం’లో భాగమైన ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మార్కెట్లో ఒడిదుడుకులకు, ఇటీవల పోల్స్‌కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరూ ఎన్నికల ప్రచార సమయంలో ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు.మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో జూన్ 3న స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని, ఎన్నికల ఫలితాల రోజు (జూన్ 4న) భారీగా నష్టపోయాయని రాహుల్‌గాంధీ అన్నారు. దీనివల్ల రిటైల్ ఇన్వెస్టర్లు సుమారు రూ.30 లక్షల కోట్లు కోల్పోయారన్నారు. ఇదొక పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణమని రాహుల్ ఆరోపించారు. మోదీ, అమిత్‌షాతోపాటు దేశంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోదీ, అమిత్ షా దేశంలోని ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని బీజేపీ నేతలకు ముందే తెలుసని ఆరోపించారు. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ సంబంధం ఏంటని నిలదీశారు.स्टॉक मार्केट घोटाले से जुड़े हमारे 3 सवाल:1. PM नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह ने देश की जनता को बाजार में निवेश करने की सलाह क्यों दी?2. प्रधानमंत्री, गृह मंत्री ने दोनों इंटरव्यू अडानी के उन चैनल्स को दिए , जिनके ऊपर SEBI की जांच जारी है। ऐसे में उन चैनल्स का क्या रोल… pic.twitter.com/20M4woLltv— Congress (@INCIndia) June 6, 2024 ఫేక్ ఎగ్జిట్ పోల్స్ మరునాడు జూన్ 3న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయని, ఆ తర్వాత జూన్ 4వ తేదీన కుప్పకూలాయని అన్నారు. సెబీ విచారణలో ఉన్న ఒక బిజినెస్ గ్రూపునకు చెందిన ఒకే మీడియా గ్రూపుకు మోదీ, అమిత్ షా ఇద్దరూ ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారని, స్టాక్ మార్కెట్‌ను తారుమారు చేయడానికా అంటూ ప్రశ్నలు సంధించారు.ఎగ్జిట్ పోల్స్ ముందురోజు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ లావాదేవీల పట్టికను విలేకరుల సమావేశంలో రాహుల్ ప్రదర్శించారు. ఆ రోజు లావాదేవీల్లో పాల్గొన్నదెవరు? అంతిమంగా లబ్ధి పొందిందెవరు? అంటూ ప్రశ్నించారు. దీన్ని కొందరు విదేశీ మదుపరులు సద్వినియోగం చేసుకున్నారన్నారని అన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోగా.. కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ, షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు.కాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను తాకుతాయని మే 23న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జూన్ 4న బీజేపీ రికార్డు స్థాయి విజయం సాధిస్తుందని, స్టాక్ మార్కెట్ కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు. -
సాక్షి మనీ మంత్ర: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి 86 పాయింట్లు పుంజుకుని 21,743 వద్దకు చేరింది. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 72,132 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం రేంజ్‌బౌండ్‌లోనే ట్రేడయ్యాయి. యూఎస్ బాండ్ ఈల్డ్స్ కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. భారత్ స్టాక్‌మార్కెట్ సూచీలు జీవితకాలపు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. దాంతో మదుపరులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఫెడ్ మినట్స్ మీటింగ్ ప్రకారం ద్రవ్యోల్బణం తగ్గకపోతే కీలక వడ్డీరేట్లు అవసరమైతే పెంచే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దాంతో మదుపరులు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలిసింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, మారుతి సుజుకీ స్టాక్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 141 పాయింట్లు లాభపడి 21,658 వద్దకు చేరింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పుంజుకుని 71,847 వద్ద స్థిరపడింది. గడిచిన ట్రేడింగ్ సెషన్లో ఐటీస్టాక్‌లు భారీగా కుంగిన విషయం తెలిసిందే. అయితే గురువారం మార్కెట్లో కొంత రేంజ్‌బౌండ్‌లోనే ఐటీ స్టాక్‌లు కదలాడాయి. రానున్న త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన మేరకు ఫలితాలు రావనే ఊహాగానాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇటీవల మార్కెట్లు భారీగా ర్యాలీ అవడంతో మదుపరులు కొంత లాభాలు స్వీకరించినట్లు తెలుస్తోంది. బ్యాకింగ్ సూచీ రేంజ్బౌండ్లో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురువారం బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 78.38 డాలర్ల వద్దకు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం రూ.666.34 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు సైతం రూ.862.98 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేశారు. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే, పవర్‌గ్రిడ్, ఇన్పోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్లోకి చేరాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, మారుతిసుజుకీ, హెచ్‌యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో నష్టాల్లోకి జారుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
'1992 స్కాం' వెబ్ సిరీస్‌లో రాకేష్ ఝున్‌ఝున్ వాలా క్యారక్టర్ ఎవరిదో తెలుసా?
1988 నుంచి 1991వరకు దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఇయర్స్. అప్పటికే 100ఏళ్ల చరిత్ర ఉన్న బాంబే స్టాక్ ఎక్ఛేంజీలో ఎప్పుడూ చూడని కొత్త పోకడ మొదలైంది. ఏరోజుకారోజు ఇన్వెస్ట్ చేయడం. లాభాలు గడించింది. ఇన్వెస్ట్ చేయడం మళ్లీ లాభాల కోసం వెయిట్ చేయడం. ఇలా బుల్ రన్‌తో సెన్సెక్స్ రోజుకో రికార్డ్ సృష్టించింది. కానీ 1992 ఏప్రిల్ 23 బాంబే స్టాక్ మార్కెట్లో భారీ స్కాం జరిగిందంటూ ఇన్వేస్టిగేటీవ్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ బాంబు వేసింది. ఆమె రాసిన ఆర్టికల్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) ఇక సుచేతా దలాల్ ఎవరు? ఆమె హర్షద్ మెహతాను ఎందుకు టార్గెట్ చేసింది. ఆ స్కాం ఎలా చేశారు? బేర్ కార్టెల్ ఎవరు? ఇవన్నీ అటుంచితే. ఆ స్కాం గురించి 'స్కాం 1992' పేరుతో ఓ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. అందులో హర్షద్ మెహతా హవా జరిగే సమయంలో ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఎలాంటి ఒడిదుడుకు లోనయ్యారనే అంశం బాగా హైలెట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమాలోని రియల్ లైఫ్ క్యారక్టర్స్ ఎవరివో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదీ చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 2021 నాటి వీడియో వైరల్ ♦ ప్రతిక్ గాంధీ - హర్షద్ మెహతా ♦ హర్షద్ మెహతా తమ్ముడు అశ్విన్ మెహత కేరక్టర్లో హేమంత్ కేర్ యాక్ట్ చేశారు ♦ హర్షద్ మెహతా భార్య జ్యోతి మెహతా పాత్రలో అంజలీ బారోత్ యాక్ట్ చేశారు ♦ సుచేతా దలాల్ పాత్రలో శ్రేయ దన్వంతరీ యాక్ట్ చేశారు ♦ డెబాషిస్ పాత్రలో ఫైసల్ రషీద్ యాక్ట్ చేశారు. ♦ మనుముంద్రా కేరక్టర్లో సతీష్ కౌషిక్ యాక్ట్ చేశారు ♦ రాధా కిషన్ దమానీ పాత్రలో పరేష్ గంట్రా యాక్ట్ చేశారు ♦ రాకేష్ ఝున్ ఝున్ వాలా పాత్రలో కెవిన్ డేవ్ నటించారు ♦ రాం జఠ్మలానీ పాత్రలో మిథులేష్ చతుర్వేదీ యాక్ట్ చేశారు. -
చిత్ర రామకృష్ణకు సెబీ భారీ షాక్!
సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)కీ, ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణకు భారీ షాకిచ్చింది. ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలపై కేసు దర్యాప్తు జరుగుతుండగా..సెబీ ఆమెకు ఫైన్ విధించింది. ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణ రోజు రోజుకి మరింత కష్టాల్లో చిక్కుకుంటున్నారు. ఎన్ఎస్ఈలో సీఈవోగా విధులు నిర్వహించే సమయంలో అవకతవకలకు పాల్పడినట్లు పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి అమెపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో సెబీ..ఎన్‌ఎస్‌ఈకీ రూ.7 కోట్లు, చిత్ర రామకృష్ణ రూ5కోట్లు, ఆనంద్ సుబ్రమణియన్‌కు రూ.5కోట్లు, వే 2 హెల్త్ బ్రోకర్‌కు రూ.6కోట్లు ఫైన్ విధించింది. అంతా యోగి మహిమ చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈలో సీఈవోగా విధులు నిర్వహించే సమయంలో ఆమె ఓ హిమాలయ యోగి ఆదేశాల మేరకు పనిచేశారని, కీలక సమాచారాన్ని లీక్ చేశారని,అనర్హులకు పదవులిచ్చారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి👉 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
స్టాక్ మార్కెట్ పేరుతో మోసపోయిన నగరవాసి..!
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన ఘరానా సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేటకు చెందిన నాగేశ్వర రావుకు సైబర్ నేరస్తులు రూ.43 లక్షలను కుచ్చుటోపి పెట్టారు. అతడికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ రాగా, స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆశ చూపడంతో సదరు అమౌంట్‌ను సైబర్ నేరస్తుల ఖాతాలోకి నాగేశ్వరరావు డిపాజిట్ చేశాడు. తిరిగి ఫోన్ చేస్తే వారి నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చదవండి: E Challan: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
ఫలితాలపై ఆశలు... మార్కెట్లకు జోష్
ముంబై: ఐఐపీ, ద్రవ్యోల్బణం గణాంకాలు మెరుగ్గా ఉండటంతో పాటు కార్పొరేట్ల ఆదాయాలపై ఆశావహ ధోరణులతో దేశీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారమూ లాభాల్లో ముగిసింది. సెషన్ ఆఖర్లో కొంత ఒడిదుడుకులకు లోనైనప్పటికీ సూచీలు ఆరు వారాల గరిష్ట స్థాయిలో క్లోజయ్యాయి. మార్కెట్స్ వరుసగా ఏడు సెషన్స్ లాభాల్లో ముగియడం.. గతేడాది నవంబర్ తర్వాత ఇదే తొలిసారి. గురువారం ట్రేడింగ్ పూర్తయిన తర్వాత వెల్లడైన స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, ఇన్ఫోసిస్ ఫలితాల ముందు ఆశావహ ధోరణితో పాటు అటు ఆసియాలోని ఇతర మార్కెట్స్ లాభాల్లో ఉండటం దేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటుకు ఊతమిచ్చినట్లు బ్రోకింగ్ సంస్థలు పేర్కొన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్ల లాభంతో 34,193 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 10,481 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 34,313 –34,104 మధ్య కదలాడి చివరికి 34,193 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫిబ్రవరి 27 నాటి 34,346 పాయింట్ల తర్వాత ఇదే గరిష్ట స్థాయి ముగింపు. గడిచిన ఏడు సెషన్స్‌లో సూచీ ఏకంగా 1,174 పాయింట్లు పెరిగింది. అటు నిఫ్టీ కూడా 10,520–10,451 పాయింట్ల మధ్య తిరుగాడి చివరికి 0.21 శాతం లాభంతో 10,481 వద్ద క్లోజయ్యింది. దీంతో రెండు సూచీలు వరుసగా మూడోవారమూ లాభాల్లో ముగిసినట్లయింది. ఐటీ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంకులు, మెటల్ షేర్స్ ర్యాలీ జరిపాయని, వరుసగా రెండు వారాల లాభాల తర్వాత అమ్మకాల ఒత్తిడితో పీఎస్‌యూ బ్యాంక్ సూచీ నష్టపోయినట్లు ఎపిక్ రీసెర్చ్ సీఈవో ముస్తఫా నదీమ్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడయ్యాయి. సెన్సెక్స్‌లో అదానీ టాప్..:సెన్సెక్స్ షేర్లలో అదానీ పోర్ట్స్ అత్యధికంగా 2.66 శాతం, విప్రో 2.28 శాతం లాభపడ్డాయి. ఆర్థిక ఫలితాల వెల్లడికి ముందు ఇన్ఫీ 0.58% పెరిగింది. ఎంబైబ్ సంస్థలో 73 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నామన్న ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.22% పెరిగింది. సూచీల వారీగా చూస్తే మెటల్ ఇండెక్స్ 1%, హెల్త్‌కేర్ 0.56 శాతం, ఐటీ 0.50 శాతం, రియల్టీ 0.44% పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
అమెరికా స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భారతీయుడు
న్యూయార్క్: అమెరికాలోని స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భారత సంతతికి చెందిన స్టాక్ బ్రోకర్ పై ఫెడరల్ అధికారులు తీవ్ర మైన ఆర్థిక నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఒక సంస్థకు చెందిన షేర్ల అమ్మకాల లావాదేవీల్లో ఉద్దేశపూర్వకంగా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రణవ్ పటేల్ (35)ను ఆరెస్టు చేశారు. ఫ్లోరిడా స్టాక్ బ్రోకర్ పటేల్ స్టాక్ తారుమారు పథకంలో భాగస్వామి అయ్కాడని ఎఫ్‌బీఐ అధికారులు బుధవారం ప్రకటించారు. సుమారు 871 కోట్ల, 54 లక్షల రూపాయల (131 మిలియన్ డాలర్ల) కుంభకోణానికి పాల్పడినట్టు అరోపించారు. అమెరికాలోని ఫోర్ట్ లాడర్డల్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన అధికారులు అనంతరం పటేల్ ను న్యాయ విచారణ కోసం బ్రూక్లిన్ కు తరలించారు. ఎల్ ఈడీ లైటింగ్ ఉత్పత్తుల ప్రపంచ వ్యాప్త పంపిణీదారుగా చెప్పుకుంటున్న ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ కంపెనీతో కుమ్మక్కయ్యి భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎఫ్‌బీఐ అభియోగాలను నమోదు చేసింది. పటేల్ సహా మరో తొమ్మిది మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ బృందం అమెరికా స్టాక్ మార్కెట్ నాస్ డాక్ లోని ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ షేర్ల ధరను అక్రమంగా పెంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఫెడరల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ ఎల్. కాపెర్స్ బ్రూక్లిన్ లో చెప్పారు. ఫోర్స్ ఫీల్డ్స్ సంస్థ, మిచెల్, ప్రణవ్ పటేల్ తదితర స్టాక్ బ్రోకర్ల వ్యాపార భాగస్వామ్యంతో ఈ కుంభకోణానికి పాల్పడిందని ఎఫ్‌బీఐ ప్రకటించింది. పటేల్, మరో నలుగురు స్టాక్ బ్రోకర్లకు 2014 లో విదేశీ బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి ముడుపులు చెల్లించారన్నారు. ముఖ్యంగా స్టాక్ బ్రోకర్ నవీద్ ఖాన్ నేతృత్వంలో ఈ పథక రచన జరిగిందన్నారు. తక్కువ పెట్టుబడితో పాటు, వ్యాపార కార్యక్రమాలను లేకుండానే... వేల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా మార్కెట్ ను, ఇతర పెట్టుబడిదారులను నమ్మించారన్నారు. దీంతో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు 871 కోట్ల రూపాయలను నష్టపోయినట్టు ఎఫ్‌బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో రోడ్రిగ్యూజ్ తెలిపారు. ఆర్థిక నేరాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యుద్ధంలో భాగంగా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్ దీనిపై దర్యాప్తు చేసింది. సెక్యూరిటీల మోసం, కుట్ర, వైర్ ఫ్రాడ్ , అక్రమ నగదు బదిలీ, తప్పుడు ప్రకటన తదితర అభియోగాలపై చర్యలు తీసుకోనుంది.