దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి 86 పాయింట్లు పుంజుకుని 21,743 వద్దకు చేరింది. సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 72,132 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా మార్కెట్లు గురువారం రేంజ్‌బౌండ్‌లోనే ట్రేడయ్యాయి. యూఎస్ బాండ్ ఈల్డ్స్ కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. భారత్ స్టాక్‌మార్కెట్ సూచీలు జీవితకాలపు గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. దాంతో మదుపరులు కొంత లాభాల స్వీకరణకు మొగ్గుచూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఫెడ్ మినట్స్ మీటింగ్ ప్రకారం ద్రవ్యోల్బణం తగ్గకపోతే కీలక వడ్డీరేట్లు అవసరమైతే పెంచే అవకాశం కూడా ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. దాంతో మదుపరులు మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలిసింది.
సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టీసీఎస్, మారుతి సుజుకీ స్టాక్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)
Comments
Please login to add a commentAdd a comment